అన్వేషించండి

Bigg Boss 7 Telugu: సండే ఎపిసోడ్‌లో నాని - ప్రియాంకకు మ్యాథ్స్, యావర్‌కు తెలుగు క్లాసులు

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో తాజాగా జరిగిన సండే ఫన్‌డే ఎపిసోడ్‌లో గెస్ట్‌గా వచ్చాడు నాని. హౌజ్‌మేట్స్‌తో సరదా కబుర్లు, సీరియస్ క్లాసులు కూడా తీసుకున్నారు.

Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్‌పై సెలబ్రిటీ గెస్టులతో ఈవారం సండే ఫన్‌డే ఎపిసోడ్ సిద్ధమయ్యింది. నేచురల్ స్టార్ నాని ఈవారం హౌజ్‌మేట్స్‌తో మాట్లాడడానికి వచ్చేశాడు. ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘హాయ్ నాన్న’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు నాని. అందుకే బిగ్ బాస్ స్టేజ్‌ను కూడా తన మూవీ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటున్నాడు. బిగ్ బాస్ ప్రారంభం అయిన తర్వాత రెండో సీజన్‌లో నానినే హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఆ స్థానంలోకి నాగార్జున వచ్చారు. ఇక ప్రస్తుతం గెస్ట్‌గా వచ్చిన నాని.. హోస్ట్ నాగార్జునతో తన సినిమా విశేషాలు పంచుకోవడంతో పాటు కంటెస్టెంట్స్‌తో కూడా కబుర్లు చెప్పారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.

హాయ్ నాన్న హాయిగా ఉంటుంది..
ముందుగా నానిని ‘హాయ్ నాన్న’ అంటూ పలకరించారు నాగార్జున. దీంతో నాని కూడా ‘నా సామిరంగ’ అంటూ నాగ్‌ను హగ్ చేసకున్నాడు. ‘‘ఇది సీజన్ 7.. 2 కాదు’’ అంటూ నానికి గుర్తుచేశారు నాగ్. ‘‘తెలుసు అందుకే గ్యాప్‌లో దూరాను. 2 అయితే డైరెక్ట్‌గా దూరిపోయేవాడిని’’ అని క్లారిటీ ఇచ్చాడు నాని. ‘‘నువ్వు నాన్న కాదు, నాని కాదు. నువ్వు నా దాస్‌వి, నేను నీ దేవాని’’ అని అన్నారు నాగార్జున. ఫరెవర్ అంతే అంటూ నాని కూడా ఒప్పుకున్నాడు. ‘‘హాయ్ నాన్న గురించి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా’’ అని అడిగారు నాగార్జున. ‘‘హాయ్‌ను తెలుగులో అంటే హాయి. సినిమా అంతా అలాగే హాయిగా ఉంటుంది. చాలా సెన్సిటివ్ టాపిక్. మీరు టచ్ చేసేవారు ఇలాంటి టాపిక్స్. తరువాతి తరంగా మేము తీసుకున్నాం. డిసెంబర్ 7న మీరంతా చూసి మీ అభిప్రాయం చెప్తే మేము ఇంకా చాలా హ్యాపీ’’ అని నాని చెప్పుకొచ్చాడు. 

హోస్ట్ నాగార్జున.. విన్నర్ నాగార్జున..
ఆ తర్వాత హౌజ్‌మేట్స్‌తో మాట్లాడాడు నాని. ముందుగా అర్జున్‌ను నానికి పరిచయం చేశారు నాగ్. ‘‘అర్జున్. అసలు పేరు అంబటి నాగార్జున’’ అని చెప్పారు. ‘‘ఈ సీజన్ మీరు గెలిస్తే.. హోస్ట్ నాగార్జున, గెలిచింది నాగార్జున’’ అని సరదాగా అన్నాడు. దానికి సమాధానంగా ‘‘రావాలని కోరుకుంటున్నాను’’ అని అర్జున్ తెలిపాడు. ఆ తర్వాత అమర్‌తో మాట్లాడుతూ ముందుగా తన ప్రేమకథల గురించి ప్రస్తావించారు నాగార్జున. ‘‘సైకిల్ మీద ప్రేమకథలు మొదలుపెట్టావు కదా’’ అని అడగగా.. అవును అని ఒప్పుకున్నాడు అమర్. ‘‘ఒకసారి ఎవరెవరు లేడీస్ ఉన్నారో చూపించండి’’ అని నాని అడగాడు. ‘‘వెంటనే పెళ్లి అయిపోయింది’’ అని అమర్ సమాధానమిచ్చాడు. ‘‘మరి అదే అడుగుతున్నాను షోలోనా అని’’ అంటూ నాని క్లారిటీ ఇచ్చాడు. ‘‘ప్రేమకథ కాదు కథలు’’ అంటూ అర్జున్ ఆటపట్టించాడు. ‘‘అవన్నీ అయిపోయాయి’’ అంటూ అమర్ చెప్పగా.. ‘‘అవన్నీ మీ భార్యకు ముందే చెప్పారా?’’ అని నాని అడిగాడు.

ప్రియాంకకు మ్యాథ్స్.. యావర్‌కు తెలుగు..
ఇక ప్రియాంక గురించి చెప్తూ.. ‘‘తన గురించి ఒక విషయం చెప్పాలి. మ్యాథ్స్ టేబుల్స్ వచ్చా?’’ అని నాగార్జున అడగగా.. కొంచెం అని సమాధానం ఇచ్చాడు నాని. దీంతో 4 * 8 ఎంత అని అడగగా 32 అని కరెక్ట్‌గా సమాధానమిచ్చాడు. ప్రియాంక ఏం చెప్తుందో చూద్దాం అంటూ ఒక వీడియోను చూపించారు. అందులో 4 * 8.. 48 అని చెప్పింది ప్రియాంక. ఆ వీడియో చూడగానే ‘‘ఇంక మీ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది’’ అని నాని కామెడీ అనడంతో అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత ప్రిన్స్ యావర్‌ను పరిచయం చేయగా.. ఏ దేశానికి ప్రిన్స్ అని అడిగాడు నాని. ‘‘అలా అన్నందుకే నామినేషన్ వేశాడు’’ అంటూ పాత విషయాలను గుర్తుచేశాడు అర్జున్. ‘‘తెలుగులో ఒక పద్యం నేర్పించు మూడు లైన్స్ అయినా పర్వాలేదు’’ అని నాగార్జున చెప్పగా.. ‘‘విశ్వక్‌సేనుడి పుత్రరత్నం తస్కస్కంభట్లు’’ అనే పదాన్ని రిపీట్ చేయమని యావర్‌తో అన్నాడు నాని. ‘‘చాలా కష్టం అది తలపై నుండే పోతుంది’’ అన్నాడు యావర్. దీంతో అందరూ నవ్వుకున్నారు.

Also Read: నా దగ్గరికి వచ్చే కథలన్నీ అలాంటివే, మరో ఆలోచనే లేదంటున్న కీర్తి సురేష్!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Andhra Pradesh News: మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Andhra Pradesh News: మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Graduate MLC Elections : బ్యాలెట్ ఎన్నికలకు వైసీపీ దూరం - గ్రాడ్యూయేట్ ఎలక్షన్స్‌లో పోటీ చేయడం లేదని ప్రకటన !
బ్యాలెట్ ఎన్నికలకు వైసీపీ దూరం - గ్రాడ్యూయేట్ ఎలక్షన్స్‌లో పోటీ చేయడం లేదని ప్రకటన !
TTD:  టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
MLA Madhavi Reddy: 'మీరు కుర్చీ లాగేసినా ప్రజలు నాకు కుర్చీ ఇచ్చారు' - కడప మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగ్రహం
'మీరు కుర్చీ లాగేసినా ప్రజలు నాకు కుర్చీ ఇచ్చారు' - కడప మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగ్రహం
Embed widget