అన్వేషించండి

Mark Antony: బిగ్ స్క్రీన్‌పై మళ్లీ ‘సిల్క్’ మ్యాజిక్ - సీజీతో సాధ్యం చేసిన ‘మార్క్ ఆంటోని’ టీమ్!

విశాల్, ఎస్‌జే సూర్య నటిస్తున్న ‘మార్క్ ఆంటోని’లో సిల్క్ స్మితను గ్రాఫిక్స్ ద్వారా రీక్రియేట్ చేశారు.

విశాల్, ఎస్‌జే సూర్య నటిస్తున్న తమిళ సినిమా ‘మార్క్ ఆంటోని’. వీరిద్దరికీ తెలుగులో మంచి మార్కెట్ ఉంది కాబట్టి డబ్ అవుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘మార్క్ ఆంటోని’ ట్రైలర్ కూడా ఆదివారం విడుదల అయింది. ఒకప్పటి అందాల నటి సిల్క్ స్మితను కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా ఈ సినిమాలో రీక్రియేట్ చేశారు. అది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది.

ఈ ట్రైలర్‌లో ఒక సీన్‌లో సిల్క్ స్మిత కనిపిస్తారు. సిల్క్ స్మితను ఎస్ జే సూర్య చూస్తుండగా... విశాల్ ‘మా వాడు లేడీస్ మేటర్‌లో డిసిప్లిన్డ్ గ్యాంగ్‌స్టర్.’ అనగానే ఎస్‌జే సూర్య ముందుకు వచ్చి సిల్క్ స్మిత చేతి మీద ముద్దు పెడతాడు. ఇంతే కాకుండా సిల్క్ స్మితతో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్లు కనిపించింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే... ఇందులో కథను పెద్దగా రివీల్ చేయలేదు. కానీ ఇంట్రస్టింగ్‌గా ప్రేక్షకుల అటెన్షన్ పొందేలా మాత్రం కట్ చేశారు. యాక్షన్, కామెడీ, సైన్స్‌ఫిక్షన్ అన్ని ఎలిమెంట్స్‌ను టచ్ చేస్తూ ఆడియన్స్ సినిమా కోసం వెయిట్ చేసేలా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్, తెలుగు నటుడు సునీల్ పాత్రలను కూడా ట్రైలర్‌లో చూపించారు. వీరిద్దరూ రెండేసి లుక్స్‌లో కనిపించారు ఒక ఫోన్ ద్వారా టైమ్ ట్రావెల్ చేయడం అనే పాయింట్‌పై సినిమాను ఆదిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. ట్రైలర్‌లో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు విశాల్ నుంచి ప్రేక్షకులు కోరుకునే యాక్షన్ ఎలిమెంట్స్, ఎస్‌జే సూర్య మార్కు కామెడీ కూడా ఉన్నాయి. హీరో విశాల్, ఎస్‌జే సూర్య ఇద్దరూ ‘మార్క్ ఆంటోని’లో డ్యూయల్ రోల్ చేయనున్నారు. ఎస్‌జే సూర్య పాత్ర, ఆయన నటన సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

గత కొంత కాలంగా కోలీవుడ్ హీరో విశాల్ ఓ హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. 2018 లో వచ్చిన 'అభిమన్యుడు' సినిమా తర్వాత ఇప్పటివరకు విశాల్‌కు మరో హిట్టు పడలేదు. ప్రస్తుతం విశాల్ ఏకంగా మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో 'మార్క్ ఆంటోనీ' కూడా ఒకటి. ఈ సినిమాలో విశాల్ రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నారు. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందిందని టీజర్, ట్రైలర్‌లను చూసి చెప్పవచ్చు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచాయి. ‘ఐ లవ్యూ డీ’ అంటూ సాగే పాట కూడా బాగా వైరల్ అవుతోంది. ‘మార్క్ ఆంటోని’ సినిమాతో విశాల్ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.

సెప్టెంబర్ 15వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు హీరోయిన్ రీతు వర్మ ‘మార్క్ ఆంటోని’లో కథానాయికగా నటిస్తోంది. ఎస్ జె సూర్య, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ‘మార్క్ ఆంటోని’ సినిమాని మినీ స్టూడియోస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ పై ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ శనివారం (ఫిబ్రవరి 28) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసా? లిస్ట్ చూసేయండి!
ఈ శనివారం (ఫిబ్రవరి 28) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసా? లిస్ట్ చూసేయండి!
Vijay Sangeetha Divorce: నటితో అక్రమ సంబంధం వల్లే... విజయ్ నుంచి సంగీత విడాకులు కోరడానికి కారణం ఎవరు?
నటితో అక్రమ సంబంధం వల్లే... విజయ్ నుంచి సంగీత విడాకులు కోరడానికి కారణం ఎవరు?
Vijay Sangeetha Divorce: విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దళపతి విజయ్ భార్య... తమిళనాడులో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్
విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దళపతి విజయ్ భార్య... తమిళనాడులో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్
Spirit Update : ప్రభాస్ 'స్పిరిట్‌' నుంచి బిగ్ సర్‌ప్రైజ్ - వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రభాస్ 'స్పిరిట్‌' నుంచి బిగ్ సర్‌ప్రైజ్ - వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
Ideas of India Nara Lokesh: ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
ప్రత్యేకహోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
Lip Lock Kiss History: ముద్దు అనే కాన్సెప్టు ఎప్పటి నుంచి మొదలైంది? లిప్-లాక్ చేసిన మొదటి వ్యక్తి ఎవరు?
ముద్దు అనే కాన్సెప్టు ఎప్పటి నుంచి మొదలైంది? లిప్-లాక్ చేసిన మొదటి వ్యక్తి ఎవరు?
Holi 2026: హోలికా దహనం తర్వాత వెంటనే ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళకూడదా? ఆ బూడిదను ఏం చేయాలి?
హోలికా దహనం తర్వాత వెంటనే ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళకూడదా? ఆ బూడిదను ఏం చేయాలి?
2026 ఫిబ్రవరి 28 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
2026 ఫిబ్రవరి 28 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
Home Loan Tips:హోమ్‌లోన్ ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారా ఈ వివరాలు అస్సలు మర్చిపోవద్దు! లేకుంటే చాలా నష్టపోతారు!
హోమ్‌లోన్ ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారా ఈ వివరాలు అస్సలు మర్చిపోవద్దు! లేకుంటే చాలా నష్టపోతారు!
TVS Orbiter vs Bajaj Chetak C2501: TVS ఆర్బిటర్- బజాజ్ చేతక్‌లలో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? తేడాలు తెలుసుకోండి! 
TVS ఆర్బిటర్- బజాజ్ చేతక్‌లలో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? తేడాలు తెలుసుకోండి! 
Embed widget