Priyanka Jain: ప్రియాంక చేతికి కెప్టెన్సీ - పాపం అమర్‌దీప్, అరుపులే మిగిలాయ్!
Bigg Boss 7 Telugu: సీజన్ మొదటి నుండి ప్రియాంక ఎన్నో టాస్కులు ఆడినా.. ఒక్కసారి కూడా కెప్టెన్సీ తన చేతికి రాలేదు. ఫైనల్‌గా ఇన్నాళ్లకు తను కెప్టెన్ అయ్యి చూపించింది.
బిగ్ బాస్ సీజన్ 7లో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. అందులో ఇంకా కెప్టెన్సీని ఎక్స్‌పీరియన్స్ చేయని కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. ఈ సీజన్ పూర్తయ్యేలోపు ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని ఆ బ్యాడ్జ్ దక్కాలని కంటెస్టెంట్స్ అంతా కోరుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు కెప్టెన్సీ ఛాన్స్ రానివారికి కూడా ఆ ఛాన్స్ వచ్చేలా చేయాలని ఇతర కంటెస్టెంట్స్ సైతం అనుకుంటున్నారు. వారు కోరుకున్నట్టుగానే ఇప్పటివరకు కెప్టెన్ అవ్వని ప్రియాంక.. మొదటిసారి కెప్టెన్సీ టాస్కులో గెలిచి కెప్టెన్ అయినట్టు సమాచారం. ఎన్నో టాస్కులలో చివరి వరకు వెళ్లి ఓడిపోయిన ప్రియాంక.. ఫైనల్‌గా బిగ్ బాస్ సీజన్ 7లో కెప్టెన్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న 10 మంది కంటెస్టెంట్స్‌లో ప్రియాంక, అమర్, అశ్విని, రతిక.. ఇప్పటివరకు కెప్టెన్స్ అవ్వలేదు. అందులో అశ్విని.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. రతిక కూడా ఒకసారి ఎలిమినేట్ అయ్యి సెకండ్ ఛాన్స్‌లాగా హౌజ్‌లోకి అడుగుపెట్టింది. కానీ ప్రియాంక, అమర్‌దీప్ మాత్రం ముందు నుంచి కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటికీ ఎన్నో కెప్టెన్సీ టాస్కుల్లో పాల్గొన్నారు. దీనికంటే ముందు పవర్ అస్త్రా కోసం కూడా ఇద్దరూ కష్టపడ్డారు. అయినా ఒక్కసారి కూడా పవర్ అస్త్రా కానీ, కెప్టెన్సీ కానీ వీరిని వరించలేదు. కానీ తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్కులో ప్రియాంక గెలిచి కెప్టెన్‌గా నిలిచిందని సోషల్ మీడియాలో ప్రసారం సాగుతోంది.
ఈవారమంతా ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ పోటీపడ్డారు. ఈ టాస్కులో కూడా ప్రియాంక గెలవడానికి ప్రయత్నించినా.. చివరి నిమిషంలో ఓడిపోయింది. తను కరెక్ట్‌గానే ఆడిందని, ఎవిక్షన్ ఫ్రీ పాస్ తనకు చెందాలని శోభా శెట్టి ప్రయత్నించినా.. ఇతర కంటెండర్స్ దానికి అంగీకరించలేదు. దీంతో ఎవిక్షన్ ఫ్రీ పాస్ యావర్ చేతికి వెళ్లింది. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ అయిపోగానే కంటెస్టెంట్స్ అంతా కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఈ టాస్క్‌లో ఐల్యాండ్స్‌పై నుంచి నడుచుకుంటూ వెళ్లి.. అవతల వైపు ఉన్న ఇటుకలను ఇటువైపు కంటెస్టెంట్స్ పేరు మీద ఉన్న స్టాండ్స్‌పై పెట్టాల్సి ఉంటుంది. తక్కువ ఇటుకలు పెట్టిన కంటెస్టెంట్స్ ఒక్కొక్క లెవెల్ తర్వాత తప్పుకోవాల్సి ఉంటుంది. అలా తప్పుకున్న కంటెస్టెంట్స్.. సంచాలకులుగా వ్యవహరించాలి.
ఈ కెప్టెన్సీ టాస్క్‌లో ముందుగా రతిక, ఆ తర్వాత గౌతమ్.. తక్కువ ఇటుకలు పెట్టడంతో రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత అశ్విని, శోభా కూడా ఓడిపోయి వెనక్కి తగ్గారు. చివరిగా అమర్‌దీప్, శివాజీ, ప్రశాంత్, యావర్‌లతో ప్రియాంక పోటీపడింది. చివరిగా పల్లవి ప్రశాంత్, అర్జున్, అమర్ దీప్, ప్రియాంక కెప్టెన్సీ కంటెస్టెంట్‌లుగా మిగిలారు. అయితే, బిగ్ బాస్ మరో టాస్క్‌తో కెప్టెన్‌ను నిర్ణయించే బాధ్యతను హౌస్‌మేట్స్‌కు ఇచ్చాడు. నలుగురినీ బ్రిక్స్‌ను హైట్ పెంచాలని చెప్పాడు. చివరిగా ఎవరి బ్రిక్స్ బిల్డింగ్ ఎక్కువ హైట్ ఉంటుందో.. వారు కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో హౌస్‌మేట్స్ అంతా ముందుగా పల్లవి ప్రశాంత్, అర్జున్ టార్గెట్ చేసుకున్నారు. దీంతో అమర్, ప్రియాంక మధ్య పోటీ నెలకొంది. చివరికి అంతా అమర్ దీప్ బ్రిక్స్‌ను పడగొట్టి ప్రియాంకను కెప్టెన్ చేశాడు.
సీజన్ మొదలయినప్పటి నుంచి ప్రియాంక ఎన్నో టాస్కుల్లో ఆడింది, కొన్ని టాస్కుల్లో చివరి దశ వరకు కూడా చేరుకుంది, పవర్ అస్త్రా కోసం జుట్టును కూడా కత్తిరించుకోవడానికి సిద్ధమయ్యింది. కానీ పలుమార్లు తన ఆట సరిగా లేకపోవడం వల్ల, చాలాసార్లు లక్ కలిసిరాకపోవడం వల్ల కూడా ప్రియాంక వెనుకబడింది. ఫైనల్‌గా ఇన్నాళ్లకు కెప్టెన్ అయ్యింది.
Also Read: అమర్ మాట కూడా వినని శోభ, సంచాలకురాలిగా ఫెయిల్? కెప్టెన్సీ టాస్క్‌లోనూ అదే రచ్చ!