Rathika: మీరు చూసింది వేరు, ఇంతకంటే దిగజారవద్దు - రతిక టీమ్ మండిపాటు
బిగ్ బాస్ హౌజ్ నుంచి రతిక ఎలిమినేట్ అయిపోయింది. దీనికి సంబంధించి తన టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది.
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి నాలుగు వారాలు పూర్తయ్యింది. తాజాగా నాలుగో వారం ఎలిమినేషన్ పూర్తయ్యింది. అందులో రతిక.. బిగ్ బాస్ హౌజ్‌ను వదిలి బయటికి వచ్చేసింది. అసలు ఇంత త్వరగా బయటికి వచ్చేస్తానని ఊహించలేదని రతిక ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్‌లో తను ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ బయట తనకు వచ్చిన ఇమేజ్ చూసి షాక్ అయ్యింది. అందుకే తనపై వస్తున్న కామెంట్స్‌కు రతిక రియాక్ట్ అయ్యింది. సోషల్ మీడియాలో అందరికీ సమాధానం ఇస్తూ ఒక పోస్ట్ చేసింది. దీనిపై కూడా కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
రతిక్ టీమ్ సైనింగ్ ఆఫ్..
రతికను బిగ్ బాస్ సీజన్ 7 జర్నీ మొత్తంలో ప్రేమించిన, సపోర్ట్ చేసిన అందరికీ చాలా థాంక్యూ. ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ, పరిస్థితులు సహకరించకపోయినా మాతో నిలబడిన నిజమైన ఫ్యాన్స్‌కు స్పెషల్‌గా థ్యాంక్స్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము. అంతే కాకుండా హేటర్స్‌కు, రివ్యూవర్స్‌కు, కామెంట్స్ చేసేవాళ్లకు, యూట్యూబ్ ఛానెళ్లకు కూడా థ్యాంక్స్. ప్రతీ ఒక్కరికీ ఒక దృక్పథం ఉంటుదని మాకు అర్థమవుతుంది. మేము దానిని గౌరవిస్తాం కూడా. మీ సమయాన్ని కేటాయించి రతికకు ఓటు వేసినందుకు, పోస్టులకు కామెంట్ చేసినందుకు అభినందిస్తున్నాం. అంతే కాకుండా టీమ్ రతిక అనేది ఎప్పటికీ అంతరించిపోదు. కానీ ఈ అకౌంట్ మాత్రం పూర్తిగా రతిక చేతిలోకి వెళ్తుంది. అంటూ రతిక టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఒకటే రిక్వెస్ట్..
‘ఎవరికైతే సంబంధం ఉందో వారందరికీ ఒకటే రిక్వెస్ట్. మరీ మరీ దిగజారిపోయి, అసభ్యకరంగా కామెంట్ చేసే స్థాయికి వెళ్లకండి. పర్సనల్ అవ్వకండి. ఇది ఎవరి ప్రపంచానికి ముగింపు కాదు’ అంటూ రతిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ప్రత్యక్షమయ్యింది. దీంతో పాటు రతిక ఫోటోతో ‘ఒక పుస్తకాన్ని.. దాని కవర్ చూసి జడ్జ్ చేయవద్దు, మీరు చూసినదానికంటే చూడనిది చాలా ఉంది’ అంటూ కొటేషన్ కూడా పెట్టారు. బిగ్ బాస్‌లో ఉన్నంత వరకు రతికపై పాజిటివ్ కామెంట్స్ కంటే నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలామంది రతిక ఒక పాములాంటిదని, విషం చిమ్ముతుందని కూడా పోల్చడం మొదలుపెట్టారు.
View this post on Instagram
ఫ్యాన్స్ కూడా ఉన్నారు..
రతికపై నెగిటివ్ కామెంట్స్ చేసే నెటిజన్లు ఉన్నా.. తనను సపోర్ట్ చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు. అందుకే రతికకంటే అసలు ఆడనివారు హౌజ్‌లో ఉన్నారని, వారిని కాకుండా రతికను ఎలిమినేట్ చేయడం అన్యాయం అని తన ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా ఎక్స్ బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్స్ దగ్గర నుంచి కూడా రతికపై నెగిటివిటీ రావడం తనకు చాలా మైనస్‌గా మారింది. పైగా సీజన్ మొదట్లో ఎవరితో అయితే రతిక క్లోజ్‌గా ఉందో.. మెల్లగా వారి గురించి నెగిటివ్‌గా మాట్లాడడం వల్ల తనపై మరింత నెగిటివిటీ పెరిగిపోయింది. పల్లవి ప్రశాంత్, శివాజీ లాంటి వారితో రతిక క్లోజ్‌గా ఉండేది. కానీ తను ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయే సమయానికి వారిద్దరూ తనను పట్టించుకోలేదు. ఇలా జరగడానికి పూర్తిగా రతిక తప్పే ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read: బిగ్ బాస్‌లో అయిదో వారం నామినేషన్స్ - కంటెస్టెంట్స్‌పై శివాజీ రివెంజ్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial