అన్వేషించండి

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్స్‌గా వచ్చేది వీళ్లే!

Bigg Boss 8 Telugu Contestants: బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకొని సీజన్ 8 కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. ఇక త్వరలోనే ప్రారంభం కానున్న కొత్త సీజన్‌లో కంటెస్టెంట్స్ ఎవరో ఓ లుక్కేయండి.

Bigg Boss 8 Telugu Contestants List: బిగ్ బాస్ అనే రియాలిటీ షో దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. అందుకే ప్రతీ ఏడాది అస్సలు మిస్ అవ్వకుండా ఈ రియాలిటీ షోకు సంబంధించిన కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇక తెలుగులో కూడా బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా ఎవరు వస్తారు అనేదానిపై పలువురి పేర్లు బయటికొచ్చాయి.

బమ్‌చిక్ బబ్లూ

ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఒక యూట్యూబర్‌ను కంటెస్టెంట్‌గా తీసుకురావడం సహజం. అలాగే బిగ్ బాస్ 8లో తన యూట్యూబ్ కంటెంట్‌తో నవ్వించే బమ్‌చిక్ బబ్లూ కంటెస్టెంట్‌గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాలతో ఒక రేంజ్‌ను సక్సెస్ చూసి చాలాకాలమే అయ్యింది. అందుకే బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా రావడం వల్ల తన కెరీర్‌కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సోనియా సింగ్

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్, ‘విరూపాక్ష’ ఫేమ్ సోనియా సింగ్.. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వస్తే షోకు కాస్త గ్లామర్ కూడా యాడ్ అవుతుంది. ‘విరూపాక్ష’లో నటించిన తర్వాత తన గురించి ఎక్కువమంది ప్రేక్షకులకు తెలిసింది.

హేమ

ఇప్పటికే హేమ.. ఒక బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చింది. కానీ వచ్చిన మొదటి వారమే ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ చుట్టూ పలు కాంట్రవర్సీలు కూడా తిరుగుతూ ఉండడంతో హేమను కంటెస్టెంట్‌గా తీసుకుంటే సీజన్‌కు కూడా హైప్ వస్తుంది.

నేత్ర, వంశీకృష్ణ

మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షోకు అప్పుడప్పుడు రియల్ లైఫ్ కపుల్స్ కూడా కంటెస్టెంట్స్‌గా వస్తుంటారు. కానీ ఈసారి విడాకులు అయిపోయిన మాజీ భార్యభర్తలు రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నేత్ర ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, వంశీకృష్ణ ఒక మోటివేషనల్ స్పీకర్. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్‌గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read: వాళ్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.. ‘సలార్ 2’ రూమర్స్‌పై అదిరిపోయే పంచ్

నరేశ్, రియాజ్, కిరాక్ ఆర్పీ

జబర్దస్త్ నుండి బిగ్ బాస్‌కు.. ప్రతీ సీజన్ ఎవరో ఒక షిఫ్ట్ అవుతూనే ఉంటారు. అలా ఈసారి నరేశ్, రియాజ్, కిరాక్ ఆర్పీలలో ఎవరో ఒకరు కంటెస్టెంట్‌గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రీతూ చౌదరీ

తన సోషల్ మీడియా పోస్టులు, షోలు.. ఇలా దేంట్లో చూసినా రీతూ చాలా బోల్డ్‌గా కనిపిస్తుంది, మాట్లాడుతుంది. బిగ్ బాస్ ఎక్కువగా బోల్డ్ కంటెస్టెంట్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి సీజన్ 8లో అలాంటి బోల్డ్ కంటెస్టెంట్ రీతూ చౌదరీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుప్రిత

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సురేఖ వాణి కూతురు సుప్రిత కూడా బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టనుందని టాక్ వినిపిస్తోంది. సురేఖ వాణి కూడా పలుమార్లు బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వస్తుందనే వార్తలు వచ్చినా అది జరగలేదు. అందుకే ఈసారి తన కూతురు సుప్రిత పేరు వెలుగులోకి వచ్చింది.

కుమారీ ఆంటీ

ఒక స్ట్రీట్ ఫుడ్ ఓనర్ దగ్గర నుండి సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయారు కుమారీ ఆంటీ. సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యారు కాబట్టి ముందుగా తనను కంటెస్టెంట్‌గా పరిచయం చేసి తర్వాత కొన్ని వారాలకే ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువ.

బర్రెలక్క

బర్రెలక్క.. ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు.. పొలిటీషియన్ కూడా. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో బర్రెలక్క గురించి చాలామంది ప్రజలకు తెలిసింది.

కుషిత కల్లపు

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కేటగిరికి చెందిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లో కుషిత కల్లపు కూడా ఒకరు. తను సోషల్ మీడియాలో షేర్ చేసే హాట్ ఫోటోషూట్స్‌కు వేలల్లో లైకులు వచ్చిపడుతుంటాయి. ఇక ఇలాంటి అమ్మాయి బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెడితే గ్లామర్ డోస్ మరింత పెరిగే అవకాశం ఉంది.

బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర

బుల్లెట్ భాస్కర్.. ఇంకా జబర్దస్త్‌లోనే కమెడియన్‌గా కంటిన్యూ అవుతుండగా.. చమ్మక్ చంద్ర మాత్రం చాలాకాలం క్రితమే ఈ షోను వదిలేసి వెళ్లిపోయాడు. ఇప్పటికే బుల్లెట్ భాస్కర్‌కు పలుమార్లు బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చినా వెళ్లలేదు. సీజన్ 8లో మాత్రం ఈ ఇద్దరిలో ఒకరు కంటెస్టెంట్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అమృత ప్రణయ్

మన దేశంలో పరువు హత్యలు కొత్తేమీ కాదు. కానీ అలాంటి పరువు హత్యల గురించి ఒక్కసారిగా ప్రతీ ఒక్కరికి తెలిసేలా చేసింది ప్రణయ్ మర్డర్ కేసు. తన భార్య అయిన అమృత బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వస్తే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారు.

Also Read: నేడు రేవ్ పార్టీ కేసు నిందితుల విచారణ - హేమతో పాటు మరో 8 మందికి నోటీసులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget