Bigg Boss Telugu 7: తప్పు చేసిన శోభా - తనతో పాటు కంటెస్టెంట్స్ అందరికీ ‘బిగ్ బాస్’ పనిష్మెంట్, ఇదేం ట్విస్ట్?
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ అనుమతి లేకుండా ఏమీ చేయడానికి వీలులేదు. కానీ శోభా సరదాగా చేసిన పనికి తనతో పాటు కంటెస్టెంట్స్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫినాలే అస్త్రా టాస్క్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు ఈ రేసులో నలుగురు పాల్గొనగా.. నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో గౌతమ్ కూడా ఈ రేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తాజాగా విడుదలైన మొదటి ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రోమో కూడా విడుదల కాగా.. అందులో గౌతమ్.. అమర్‌కు పాయింట్స్ ఇచ్చినా కూడా తననే అందరూ తప్పుబట్టారు. గౌతమ్ రేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రియాంక ఒత్తిడి వల్ల తన పాయింట్స్‌ను అర్జున్‌కు కాకుండా అమర్‌కు ఇచ్చాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా దాని గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
అమర్‌దీప్‌పై శివాజీ సెటైర్లు..
తాజాగా విడుదలయిన ప్రోమోలో అసలు తాను అమర్‌దీప్‌కు పాయింట్స్ ఎందుకు ఇచ్చాడో చెప్పుకొచ్చాడు గౌతమ్. ‘‘నిన్నటి నుంచి పదిసార్లు అడిగింది. ఇప్పుడు కూడా వచ్చి ఏడ్చుకుంటూ చూస్తుంది. ఏడుపు మొహం పెట్టుకుంది’’ అంటూ ప్రియాంక ప్రవర్తన గురించి స్పై బ్యాచ్‌కు వివరించాడు. గౌతమ్ పాయింట్లు ఇచ్చి అమర్‌దీప్.. టాప్ స్థానంలో ఉన్నా కూడా శోభా ఇంకా తృప్తిచెందలేదు. ప్రియాంకను మాటలతో హింసించడం ఆపలేదు. ‘‘అలా ఇస్తా అనుంటే నిన్న డైరెక్ట్‌గానే ఇవ్వొచ్చు. అతనికి ఇచ్చి. నువ్వు గౌతమ్‌కు చెప్పి ఇతనికి ఇప్పించడం నాకు ఏదోలా అనిపించింది’’ అని అమర్‌ను మరోసారి రెచ్చగొట్టినట్టు మాట్లాడింది శోభా. శివాజీ, అమర్, అర్జున్‌ల మధ్య కూడా ఈ పాయింట్ల గురించి డిస్కషన్ జరిగింది. ‘‘ఎలాగైనా గెలవచ్చు అని నిరూపించావు’’ అని అమర్‌తో వ్యంగ్యంగా అన్నాడు శివాజీ. దీంతో అమర్ ఒక్క లుక్ ఇచ్చాడు. వెంటనే ‘‘ఆడి’’ అని యాడ్ చేశాడు. శివాజీ తనను ఆటపట్టిస్తున్నాడని అమర్‌కు అర్థమయ్యింది. అయినా ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయాడు.
ప్రశాంత్ జస్ట్ మిస్..
ఇక ఫినాలే అస్త్రా రేసులో మిగిలిన పల్లవి ప్రశాంత్, అర్జున్, అమర్‌ల మధ్య మరో టాస్క్ జరిగింది. ‘‘మీ ముగ్గురు చురుకుదనాన్ని పరీక్షించేందుకు బిగ్ బాస్ ఇస్తున్న పదవ ఛాలెంజ్ సార్ట్ మీ ఔట్’’ అని బిగ్ బాస్ ప్రకటించారు. ఈ టాస్క్‌లో ముగ్గురు కంటెస్టెంట్స్ ఒక పజిల్‌లాంటి గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఒకే రంగు బాల్స్ అన్నింటిని ఒకవైపుకు చేర్చాల్సి ఉంటుంది. దీనికి గౌతమ్ సంచాలకుడిగా వ్యవహరించాడు. అయితే ఇందులో అర్జున్, ప్రశాంత్‌ల గేమ్ దాదాపు ఒకేసారి ముగిసినా.. ప్రశాంత్‌కంటే ముందుగా గంట కొట్టి ఎక్కువ పాయింట్లను సాధించుకున్నాడు అర్జున్. జస్ట్ మిస్ అయినందుకు ప్రశాంత్ డిసప్పాయింట్ అయ్యాడు. టాస్క్ ముగిసిన అందరు కంటెస్టెంట్స్ వెళ్లిపోయిన తర్వాత ఆ పజిల్‌తో ఆడుకోవడం మొదలుపెట్టింది శోభా.
గంటపాటు నిద్రపోవచ్చు..
తన అనుమతి లేకుండా పజిల్‌ను ముట్టుకున్నందుకు మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని బిగ్ బాస్ ప్రకటించారు. ఆ పనిష్మెంట్ ఏంటో చెప్పడం కోసం కంటెస్టెంట్స్ అందరినీ లివింగ్ ఏరియాలోకి రమ్మన్నారు. ‘‘శోభా కారణంగా బిగ్ బాస్.. ఇంటి సభ్యులు అందరికీ పనిష్మెంట్ ఇస్తున్నారు’’ అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ‘‘దీనికోసం మొట్టమొదటిసారి ఒక స్పెషల్ టికెట్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటినుంచి సుమారు గంటసేపు హాయిగా నిద్రపోవచ్చు’’ అని చెప్పగానే కంటెస్టెంట్స్ అంతా నమ్మలేకపోయారు. బిగ్ బాస్ లైట్స్ కూడా ఆఫ్ చేయడంతో నిజమే అనుకొని కంటెస్టెంట్స్ అంతా వెళ్లి పడుకున్నారు. కానీ ఇందులో ఏదో ట్విస్ట్ ఉండవచ్చని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.
Also Read: 'ప్రియాంకను ఏం అనకు' అంటూ అమర్‌కు గౌతమ్ వార్నింగ్ - రివర్స్ అయిన శోభా
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply