Bigg Boss 9 Telugu: మరోసారి కెప్టెన్ గా సత్తా చాటిన డెమాన్... తనూజ లైఫ్ లో స్పెషల్ పర్సన్... మోస్ట్ బోరింగ్ పర్సన్ జైలుకెళ్తే, వెళ్తూ ప్రియాకి ఇచ్చిపడేసిన మర్యాద మనీష్
Bigg Boss 9 Telugu Today Episode - Day 14 Review : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 14 ఎపిసోడ్లో మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబ్ తో ఆయన రివేంజ్ కూడా తీర్చుకున్నారు.

'బిగ్ బాస్ సీజన్ 9' ఎపిసోడ్ 15 మొత్తం ఫుల్ ఫన్నీగా సాగింది. శనివారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ తప్పొప్పులను సరిదిద్ది, మొట్టికాయలు వేసిన నాగార్జున... ఈరోజు మాత్రం సండే ఫన్ డే అంటూ ఎపిసోడ్ ను స్టార్ట్ చేశారు. అందులో తనూజ బిగ్ సీక్రెట్ ను రివీల్ చేయడం దగ్గర నుంచి మనీష్ ఎలిమినేషన్ వరకూ ఇంట్రెస్టింగ్ గా సాగింది ఈ ఎపిసోడ్.
తనూజ టాప్ సీక్రెట్ రివీల్
నిన్నటి ఎపిసోడ్ లో టెనెంట్స్ ను ఓనర్స్, ఓనర్స్ ను టెనెంట్స్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి ఓనర్స్ లో ఒకరైన తనూజ తనకు కాఫీ కావాలంటూ నాగార్జునను రిక్వెస్ట్ చేసింది. కానీ ఎవ్వరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్తేనే కాఫీ వస్తుందని నాగ్ చెప్పారు. దీంతో తనూజ తాను మామూలుగా లవ్ లో పడనని, కానీ ఒకరిని కాఫీ షాప్ లో కలిశానని వెల్లడించింది. అంతేకాదు ఈ సీక్రెట్ తన పేరెంట్స్ కి కూడా తెలియదని చెప్పి... కాఫీ సంపాదించింది. అయితే రీతూ తాము ఓనర్స్ కాబట్టి ఇప్పుడు చికెన్ ను పంపమని కోరింది. కానీ నాగ్ మాత్రం మళ్ళీ టెనెంట్స్ గా మారితే చికెన్ పంపుతారని చెప్పడంతో, ఓనర్స్ అందరూ ఏకపక్షంగా నో చెప్పారు.
మళ్ళీ కెప్టెన్సీ టాస్క్... డెమోన్ అరాచకం
'టైర్ అండ్ స్క్వేర్' టాస్క్ పెట్టి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ ఆడించారు నాగార్జున. రీతూ చౌదరి సంచాలక్ గా... ఇమ్మాన్యుయేల్, డెమోన్ పవన్, మర్యాద మనీష్, భరణిలతో టాస్క్ ఆడించారు. ఎట్టకేలకు మళ్ళీ డెమోన్ పవన్ గెలిచి సత్తా చాటాడు. మరోసారి కెప్టెన్ గా గెలిచాడు. ఇక ఆ తర్వాత ఆటపాటలతో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది షో. అనంతరం 'గెస్ ది లిరిక్స్' అనే టాస్క్ పెట్టారు. ఇందులో ఓనర్స్ 15 పాయింట్స్ తెచ్చుకోగా, టెనెంట్స్ 40 పాయింట్స్ తో గెలిచారు.
మోస్ట్ బోరింగ్ పర్సన్... బిగ్ బాంబు డాక్టర్ పైనే
ఇక 14 మంది కంటెస్టెంట్స్ లో మోస్ట్ బోరింగ్ హౌజ్ మేట్ ఎవరని అడగ్గా... ఫ్లోరా పేరునే ఎక్కువమంది చెప్పారు. ఈ లిస్ట్ లో డెమాన్ పవన్, సంజన, హరీష్ కూడా చేరిపోయారు. ఎక్కువ మంది బోరింగ్ పర్సన్ గా ఓటు వేసిన ఫ్లోరా జైలుకి వెళ్లనుంది. కాగా ఈ వారం నామినేషన్ లో సుమన్ శెట్టి, భరణి, మర్యాద మనీష్, హరిత హరీష్, డెమాన్ పవన్, ప్రియా, ఫ్లోరా ఉన్నారు. ఆరెంజ్ తో భరణి నామినేషన్ నుంచి బయట పడితే, కాక్టస్ తో సుమన్ శెట్టి, పచ్చటి ఆకులతో డెమాన్ పవన్ సేవ్ అయ్యాడు. బాక్స్ లో హ్యాండ్ పెట్టాక గ్రీన్ కలర్ రావడంతో ప్రియా సేవ్ అయ్యింది. యాక్టివిటీ రూమ్ నుంచి మనీష్ ఎలిమినేట్ అయ్యి, బయటకు వచ్చాడు.
వెళ్ళేముందు మర్యాద మనీష్ తన ప్రకారం టాప్, బాటమ్ లలో ఎవరెవరు ఉన్నారో చెప్పారు. బాటమ్ లో శ్రీజ దమ్ము, ఫ్లోరా, సుమన్ శెట్టిని పెట్టారు. ఇక టాప్ లో నెంబర్ వన్ లో భరణి, ఇమ్మాన్యుయేల్, సంజన, హరీష్ లను పెట్టాడు. అలాగే టెనెంట్స్ లో ఒకరైన ప్రియాపై వాష్ రూమ్ బాధ్యతల బాంబును వేశాడు. హౌజ్ లో ఉన్నంతసేపూ ప్రియాపై కంప్లైంట్ చేస్తూనే ఉన్న మనీష్... వెళ్తూ వెళ్తూ ఇలా రివేంజ్ తీర్చుకున్నారు.





















