Bigg Boss 9 Telugu: ఫన్... లవ్ స్టోరీ - ఫ్లోరా షైనీ వెరీ బోరింగ్ అంటున్న హౌస్ మేట్స్, ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్‌లో టాస్కుల పోరు హోరా హోరీగా సాగుతోంది. ఫస్ట్ ఫన్, కెప్టెన్సీ టాస్కులతో సాగిన హౌస్... ఎలిమినేషన్ ప్రాసెస్‌కు వచ్చేటప్పటికీ హీట్‌గా మారింది.

Bigg Boss Telugu 9 Day 14 Promo Review: బిగ్ బాస్ సీజన్ 9లో రెండో వారం ఎలిమినేషన్ ప్రాసెస్‌కు రంగం సిద్ధమైంది. ఫస్ట్ వీక్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చేయగా ఈ వారం ఎవరు బయటకు వస్తారనే దానిపై అందరిలోనూ సస్పెన్స్ నెలకొంది. ఇక ఎలిమినేషన్ ప్రాసెస్‌కు ముందు కెప్టెన్సీ కోసం టాస్కులు కంటెస్టెంట్లతో నాగ్ ఫన్ అదిరిపోయింది. ఇదే సమయంలో తనూజ లవ్ స్టోరీ ఆసక్తి రేకెత్తించింది.
నాగ్ సార్... కాఫీ ప్లీజ్
ఫస్ట్ ఫస్ట్ ఫన్‌తో స్టార్ట్ చేశారు హోస్ట్ నాగార్జున. తనూజ... 'కిచెన్‌లో ఇప్పటివరకూ ఏం చేస్తున్నావ్ కిచెన్‌లో?' అంటూ నాగ్ ప్రశ్నించగా... ప్లీజ్ నాగ్ సర్ ఓ చిన్న కాఫీ డబ్బా పెట్టండి సార్. అంటూ రిక్వెస్ట్ చేసింది. దీంతో ఓ చిన్న సీక్రెట్ చెప్పాలంటూ అడిగారు నాగ్. దీంతో సిగ్గుపడిన తనూజ... 'నాకు అంత ఈజీగా క్రష్, లవ్ కాదు. కాఫీ షాపులో పర్సన్‌ను కలిశాను.' అంటూ చెప్పగా... 'ఇమ్మూ నువ్వు ఫోన్‌లో మాట్లాడిన రమేష్ గురించి కాదు ఈ మేటర్.' అంటూ నాగ్ చెప్పగా... రమేష్ ఎవరు? అంటూ ఆశ్చర్యపోవడం తనూజ వంతైంది. ఇక నాగ్ ముద్దులతో ఫోన్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వగా హౌస్‌లో నవ్వులు పూశాయి.
ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్
ఓనర్స్ టెనెంట్స్‌కు మధ్య లిరిక్స్ గెస్ చేసే టాస్క్ పెట్టారు నాగ్. బిగ్ బాస్ సాంగ్ ప్లే చేయగా ఇమ్మూ, దమ్ము శ్రీజ పోటీ పడి మరీ పాట పాడారు. ఇమ్మూ, డీమాన్ పవన్ మధ్య కూడా లిరిక్స్ గెస్సింగ్ టెస్ట్ ఫన్‌గా సాగింది. ఆ తర్వాత డ్యాన్సులతో హౌస్ మేట్స్ హోరెత్తించగా సుమన్ ఎక్స్‌ప్రెషన్ సూపర్ అంటూ నాగ్ చెప్పడం హైలైట్ అయ్యింది.
View this post on Instagram
టాస్క్ ఫర్ కెప్టెన్సీ
ఈ వారం కెప్టెన్సీ కోసం నాగ్ టాస్క్ అసైన్ చేశారు. టైర్స్‌ను కంటెస్టెంట్స్ ముందు పెట్టి వాటిని బజర్ మోగే లోపు ఎవరైతే వారికి అసైన్ చేసిన బాక్సెస్‌లో వారే గెలిచినట్లు అంటూ టాస్క్ అసైన్ చేయగా... కంటెస్టెంట్స్ తీవ్రంగా శ్రమించారు. ఇమ్మూన్యుయేల్, డీమాన్ పవన్ మధ్య హోరా హోరీ పోరు సాగింది. అటు మర్యాద మనీష్ సైతం కెప్టెన్సీ టాస్కులో బాగానే కష్టపడ్డాడు.
ఫ్లోరా వెరీ బోరింగి
హౌస్‌లో మోస్ట్ బోరింగ్ ఎవరు? అంటూ నాగ్ ప్రశ్నించగా... హరీష్, శ్రీజ, సంజనా, డిమాన్ పవన్ అందరూ కలిసి ఫ్లోరా షైనీ వెరీ బోరింగ్ అంటూ చెప్పారు. ఇక తనూజ మాత్రం హరీష్ బోరింగ్ అంటూ చెప్పారు. అటు సుమన్ కూడా ఫ్లోరానే బోరింగ్ అంటూ చెప్పారు. 'ఆమెకు హిందీ వచ్చు నాకు హిందీ రాదు సార్.' అంటూ చెప్పగా... నువ్వు బోజ్‌పురిలో మాట్లాడొచ్చు కదా అంటూ నాగ్ చెప్పగా... 'నేను 2 సినిమాలే చేశాను సార్' అంటూ తెలిపారు.
ఎవరు అవుట్?
ఫన్, టాస్కుల తర్వాత నామినేషన్లలో ఉన్న వారు నిలబడాలంటూ నాగ్ అనగా... సుమన్ శెట్టి, డీమాన్ పవన్, మర్యాద మనీష్, ఫ్లోరా షైనీ, ప్రియా శెట్టి నిలబడ్డారు. ఇక వారి చేతికి కాక్టస్ ఇచ్చి 'యామ్ ఐ సేఫ్' అని అడగాలంటూ నాగ్ చెప్పగా... వారు అలానే చేశారు. ఎవరికీ కాక్టస్ రెస్పాండ్ కాకపోవడంతో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ వారం మర్యాద మనీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
View this post on Instagram





















