Maryada Manish Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లో తీరని మర్యాద మనీష్ కోరిక... రెండు వారాల సంపాదన ఎంతో తెలుసా?
Bigg Boss 9 Telugu: 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9'లో ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిన మర్యాద మనీష్ రెండు వారాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత ? బిగ్ హౌజ్ లో అతని తీరని కోరిక ఏంటి ?

Maryada Manish Bigg Boss 9 Remuneration Revealed: 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9'లో రెండవ వారం ఎలిమినేషన్ ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచింది. నిజానికి కామనర్ కంటెస్టెంట్ మర్యాద మనీష్ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారని ముందుగానే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే నిజంగానే ఈ రోజు అతను హౌస్ నుంచి బయటకు రావడం షాక్ ఇచ్చింది. దీంతో ఈ రెండు వారాలలో మనీష్ బిగ్ బాస్ హౌజ్ లో ఆడి, సంపాదించింది ఎంత? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎంట్రీలోనే ట్విస్ట్... ఎగ్జిట్ లో తీరని కోరిక
'బిగ్ బాస్ సీజన్ 9'లో ఈసారి 6 మంది కామనర్లు, 9 మంది సెలబ్రిటీలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత వారం సెలబ్రిటీలలో శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కాగా, ఈ వారం కామనర్స్ లో ఒకరైన మర్యాద మనీష్ బయటకు వచ్చేశారు. అయితే తాజాగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మర్యాద మనీష్ ఎంట్రీనే ట్విస్ట్ తో మొదలైంది. నిజానికి అగ్ని పరీక్షలో ఎంతో మందిని దాటుకొని టాప్ కంటెస్టెంట్ లిస్టులో ఆయన చోటు దక్కించుకున్నారు. అయితే బిగ్ బాస్ లాంచ్ ఎపిసోడ్ లో మాత్రం చివరిదాకా అతనికి చోటు లేదు అనిపించింది. ఐదుగురు కామనర్స్ ని హౌస్ లోకి పంపించిన తర్వాత శ్రీముఖి సడన్ ఎంట్రీ ఇచ్చి, మర్యాద మనీష్ ని కూడా హౌస్ లోకి పంపాల్సిందిగా నాగార్జునను రిక్వెస్ట్ చేసింది.
అలా హౌస్ లోకి అడుగు పెట్టిన మనీష్ తన మాస్టర్ మైండ్ తో స్ట్రాటజీలు వాడుతూ బాగానే కష్టపడ్డాడు. ఇంట్లో ఏదో ఒక పని చేయాలని తాపత్రయ పడుతూనే, టాస్కులు వచ్చినప్పుడు ఇరగదీసాడు. కానీ రోజు రోజుకూ హౌస్ లో లెక్కలు మారుతూ వచ్చాయి. ముఖ్యంగా తన టీంమేట్స్ అయిన ప్రియా, శ్రీజ అంటే పడని పరిస్థితి చోటుచేసుకుంది. దీంతో మనీష్ ఎక్కువగా టెనెంట్స్ తోనే ఉంటూ వచ్చాడు. ముందుగా అపార్థం చేసుకున్న సంజనతోనే మంచి ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. అయితే తనవరకు నూటికి నూరు శాతం కష్టపడిన మనీష్ ఇలా మధ్యలోనే బయటకు రావడానికి గల కారణం అతనికి పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడం అని చెప్పాలి. ఏదైతేనేం గత వారం మొత్తం సొంత టీంమేట్స్ పై అలిగి పస్తులున్న మనీష్, తను ఇండివిడ్యువల్ గా గేమ్ ఆడతానని శపథం చేశాడు. కానీ అంతలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు రావాల్సి వచ్చింది. అలాగే ఫ్యామిలీ వీక్ వరకూ ఉంటే ఓ టీ షర్ట్ ను తన తండ్రికి బహుమతిగా ఇవ్వాలని కలలుగన్నాడు మనీష్. అది కూడా తీరని కోరికే అయ్యింది.
రెండు వారాలకు లక్షన్నర
ఇక అగ్నిపరీక్ష టైంలోనే మర్యాద మనీ ఇస్తాను 'ఫోర్బ్స్ అండర్ 30'లో సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా నిలిచినట్టు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వృత్తిపరంగా ఆయన మంచి స్థాయిలో ఉన్న వ్యక్తేనని తెలుస్తోంది. బిగ్ బాస్ టీం కూడా ఆయనకు భారీగానే రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రెండు వారాలకు మర్యాద మనీష్ రూ.1,40,000 అందుకున్నారని, అంటే వారానికి రూ. 70,000 తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక గతంలో ఆయన 'ఎవరు మీలో కోటీశ్వరుడు' అనే షోలో మనీష్ కంటెస్టెంట్ గా కూడా మెరిశారు. మరి ఇప్పుడు మనీష్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది? అతని ఎలిమినేషన్ తో హౌస్ లో డైనమిక్స్ ఎలా మారబోతున్నాయి? అనేది ఆసక్తికరంగా మారింది.





















