అన్వేషించండి

Sravanthi Chokarapu : స్రవంతికి పేటీఎం బ్యాచ్ బెదిరింపులు - రివర్స్‌లో సెటైరికల్‌గా ఇచ్చిపడేసిన యాంకర్

ప్రముఖ యాంకర్ స్రవంతి చొకారపు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆమెను ఎవరు, ఎందుకు బెదిరించారో తెలుసుకుందాం పదండి.

సినిమాలకు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. కానీ పలువురు సెలబ్రిటీలు తమకు నచ్చిన పార్టీలకు బహిరంగంగా సపోర్ట్ చేయడం వల్ల లేదా అవతలి పార్టీని డైరెక్ట్ గా లేదా ఇన్ డైరెక్ట్ గా విమర్శించడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. బిగ్ బాస్ తో పాపులర్ అయిన యాంకర్ స్రవంతి చొకారకపు తాజాగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పైగా సెటైరికల్ గా బెదిరిస్తున్న వాళ్ళకు సమాధానం ఇచ్చి పడేసింది. 

అసలు ఈ '11' వివాదం ఏంటంటే? 
ఏపీ పాలిటిక్స్ లో అధికార పగ్గాలు వైసిపి నుంచి టీడీపీ చేతుల్లోకి మారింది. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లకు మద్ధతుగా చాలా మంది ట్వీట్స్‌ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలిచారు. ఇక ఈ ఎలక్షన్స్ లో వైసిపి ఓడిపోయిన తీరుపై ఇప్పటికి సెటైరికల్ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా స్రవంతి ఓ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ పై ట్రోలింగ్ మొదలైంది. రీసెంట్ గా ఓ ప్రోగ్రాంలో స్రవంతి 11 మీద కామెడీ చేసింది. అది కాస్తా వైసిపికి ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చాయి అనే విషయంపై స్రవంతి ఇన్ డైరెక్ట్ గా ట్రోల్ చేస్తుందని అర్థం చేసుకున్న ఓ వర్గం వారు ఆమెను సోషల్ మీడియాలో కామెంట్స్ ద్వారా ఏకి పారేస్తున్నారు. 

Read Also: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!

స్రవంతికి బెదిరింపు కాల్స్ ... 
ఈ నేపథ్యంలోనే స్రవంతిపై వైసిపి వాళ్ళు దారుణంగా ట్రోల్ చేస్తుండగా, తాజాగా ఆ విషయం గురించి స్రవంతి సోషల్ మీడియా వేదికగా సెటైరికాల్ గా సమాధానం చెప్తూ అసలు విషయాన్ని బయటపెట్టింది. వరుస ట్వీట్లు చేస్తూ 11 సంఖ్యతో పాటు తనను బెదిరిస్తున్నది ఎవరు ? అనే విషయాన్ని కూడా వెల్లడించింది. 'మన ప్రియమైన గుమ్మడికాయ దొంగలు ట్రిగ్గర్ అవుతున్నారు. కాబట్టి ఇకనుంచి నంబర్ 11 ని ఎక్కడ ఉపయోగించకూడదని అనిపిస్తోంది" అని కామెంట్ చేసిన స్రవంతి ఆ తర్వాత వరుస ట్వీట్లు చేసింది.

"బెదిరింపు కాల్స్... అమ్మ బాబోయ్ నాకు భయమేస్తోంది. 0 ఫాలోవర్స్, 0 ఫాలోయింగ్, 0 పోస్ట్స్ పెట్టుకునే మీ ఇన్స్టా  అకౌంట్ నుంచి కామెంట్లు పెడుతుంటే ఇంకా భయమేస్తుంది బాబోయ్" అంటూ తనను బెదిరిస్తున్న వాళ్లకి ట్విట్టర్ ద్వారా ఇచ్చి పడేసింది. అయితే స్రవంతి చేసిన ఈ కామెంట్స్ రెచ్చగొట్టే విధంగా ఉండడంతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. స్రవంతిని ఈ లెవెన్ కామెడీపై ఎవరు ఫోన్ చేసి బెదిరించారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆ విషయం అయితే బయట పెట్టలేదు కానీ 11 సంఖ్యతో మరోసారి వార్తల్లో నిలిచింది స్రవంతి చొకారకపు. కాగా ప్రస్తుతం స్రవంతి యాంకర్ గా ఫుల్ బిజీగా ఉంది. అలాగే పలు షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించడంతో పాటు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కు హాట్ ఫోటోల ద్వారా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.  

Read Also: వైల్డ్ కార్డు ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్, నలుగురు కొత్త కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget