అన్వేషించండి

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్‌లో సీక్రెట్ రూమ్? 14 కాదంట 21 మందట - వారంత అక్కడేనా?

‘బిగ్ బాస్’లో ఉన్నది 14 మంది కాదట. 21 మందట. మిగతావారంతా ‘బిగ్ బాస్’ హౌస్‌లోని సీక్రెట్ రూమ్‌లో ఉన్నారని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

‘బిగ్ బాస్’ సీజన్-7 మొదలైపోయింది. అయితే, ఈసారి ‘బిగ్ బాస్’ గత సీజన్ల కంటే భిన్నంగా ఉంది. ఈసారి రూల్స్ మొత్తం మారిపోయాయి. ఎప్పటిలా కాకుండా కేవలం 14 మంది సభ్యులే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పెద్దాయన పెద్ద ప్లాన్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. 14 మందితో హౌస్‌ను 100 రోజులు నడపడమంటే కాస్త రిస్కే. ఎందుకంటే.. ఎలిమినేషన్స్‌లో ఒక్కొక్కరు వెళ్లిపోతుంటే ఇంట్లో సభ్యులు తగ్గుతారు. తక్కువ మంది ఉంటే.. షో 70 రోజుల్లోనే కంప్లీట్ అవుతుంది. అయితే, ‘బిగ్ బాస్’ సీజన్-7 ఎన్ని రోజులు నడుస్తుందనేది ప్రకటించలేదు. ఒక వేళ 100 రోజులైతే తప్పకుండా మరో ఏడుగురు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారనేది స్పష్టమవుతోంది. కాదు.. కాదు.. అల్రెడీ ఇంట్లోకి వచ్చేశారు. అర్థం కాలేదా? ఔను, ప్రస్తుతం ప్రేక్షకులు ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

‘బిగ్ బాస్’ హౌస్‌లో సీక్రెట్ రూమ్? 

సీజన్-7లో ఏమైనా జరగొచ్చని, ఉల్టాపల్టా అని హోస్ట్ నాగార్జున ముందే చెప్పేశారు. అందుకే, మొదటి రోజు నుంచే ఏ విషయాలు లీక్ కాకుండా చూసుకున్నారు. అంచనా వేసిన కంటెస్టెంట్లంతా దాదాపు ‘బిగ్ బాస్’లోకి అడుగుపెట్టేశారు. అయితే, కొందరు మాత్రం ఇంకా రాలేదు. కాదు కాదు.. ‘బిగ్ బాస్’ వారిని బయటకు చూపించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే.. వారిని ‘బిగ్ బాస్’ అల్రెడీ ఇంట్లోకి దింపేశాడని, కావాలనే వారిని చూపించడంలేదని ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందరి ఫోకస్ ఇప్పుడు ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఉన్న ఒక సీక్రెట్ రూమ్‌పై ఉంది. అయితే, అక్కడ రూమ్ ఉన్నదా లేదా అనేది తెలియదు. ఆదివారం బిగ్ బాస్ హౌస్ చూసినవారు.. నిశితంగా పరిశీలిస్తే.. హోస్ట్ నాగార్జున ఫర్నీచర్‌తో ఉన్నప్పుడు ఉన్న గదులను చూపిస్తున్నప్పుడు ఆ సీక్రెట్ రూమ్ చూపించారని అనుకుంటున్నారు. అందులో ప్రత్యేకంగా ఒక రూమ్ ఉండవచ్చని భావిస్తున్నారు. ‘బిగ్ బాస్’ ఆ ఏడుగురిని చూపించకుండా.. ఆ గదిలో ఉంచి ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. లేదా.. పవర్ అస్త్ర దక్కని సభ్యులు బయటకు వెళ్లగానే కొత్తవారిని లోపలికి పంపించవచ్చని తెలుస్తోంది. మిగతావారు ఎవరు అనే సన్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటోంది. అప్పుడే బిగ్ బాస్‌లో అంతా గ్రూపులు కట్టేసి కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టేశారు. వారు కూడా ఇంకా రావాలి కదా? మనల్ని పంపేసి వాళ్లను తీసుకొస్తారా అంటూ తీవ్రంగా చర్చించుకుంటున్నారు. 

‘బిగ్ బాస్’ హౌస్‌లో అడుగుపెట్టని కంటెస్టెంట్లు వీళ్లే (అంచనా)

1. అంజలి పవన్
2. అబ్బాస్ (హీరో)
3. నరేష్ (జబర్దస్త్)
4. బుల్లెట్ భాస్కర్ (జబర్దస్త్)
5. ప్రత్యూష (టీవీ-9 యాంకర్)
6. నిఖిల్ (యాంకర్)
7. శుభశ్రీ (రుద్రవీణ నటి)
8. అన్షు రెడ్డి (నటి)
9. అనీల్ గీలా (మై విలేజ్ షో - యూట్యూబ్ స్టార్)
10. కమెడియన్ మహేష్ ( ‘రంగస్థలం’ సహ నటుడు)
11. సాగర్ (‘మొగలి రేకులు’ నటుడు)
12. అర్జున్ అంబటి (‘అగ్నిసాక్షి’ నటుడు)
13. గౌతమ్ కృష్ణ (‘ఆకాశవీధిలో’ నటుడు)
14. శ్వేతా నాయుడు (సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్)

పైన పేర్కొన్న కంటెస్టెంట్లంతా ఇంకా హౌస్‌లోకి అడుగుపెట్టనివారు. ‘బిగ్ బాస్’ సీజన్ 7 ప్రారంభానికి ముందు వీరు కూడా హౌస్‌లోకి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ 14 మందిలో కనీసం 7 లేదా 8 మంది హౌస్‌లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. లేదా.. వారిని సైలెంట్‌గా సీక్రెట్ రూమ్‌కు పంపించేసి ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. మరి ఏం జరుగుతోందనేది చూడాలి. 

ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు వీరే

1. ప్రియాంక జైన్ (‘జానకి కలగనలేదు’ సీరియల్ నటి)
2. శివాజీ (హీరో)
3. దామిని (సింగర్)
4. ప్రిన్స్ యవార్ (‘నా పేరు మీనాక్షి’ నటుడు)
5. శుభశ్రీ (లాయర్, నటి)
6. షకీలా (నటి)
7. ఆట సందీప్ (కొరియోగ్రాఫర్)
8. శోభా శెట్టి (‘కార్తీక దీపం’ నటి)
9. టేస్టీ తేజ (జబర్దస్త్ కమెడియన్)
10. రతిక (నటి, ఇన్‌ఫ్లూయెన్సెర్)
11. డాక్టర్ గౌతం (నటుడు)
12. కిరణ్ రాథోడ్ (నటి)
13. పల్లవి ప్రశాంత్ (రైతు)
14. అమర్ దీప్ (‘జానకి కలగనలేదు’ నటుడు)

ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీరే?

‘బిగ్ బాస్’ సీజన్ 7లో జరిగిన మొదటి నామినేషన్స్‌లో 8 మంది ఎలిమినేషన్ రేసులో ఉన్నట్టు సమాచారం. గౌతమ్ కృష్ణ, రతిక, షకీలా, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, దామిని భట్ల.. ఈ 8 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. అసలు ఈ 8 మంది ఎలా నామినేట్ అయ్యారు, నామినేషన్స్ ప్రక్రియలో వచ్చిన మార్పులు ఏంటి, ఆ సమయంలో జరిగిన వాగ్వాదాలు ఏంటి తెలుసుకోవాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. కానీ ‘బిగ్ బాస్’ ప్రేక్షకులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను నామినేషన్ నుంచి తప్పించి, ‘బిగ్ బాస్’‌లో కొనసాగేలా చేయాలంటే వారి చేతిలో కేవలం ఒక ఓటు మాత్రమే ఉంటుంది. ఇంతకు ముందులాగా హాట్‌స్టార్‌లో 10 ఓట్లు, ఫోన్ నుంచి 10 మిస్డ్ కాల్స్ లాంటి ఆప్షన్‌ను ‘బిగ్ బాస్’ తొలగించారు. ప్రస్తుతం ఆడియన్స్ చేతిలో ఒక హాట్‌స్టార్ ఓటు, ఒక మిస్డ్ కాల్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది.

Also Read: బిగ్ స్క్రీన్‌పై మళ్లీ ‘సిల్క్’ మ్యాజిక్ - సీజీతో సాధ్యం చేసిన ‘మార్క్ ఆంటోని’ టీమ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy - Tollywood: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే...‌‌ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే?
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Errolla Srinivas: బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ - తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ రాజ్యమంటూ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Year Ender 2024: ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం
ఈ ఏడాది కన్నుమూసిన భారతీయ వ్యాపార దిగ్గజాలు - ఓసారి స్మరించుకుందాం
Embed widget