Bigg Boss Buzzz : అర్జున్ అదిరే ప్రశ్నలకు సీత కిరాక్ సమాధానం... ఆ ఒక్క కోరిక తీరలేదు అంటూ ఎమోషనల్
ఆరవ వారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి ఎలిమినేట్ అయిన తరువాత బిగ్ బాస్ బజ్ లో అర్జున్ ప్రశ్నలకు సీత కిరాక్ సమాధానం ఇచ్చింది.
Kirrak Seetha interview : బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు తాజా ఎలిమినేషన్ లో హౌస్ నుంచి కిరాక్ సీత ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆరవ వారం ఎలిమినేట్ అయిన ఈ అమ్మడు వెళ్తూ వెళ్తూ క్లోజ్ ఫ్రెండ్ విష్ణు ప్రియను పక్కన పెట్టేసి, తమ్ముడు నబిల్ అఫ్రిది విన్నర్ గా గెలవాలని కోరుకుంది. అలాగే సీత స్టేజిపై బోలెడన్ని విషయాలను పంచుకుంది. అయితే అందరిలాగే స్టేజ్ పై హౌస్ మేట్స్ గురించి పాజిటివ్ గా చెప్పిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక మాత్రం ఒక్కొక్కరిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ ఎలిమినేషన్ తర్వాత జరిగే బజ్ ఇంటర్వ్యూ ప్రోమోలో అర్జున్ అంబటి అడిగిన ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది.
మంచితనమే కొంపముంచిందా?
అయితే ముందుగా సీతని 'ఇక్కడ నేను మాట్లాడింది విన్న తర్వాత మీరు మాట్లాడండి' అంటూ అర్జున్ ఇంటర్వ్యూ ని మొదలు పెట్టాడు. అతనికి తగ్గట్టుగానే సీత కూడా ధీటుగా సమాధానాలు చెప్పడం విశేషం. ముందుగా 'బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ టైం అవకాశం.. దాన్ని మీరు సరిగ్గా ఉపయోగించానని అనుకుంటున్నారా?' అనే ప్రశ్నకి.. '100% నేను ఇచ్చానని అనుకుంటున్నాను' అని కిరాక్ సీత చెప్పుకొచ్చింది.
'హౌస్ లో మీ పతనం ఎప్పుడు స్టార్ట్ అయింది అనే విషయాన్ని మీరు గమనించారా ?' అని అడగ్గా.. 'టాస్క్ వచ్చినప్పుడు వేరే వాళ్ళని పంపడం వల్ల డౌన్ అయ్యాను అని నేను అనుకుంటున్నాను' అని వివరించింది. 'ఏడవడం అనేది స్ట్రాంగా?' అని అడిగిన ప్రశ్నకి.. 'మరి అరవడం స్ట్రాంగా ?' అంటూ అర్జున్ కే కౌంటర్ వేసింది ఈ కిరాక్ పాప. అయితే 'ఎలిమినేట్ అయ్యాక మీ మంచితనమే కొంపముంచిందని మీకు అనిపించలేదా ?' అని అర్జున్ అడగ్గా.. 'కొంపమునగదు కదా అని క్యారెక్టర్ మార్చుకోలేను కదా' అని ఆన్సర్ ఇచ్చింది సీత.
హౌస్ మేట్స్ పై సీత షాకింగ్ కామెంట్స్
ఇక ఆ తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి ప్రస్తావన వచ్చింది. అందులో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో వేస్ట్ అని ఎవరనిపించారో వాళ్ళ గురించి చెప్పమంటూ ఒక్కొక్కరి ఫోటోలను సీత చేతికి అందించారు అర్జున్. అందులో టేస్టీ తేజ చిరాకుగా అనిపించాడంటూ 'వారమైనా సరే పెద్దగా పర్ఫామ్ చేసినట్టు, కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనిపించలేదు' అని చెప్పి వేస్ట్ బిన్ లో పడేసింది సీత. 'గేమ్ పరంగా చూస్తే నిఖిల్ ట్రాన్స్ఫరెన్సీగా లేడు' అని చెప్పుకొచ్చింది.
ఇక చివరిగా అర్జున్ 'మీ అమ్మ ఓ లెటర్ పంపింది కదా.. అందులో ఏముంది?' అని అడగ్గా ఆమె ఎమోషనల్ అయ్యింది. 'ఏం జరిగింది అనే విషయాన్ని పక్కన పెడితే దాని గురించి నాకు అసలు ఆలోచించాలనే లేదు. ఎందుకంటే నేను నాలాగే ఉన్నాను. సంతోషంగా బయటకు వచ్చాను. మా అమ్మని హౌస్ లో చూడాలనుకున్న కల ఒక్కటే తీరలేదు నాకు' అంటూ ఏడ్చింది. హౌస్ లో మంచితనం చూపిస్తూ మెతగ్గా ఉండటమే సీతను బయటకు పంపించిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది కావాల్సినంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం వల్లే సీత ఎలిమినేట్ అయిందని అంటున్నారు.