By: Haritha | Updated at : 19 Oct 2022 06:25 PM (IST)
(Image credit: Star maa)
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో బిగ్ బాస్ ఇంటి సభ్యులతో ఓ రేంజ్‌లో ఆడుకోవడం మొదలుపెట్టారు. టాస్కులు సరిగా ఆడకుండా బద్దకంగా ఉంటున్న ఇంటి సభ్యులకు ఆకలి మంటలు పుట్టించారు. పోరాడి గెలిచి ఆహారం తినమని చెప్పారు. వారిని రెండు వర్గాలుగా విభిజించి పోటీలు పెట్టారు. అందులో గెలిచిన టీమ్‌కే ఆహారం ఇస్తున్నారు. ఇక ఈ ప్రోమోల చపాతీ , ఆలూ కర్రీ బహుమతిగా పెట్టారు. రెండు టీమ్‌లలో ఎవరు గెలుస్తారో వారే వాటిని తినాలని చెప్పారు. రివర్స్ టగ్ ఆఫ్ వార్ పెట్టారు. అంటే మనుషులు తాడును శరీరాలకు కట్టుకుని టగ్ ఆఫ్ వార్ ఆడారు. అందులో కింద మీద పడి చాలా కష్టపడ్డారు. సంచాలక్‌గా ఫైమా వ్యవహరించింది.
ఎలాగోలా ఆడాక ఒక టీమ్ గెలిచింది. గెలిచిన్ టీమ్ లో ఉన్నవారు చపాతీలను సుష్టుగా భోజనం చేశారు. గెలిచిన టీమ్లోనే ఎప్పుడూ ఫుడ్ గురించే ఆలోచించే శ్రీసత్య ఉంది. ఉంది. శ్రీహాన్‌ను ఊరించుకుంటూ చపాతీలు తింది. ఇక గీతూ ఓడిపోయిన టీమ్ లో ఉన్నప్పటికీ ఆదిరెడ్డితో కలిసి భోజనం చేసింది. దీంతో బిగ్ బాస్‌కి కోపం వచ్చింది. ‘నియమాలను ఉల్లంఘిస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ముందే హెచ్చరించడం జరిగింది. ఆదిరెడ్డి మీరు మీ ఆహారాన్ని ఓడిపోయిన టీమ్‌కు చెందిన గీతూతో పంచుకున్నారు. అందుకే మీ ఇద్దరూ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని చెప్పారు.
అంట్లు తోమించారు..
ఆదిరెడ్డి, గీతూల ముందు తినేసిన ప్లేట్లు, గిన్నెలు పడేసి వాటన్నింటినీ తోమమని శిక్ష విధించారు. వారు గిన్నెలు తోముతున్నప్పుడు మిగతా ఇంటి సభ్యులు జోకులు పేలుస్తూనే ఉన్నారు. ఇద్దరూ గిన్నెలో తోమేశాక ఒక దగ్గర కూర్చుని మాట్లాడకోసోగారు. ఆదిరెడ్డి చేతులు చూసుకుంటూ ‘మొదటిసారి గిన్నెలు తోమా, ఎప్పుడూ తోమలేదు’ అన్నాడు. ఇక ఓవర్ యాక్షన్ చేసే గీతూ ‘మా ఇంట్లో నేను చెయ్యి కడుక్కోవడానికి కూడా గిన్నె పట్టుకొస్తారు’ అని చెప్పింది. ఆదిరెడ్డి ‘టార్చర్ తల్లీ ఇదంతా’ అంటూ నిట్టూర్చాడు.
Also read: ఫుడ్ కావాలా? పోరాడి సంపాదించుకోండి - బిగ్‌బాస్ పనిష్మెంట్ మామూలుగా లేదు
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం
Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!
Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా
Income Tax Rule: బిగ్‌బాస్, లాటరీ విజేతలకు 'పన్ను పోటు' ఎంత! తెలిస్తే షాకవ్వడం ఖాయం!
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం
Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!