అన్వేషించండి

Bigg Boss Telugu season 8: బిగ్‌బాస్‌తో రీచార్జ్ అవుతున్న నాగ్- ఈసారి మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా!

Bigg Boss Telugu: బిగ్ బాస్‌తో జనాల్లోకి వచ్చి మళ్లీ సందడి చేసేందుకు కింగ్ రెడీ అయ్యారు. టెన్షన్లన్నీ పక్కన పెట్టేసి తెలుగు టెలివిజన్ రంగంలోని ఫ్లాగ్ షిప్ షో కోసం ఉత్సాహంగా మేకప్ వేసుకుంటున్నారు.

Bigg Boss Telugu Host Nagarjuna: బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ హోస్ట్ గా మరోసారి కింగ్ నాగార్జునే సందడి చేయబోతున్నారని అందరికీ తెలిసిందే. కానీ.. తన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని హైడ్రా కమిషన్ కూల్చివేయడంతో.. ఆయన కాస్త డీలా పడిన మాట వాస్తవం. తన తప్పేం లేదని.. తగిన అనుమతులతోనే ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగిందని ఆయన సోషల్ మీడియాలో వివరణ కూడా ఇచ్చారు. కానీ.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో నాగ్ ఎంతో ఆవేదనకు గురయ్యారట. ఇంతలోనే బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభం కానుండడంతో.. ఆ ప్రభావం సీజన్ పై పడుతుందేమో అని చాలా మంది అనుకున్నారు. అసలు నాగ్.. ఈ సీజన్ ను హోస్ట్ చేస్తారా.. చేయరా.. అనే చర్చ కూడా పెట్టారు. కానీ.. ఆ డిస్కషన్ కు ఫుల్ స్టాప్ పెడుతూ.. కింగ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు.. నాగ్.

బిజినెస్ బిజినెస్సే.. ప్రొఫెషన్ ప్రొఫెషనే అని ప్రూవ్ చేస్తూ.. హోస్ట్ గా మళ్లీ తనదైన మార్క్ చూపించేందుకు నాగార్జున రెడీ అయ్యారు. మూడో సీజన్ నుంచి ఏడో సీజన్ వరకూ సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్లను తన భుజాలపై నడిపించిన నాగ్.. మరోసారి బిగ్ బాస్ కు అందరికీ వెల్ కమ్ చెప్పేందుకు మేకప్ వేసుకుంటున్నారు. పర్సనల్ బిజినెస్ విషయాల ప్రభావాన్ని ఏ మాత్రం ప్రొఫెషన్ పై పడకుండా.. రెట్టించిన ఉత్సాహంతో ఆయన అన్నపూర్ణ సెట్స్ లో అడుగు పెట్టేందుకు సై అంటున్నారు. ఇప్పటికే రిలీజైన నాగార్జున ప్రోమోలు, ప్రమోషన్ కంటెంట్లతో బజ్ అమాంతం పెరిగిపోతోంది. ఈ కొత్త సీజన్ కూడా.. హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు అన్ లిమిటెడ్ ఫన్ అందించడం ఖాయమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్టే.. జీనీ గెటప్ లో ప్రోమోలతో సందడి చేసిన నాగ్.. ఈ సారి కంటెంట్ ఎలా ఉండబోతోందన్నదీ చెప్పకనే చెప్పారు.

ఇంత ఉత్సాహంగా ఉన్న నాగార్జున.. సినిమాల్లో కూడా బిజీగా మారిపోయారు. తాజాగా.. తమిళ్ లో క్రేజీ ప్రాజెక్ట్ లో కింగ్ భాగమైన విషయాన్ని ఆ సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాతి సినిమా "కూలీ"లో.. నాగార్జున ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. సైమన్.. పేరుతో సినిమాలోనే కీలకమైన ఆ రోల్ ను కింగ్ ఎక్సలెంట్ గా పెర్ఫార్మ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ  సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకుడు. అటు రజనీ.. ఇటు నాగ్.. ఈ ఇద్దరు టాప్ రేటెడ్ స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమా.. సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే.. క్రేజీ అండ్ వర్సెటైల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌లో కుబేర పేరుతో మరో పాన్ ఇండియా మూవీ రెడీ అవుతోంది. ప్రభుత్వ సంస్థకు చెందిన అధికారిగా నాగ్ తన పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ ను ఇందులో చూపించబోతున్నట్టు టాక్.

ఇలా.. ఇటు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హోస్ట్ గా మాత్రమే కాకుండా.. యాక్టర్ గా కూడా నాగ్ డబుల్ ఉల్లాసంగా.. త్రిబుల్ ఉత్సాహంగా ఉన్న విషయం క్లియర్ కట్ గా తెలిసిపోతోంది. బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ స్టార్ట్ కానుండడంతో.. మరోసారి ఆయన పేరు సోషలో మీడియాను షేక్ చేయడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget