Bigg Boss 8: ‘బిగ్ బాస్’ ఓపెనింగ్ ఎపిసోడ్ కు ‘సరిపోదా శనివారం’ టీమ్- తాజా, మాజీ హోస్టులతో స్టేజి దద్దరిల్లాల్సిందే!
Bigg Boss Telugu Season 8 | ఈసారి బిగ్ బాస్ షో ఓపెనింగ్ ఎపిసోడ్ ఆడియెన్స్ లో ఫుల్ జోష్ నింపనుంది. షో హోస్టు నాగార్జునతో పాటు మాజీ హోస్టు నాని సందడి చేయనున్నారు. ఈ ఎపిసోడ్ షూట్ జరిగినట్లు తెలుస్తోంది.
Telugu Bigg Boss 8: తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను ఓ రేంజిలో అలరించిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటి వరకు అన్ని సీజన్లు ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ ను పంచగా, రేపటి నుంచి 8వ సీజన్ మొదలుకానుంది. సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు అట్టహాసంగా ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించి విడుదలైన ప్రోమోలు, టీజర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. గత సీజన్లకు మించి ట్విస్టులతో పాటు ఫుల్ జోష్ నింపేందుకు బిగ్ బాస్ షో రెడీ అయినట్లు హోస్టు నాగార్జున చెప్పడంతో ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెరిగింది. బిగ్ బాస్ షో కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. షోలోకి వెళ్లే గెస్టులు ఎవరు? ఈ షోలో స్పెషల్ గా ఏం ఉంటుందో? అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఓపెనింగ్ ఎపిసోడ్ లో ‘సరిపోదా శనివారం’ టీమ్ సందడి
బిగ్ బాస్ 8 ఓపెనింగ్ ఎపిసోడ్ తోనే ప్రేక్షకులలో ఓ రేంజిలో అంచనాలు పెంచాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట. అందులో భాగంగానే ఈ ఎపిసోడ్ కు ‘సరిపోదా శనివారం’ టీమ్ ను ఇన్వైట్ చేశారట. తాజా హోస్టు నాగార్జునతో కలిసి మాజీ హోస్టు నాని బిగ్ బాస్ స్టేజిపై దుమ్మురేపబోతున్నట్లు తెలుస్తోంది. ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా నాని టీమ్ బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ కు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. నాని బిగ్ బాస్ సీజన్ 2కు హోస్టుగా చేశారు. ఆ తర్వాత నాగార్జున హోస్టుగా చేసిన పలు సీజన్లలో నాని గెస్టుగా వచ్చి ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు సీజన్ 8లోనూ ఆయన సందడి చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఇవాళ జరిగినట్లు తెలుస్తోంది.
View this post on Instagram
థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న ‘సరిపోదా శనివారం’
నేచురల్ స్టార్ నాని హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివేక్ ఆత్రేయ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఎస్ జ సూర్య నెగెటివ్ రోల్ పోషించారు. అభిరామి, అదితి బాలన్, సాయికుమార్, శుభలేఖ సుధాకర్, మురళీశర్మ, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడులైంది. వివేక్ ఆత్రేయ, నాని కాంబోలో ఇప్పటికే ‘అంటే సుందరానికి’ మూవీ రాగా, రెండో సినిమాగా ‘సరిపోదా శనివారం’ వచ్చింది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నా, విడుదల తర్వాత మిశ్రమ స్పందన తెచ్చుకుంది. రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.41 కోట్లు వసూళ్లు సాధించింది.
Read Also: అడ్వాన్స్ బుక్కింగ్స్‌లో దుమ్మురేపుతున్న 'దేవర' - అక్కడ ప్రీ-సేల్ బిజినెస్ ఎంత అయ్యిందంటే!