
Bigg Boss 8 Telugu: హౌస్‌లో అర్జున్ రెడ్డి... అప్పుడు సన్నీ, ఇప్పుడు పృథ్వీ - అదే తప్పు... ఆదిత్య ఓంకు అవమానం
బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ పృథ్వీరాజ్ కు ఉన్న యాంగర్ సమస్య హౌస్ లో వారికి పెద్ద సమస్యగా మారింది. పైగా ఆయనలో మరో సన్నీ కన్పిస్తున్నాడు. మరి పృథ్వీకి, సన్నీకి మధ్య ఉన్న లింకు ఏంటో తెలుసుకుందాం పదండి.

బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ చేసిన కోడి మరోసారి హౌస్ మేట్స్ ని పరుగులు పెట్టిస్తూ ఒకరినొకరు తన్నుకునేలా చేస్తోంది. అయితే ఇదే టాస్క్ లో భాగంగా గతంలో సన్నీ తిట్లు తినాల్సి వచ్చిందన్న విషయం బిగ్ బాస్ లవర్స్ కు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడేమో అచ్చం సన్నీ లాగే ప్రవర్తిస్తున్నాడు పృథ్వీ రాజ్. కట్టలు తెంచుకుంటున్న ఆవేశంతో అసలేం మాట్లాడుతున్నాడో ఆయనకైనా అర్థమవుతుందా? అన్నది ప్రేక్షకుల ప్రశ్న. పైగా తనకన్నా పెద్దవాడు అని కూడా చూడకుండా ఆదిత్య ఓంను అవమానించాడు. గత వారమే నాగ్ ఎఫ్ వర్డ్స్ వాడొద్దు, నాలుకను అదుపులో పెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చినా, ఆవేశంలో మళ్లీ అదే తప్పు చేశాడు పృథ్వీ.
హౌస్ లో అర్జున్ రెడ్డిలా పృథ్వీరాజ్...
సాధారణంగా మాట్లాడేటప్పుడు, టాస్క్ లు లేనప్పుడు ఎంతో కూల్ గా ఉండే పృథ్వి, టాస్క్ వచ్చేసరికి హద్దు మీరిన ఆవేశంతో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా ఆవేశంతో ఊగిపోయిన పృథ్వి ఆదిత్య ఓంను అవమానించారు. నెట్టేయడంతో పాటు అతనితో గొడవకు కూడా దిగాడు. ఫిజికల్ వద్దు పృథ్వీ అంటూ ఎంత మొత్తుకున్నా, గారూ, మీరూ అంటూ ఆదిత్య ఓం ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఆదిత్య ఓం ఎంత చెప్పినా వినకుండా అటు ప్రేరణ, ఇటు ఆదిత్య ఓం మీదకు వెళుతూ ఆవేశంతో నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. కనీసం తనకంటే వయసులో పెద్ద, గౌరవంగా మాట్లాడుతున్నాడు అన్న జ్ఞానం లేకుండా బిహేవ్ చేసి ఈ వీక్ నెగెటిటీని మూటగట్టుకున్నాడు. పైగా మరోసారి అసభ్యకరంగా కామెంట్స్ చేశాడు. గేమ్ వచ్చిందంటే అతని ఆవేశానికి అడ్డు, అదుపు లేకుండా పోతుంది అంటూ హౌస్ మేట్స్ మాట్లాడుకుంటున్నారు. టీవీలు చూసే వాళ్లకైతే పృథ్వీ ఆవేశం చూస్తే కొంతవరకు టెన్షన్ పుడుతోంది. దీంతో పృథ్వీని బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీతో పోల్చి పెట్టి చూస్తున్నారు నెటిజన్లు.
గతంలోనూ ఇదే సీన్ రిపీట్
బిగ్ బాస్ హౌస్ లో ప్రభావతి టాస్క్ పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్లో బంగారు కోడిపెట్ట అనే పేరుతో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. అందులో ప్రభావతి పెట్టే గుడ్లను తీసుకుని, వాటిని ఎవ్వరూ ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా దాచుకోవాలి. గతంలో సన్నీ ఎగ్స్ ని ప్రియా దొంగిలించడంతో ఇద్దరికీ మాటామాటా పెరిగింది. ఏకంగా సన్నీని చెంప పగలగొడతా అని ప్రియా కామెంట్ చేసేదాకా వెళ్ళింది పరిస్థితి. ఇక ఇప్పుడైతే పృథ్వీ ఆవేశాన్ని తట్టుకోవడం ఎవరి తరం కావట్లేదు. ఆయన యాంగర్ మేనేజ్మెంట్ ను కంట్రోల్లో పెట్టాలి అంటే కచ్చితంగా నాగార్జున చేత మరోసారి మొట్టికాయలు పడాల్సిందే. గేమ్ అద్భుతంగా ఆడుతున్నప్పటికీ అతని ఆవేశమే అతనికి మైనస్ పాయింట్ గా మారింది.. నిజానికి పృథ్వీ ఎవరి టీంలో ఉంటే వాళ్లకు మంచి బూస్ట్ వచ్చినట్టే. ఈ ఆవేశాన్ని కూడా కాస్త కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

