Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో మరో సండే మరో గెస్ట్‌తో వచ్చేశారు నాగార్జున. కానీ ఈసారి తనతో సినిమా చేస్తున్న హీరోయిన్‌నే గెస్ట్‌గా తీసుకొచ్చారు.
Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లోని సండే ఫన్‌డే ఎపిసోడ్‌ను సెలబ్రిటీ గెస్టులతో నింపైశాడు నాగార్జున. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని.. తన అప్‌కమింగ్ మూవీ ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చి నాగార్జునతో పాటు హౌజ్‌మేట్స్‌తో కూడా కబుర్లు చెప్పాడు. ఇక నాని వెళ్లిపోయిన తర్వాత తన హీరోయిన్ అషికా రంగనాథన్‌ను గెస్ట్‌గా పిలిచారు నాగ్. తన అప్‌కమింగ్ మూవీ ‘నా సామిరంగ’లో అషికాతో జోడీకడుతున్నాడు ఈ మన్మథుడు. దీంతో తన హీరోయిన్‌ను పిలిపించి ‘నా సామిరంగ’ విశేషాలను కంటెస్టెంట్స్‌తో పంచుకున్నాడు. అషికాను ఇంప్రెస్ చేయడం కోసం హౌజ్‌మేట్స్ ఎన్నో తిప్పలుపడ్డారు కూడా.
అమర్‌కు ఫ్లయింగ్ కిస్..
అషికాను చూడగానే హౌజ్‌మేట్స్ అంతా చాలా ఎగ్జైట్ అయ్యారు. దీంతో ముందుగా అమర్‌ను పిలిచి హీరోయిన్‌కు ఎన్ని మార్కులు ఇస్తావ్ అని అడిగారు నాగార్జున. వందకు వెయ్యి అని సమాధానమిచ్చాడు అమర్. తేజూ విన్నావా అంటూ అమర్‌ను ఆటపట్టించారు నాగ్. అంతలోనే తనకు వెయ్యి మార్కులు ఇచ్చినందుకు అమర్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది అషికా. థాంక్యూ అని చెప్పి ఫ్లయింగ్ కిస్‌ను క్యాచ్ చేశాడు అమర్. అది చూసిన నాగార్జున.. ‘‘సరిగ్గా క్యాచ్ చేసి లోపల పెట్టుకున్నాడు’’ అని అన్నారు. ఆ తర్వాత అర్జున్.. అషికాకు ‘‘వందకు వంద మార్కులు ఇస్తాను. మంచి తెలుగమ్మాయి ఫీలింగ్ ఉంది’’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. అది విన్న నాగ్.. ‘‘ఇప్పుడు ఒకసారి శోభాతో కన్నడలో మాట్లాడిస్తా చూడు’’ అని అన్నారు. వెంటనే శోభా బాగున్నారా అంటూ అషికాను కన్నడలో అడిగింది. దానికి అషికాకు కూడా కన్నడలో రెస్పాన్స్ ఇచ్చింది. అది విన్న తర్వాత ‘‘తెలుగమ్మాయిలాగానే ఉంది’’ అంటూ శోభా కూడా ప్రశంసించింది.
మైండ్ బ్లాంక్ అయిపోయింది..
ఆ తర్వాత అషికాకు ప్రశాంత్ గురించి చెప్తూ తనొక గొప్ప కవి అని అన్నారు నాగార్జున. అది విన్న ప్రశాంత్ సిగ్గుపడ్డాడు. ‘నా సామిరంగ’లో వరలక్ష్మిగా నటించిన అషికాపై ఒక కవిత చెప్పమన్నారు నాగ్. చెప్పాలనుకొని మొదలుపెట్టినా కూడా ప్రశాంత్ కవిత చెప్పలేక ఆగిపోయాడు. మేడంను చూస్తుంటే మైండ్ పనిచేయడం లేదు అన్నట్టుగా సైగ చేశాడు. ‘‘ఒక్కసారిగా మిమ్మల్ని చూడగానే ఎక్కడికో వెళ్లిపోయా. నిజంగా చెప్తున్నా మైండ్ బ్లాంక్ అయిపోయింది’’ అనడంతో హౌజ్‌మేట్స్ అంతా ఆటపట్టించడం మొదలుపెట్టారు.
నాగార్జునను ఇమిటేట్ చేసిన హౌజ్‌మేట్స్..
‘‘మీలో ఎవరు నన్ను ఇమిటేట్ చేస్తారో చేస్తే.. బెస్ట్ ఇమిటేషన్ ఎవరో అషికా అలియాస్ వరలక్ష్మి చెప్తుంది’’ అని నాగార్జున.. హౌజ్‌మేట్స్‌కు టాస్క్ ఇచ్చారు. ముందుగా అర్జున్.. నాగార్జునను ఇమిటేట్ చేయడానికి ముందుకొచ్చాడు. ఎవరినైనా కరెక్ట్ చేసే పరిస్థితుల్లో నాగ్ ఎలా ప్రవర్తిస్తారో చూపించాడు. ‘‘యావర్ నువ్వు ఈ వారం బాగా ఆడాను అనుకుంటున్నావా’’ అని అడుగుతూ.. నాగ్ వాకింగ్ స్టైల్‌లోనే అటు, ఇటు తిరుగుతూ.. నాగార్జునలాగానే జుట్టు కూడా సరిచేసుకున్నాడు. అది చూసిన హౌజ్‌మేట్స్ అంతా నవ్వుకున్నారు. ఆ తర్వాత ప్రియాంక కూడా ఇమిటేట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ మధ్యలోనే నవ్వేసి కూర్చుంది. అందరిలో అర్జున్ బాగా చేశాడని అషికా చెప్పింది. ఆ తర్వాత ‘నా సామిరంగ’ గురించి చెప్తూ.. ‘‘హీరోయిన్‌కు ఇంత స్పేస్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వడం, దానికి నన్ను ఎంపిక చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. నా సామిరంగ చిత్రంలో భాగమవ్వడం, నాగ్ సార్‌తో పనిచేయడం చాలా బాగుంది’’ అంటూ బిగ్ బాస్‌కు థ్యాంక్యూ చెప్పుకుంది అషికా.
Also Read: సండే ఎపిసోడ్‌లో నాని - ప్రియాంకకు మ్యాథ్స్, యావర్‌కు తెలుగు క్లాసులు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply