News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

నీ ఇంట్లో వాళ్లు ఇలాగే పెంచారా? నిన్ను చూస్తుంటే సిగ్గేస్తోంది - నటి కస్తూరి ఫైర్, ‘బిగ్ బాస్’పై రచ్చ!

సీరియల్ నటి కస్తూరి తమిళ బిగ్ బాస్ షో పై ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈమె చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజెన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

FOLLOW US: 
Share:

‘గృహలక్ష్మి’ సీరియల్ తో బుల్లితెరపై నటిగా భారీ గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి తాజాగా తమిళ 'బిగ్ బాస్' పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఒక ఇంట్లో చాలామందిని ఉంచి వారి ఆర్టిఫిషియల్ ఫీలింగ్స్ ని చూపించే షోను నేను పట్టించుకోను. నా దగ్గర టీవీ లేదు. నాకు అంత టైం లేదు. ఓపిక, ఇంట్రెస్ట్ లేదు’’ అంటూ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతో ఆ ట్వీట్ కాస్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 

తమిళంలో ఈ ఆదివారమే 'బిగ్ బాస్' కొత్త సీజన్ ప్రారంభమైంది. తాజాగా ఈ షోపై సీరియల్ నటి కస్తూరి పెట్టిన ట్వీట్ కి నెటిజెన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కస్తూరి తాజాగా తన ట్వీట్ లో పేర్కొంటూ.." ఒక ఇంట్లో చాలామందిని ఉంచి వారి ఆర్కిఫిషియల్ ఫీలింగ్స్ చూపించే షోను నేను పట్టించుకోను. నా దగ్గర టీవీ లేదు. నాకు అంత టైం, ఓపిక, ఇంట్రెస్ట్ కూడా లేవు. కుటుంబం, దాని బాధ్యతలు, వర్క్ నాకు ఉన్నాయి. నేను బిగ్ బాస్ చూడడం లేదు" అంటూ రాస్కొచ్చింది.

దీనిపై ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. "నువ్వు డబ్బుల కోసమే షోకి వెళ్లావు కదా. మళ్లీ ఇప్పుడు అలా ఎందుకు మాట్లాడుతున్నావ్" అని కామెంట్ చేస్తే, మరో నెటిజన్ మాత్రం కాస్త శృతి మించి కామెంట్ పెట్టాడు. "అవునులే నీకు గంటకు 5000 వస్తాయి కదా" అంటూ కాస్త అసభ్యకరంగా ఆ నెటిజన్ కామెంట్ చేస్తే దానికి కౌంటర్ ఇచ్చిన కస్తూరి.." మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలానే పెంచారా? నిన్ను చూస్తుంటే సిగ్గేస్తోంది" అని ఆ నెటిజన్ పై సీరియస్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్స్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా గతంలో ఇదే తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో కస్తూరి కంటెస్టెంట్ గా పాల్గొంది. ఆ సీజన్లో వివాదాస్పద నటి వనిత విజయ్ కుమార్ కూడా ఓ కంటెస్టెంట్ గా ఉంది.

దీంతో బిగ్ బాస్ షో అంటే అసలు ఇష్టం లేదని చెప్పిన నువ్వు గతంలో బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వెళ్లావు? అంటూ రకరకాలుగా నెటిజన్స్ సోషల్ మీడియాలో కస్తూరిని నిలదీస్తున్నారు. ఒకప్పుడు సౌత్ సినిమాల్లో హీరోయిన్ గా అలరించిన కస్తూరి ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ తో ఆకట్టుకుంటోంది. తెలుగులో 'నిప్పురవ్వ', 'సోగ్గాడి పెళ్ళాం', 'చిలక్కొట్టుడు', 'ఆకాశవీధిలో', 'అన్నమయ్య' వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో అక్క, వదిన క్యారెక్టర్స్ తో కూడా మెప్పించింది.

ఇక సోషల్ మీడియాలో పలు సామాజిక అంశాలపై మాట్లాడుతూ ఎప్పుడూ ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార కాదంటూ ఓసారి, రాముడికి మీసాలు ఉంటాయా అని ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి, ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ లో జరిగిన గొడవపై తనదన శైలిలో స్పందించింది. అలా నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక టాపిక్ పై రియాక్ట్ అయ్యే కస్తూరిని ఇప్పుడు నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.

Also Read : సుమను ఘోస్ట్ అనేసిన సుధీర్ బాబు - ‘అల్లూరి’ డైలాగ్‌తో అదరగొట్టేశాడు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 04 Oct 2023 11:25 PM (IST) Tags: Kasthuri Shankar Serial Acctress Kasthuri Acctress Kasthuri Acctress Kasthuri About BiggBoss TV Acctress Kasthuri

ఇవి కూడా చూడండి

Bigg Boss Telugu 7: ఫినాలే అస్త్ర కోసం శోభా ఏడుపు - పడవల టాస్క్‌లో గౌతమ్ ‘బోల్తా’

Bigg Boss Telugu 7: ఫినాలే అస్త్ర కోసం శోభా ఏడుపు - పడవల టాస్క్‌లో గౌతమ్ ‘బోల్తా’

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఎలిమినేషన్ - డేంజర్ జోన్‌లో ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, శివాజీ ఎఫెక్ట్ గట్టిగా పడిందా?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఎలిమినేషన్ - డేంజర్ జోన్‌లో ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, శివాజీ ఎఫెక్ట్ గట్టిగా పడిందా?

Sivaji: అమరావతి రైతుల కోసం పోరాడిన శివాజీ? ‘బిగ్ బాస్’ ఓట్ల కోసం కొత్త ప్రచారం - ఈ మెసేజ్ మీకు వచ్చిందా?

Sivaji: అమరావతి రైతుల కోసం పోరాడిన శివాజీ? ‘బిగ్ బాస్’ ఓట్ల కోసం కొత్త ప్రచారం - ఈ మెసేజ్ మీకు వచ్చిందా?

Amardeep vs Priayanka: ఫైనల్ అస్త్రా కోసం అమర్, ప్రియాంక మధ్య సీరియస్ ఫైట్ - చెయ్యి కొరికేసిన వంటలక్క

Amardeep vs Priayanka: ఫైనల్ అస్త్రా కోసం అమర్, ప్రియాంక మధ్య సీరియస్ ఫైట్ - చెయ్యి కొరికేసిన వంటలక్క

Bigg Boss 7 Telugu: అర్జున్‌పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ శివాజీ రివర్స్ స్ట్రాటజీ - ‘బిగ్ బాస్’పై అలిగిన SPY

Bigg Boss 7 Telugu: అర్జున్‌పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ శివాజీ రివర్స్ స్ట్రాటజీ - ‘బిగ్ బాస్’పై అలిగిన SPY

టాప్ స్టోరీస్

Andhra News : సొంత పార్టీ పెట్టుకుని అయినా విశాఖలోనే పోటీ - మరోసారి లక్ష్మీనారాయణ క్లారిటీ !

Andhra News :  సొంత పార్టీ పెట్టుకుని అయినా విశాఖలోనే పోటీ - మరోసారి లక్ష్మీనారాయణ క్లారిటీ !

Voting Procedure: ఇలా చేస్తే మీరు ఓటు వేసినా నో యూజ్‌! - పర్ఫెక్ట్ ఓటింగ్‌కి ఈ సూచనలు పాటించండి

Voting Procedure: ఇలా చేస్తే మీరు ఓటు వేసినా నో యూజ్‌! - పర్ఫెక్ట్ ఓటింగ్‌కి ఈ సూచనలు పాటించండి

Indian Cricket Team: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్‌ కాంట్రాక్ట్ పొడిగింపు

Indian Cricket Team: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్‌ కాంట్రాక్ట్ పొడిగింపు

Telangana Elections 2023 : దేవుడి మీదే భారం - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు !

Telangana Elections 2023 :  దేవుడి మీదే భారం  - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు  !