అన్వేషించండి

Actress Hema: నేడు రేవ్ పార్టీ కేసు నిందితుల విచారణ - హేమతో పాటు మరో 8 మందికి నోటీసులు

Bangalore Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని హేమ ఎంత కవర్ చేయడానికి ప్రయత్నించినా దొరికిపోయింది. దీంతో తాను విచారణ కోసం సీబీఐ ముందు హాజరు కావాల్సి ఉంది.

Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసు శరవేగంగా ముందుకు కదులుతోంది. అందులో భాగంగానే ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న 8 మంది మే 27న విచారణలో పాల్గొనాలని సీబీఐ ఇప్పటికే నోటీసులు అందించింది. ఆ 8 మందిలో నటి హేమ కూడా ఒకరు. నటి హేమతో సహా 8 మందిని సీబీఐ ఈరోజు విచారించనుంది. ఇప్పటికే ఈ కేసులో పలు అరెస్టులు జరిగాయి. వారంతా ఇప్పుడు జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నారు. వారిని కూడా విచారించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అందుకు అనుమతి కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఈ రేవ్ పార్టీలో 103 మంది పాల్గొనగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు.

టెస్ట్‌లో పాజిటివ్..

బెంగుళూరు రేవ్ పార్టీ వల్ల నటి హేమ కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. ముందుగా తను రేవ్ పార్టీలో ఉంది అన్న విషయం బయటికి రాగానే సైలెంట్‌గా ఉండకుండా తాను ఎక్కడికి వెళ్లలేదని, హైదరాబాద్‌లోని ఫార్మ్ హౌజ్‌లోనే ఉన్నానని చెప్తూ ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియో తనను మరింత చిక్కుల్లో పడేసింది. బెంగుళూరులోని ఫార్మ్ హౌజ్‌లో ఉంటూ హైదరాబాద్‌లో ఉన్నానని హేమ అబద్ధం చెప్తుందని పోలీసులు గుర్తించారు. అక్కడే తను పార్టీలో పాల్గొంది అనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఆ రేవ్ పార్టీకి హాజరయిన వారికి డ్రగ్స్ టెస్ట్ చేయగా అందులో హేమకు పాజిటివ్ అని తేలడంతో తనపై కేసు కూడా నమోదయ్యింది.

కరాటే కళ్యాణి వ్యాఖ్యలు..

బెంగుళూరు రేవ్ పార్టీపై, అందులో పాల్గొన్న హేమపై ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు విమర్శలు కురిపించారు. అందులో ముందుగా కరాటే కళ్యాణి.. ఈ విషయంపై తన స్టైల్‌లో స్పందించింది. ఒక వీడియోను విడుదల చేస్తూ అందులో హేమ ప్రవర్తన గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూనే తనను విమర్శించింది కళ్యాణి. నీ దొంగ నాటకాలు ఆపు హేమ, నిన్ను రేవ్‌ పార్టీలో ఆరెస్ట్‌ చేసినట్టు బెంగుళూరు పొలీసులు స్పష్టం చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. వేరేవాళ్ల గురించి మాట్లాడే ముందు తన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోమని హేమకు సలహా ఇచ్చింది. అంతే కాకుండా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ హేమపై ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంది కరాటే కళ్యాణి.

మంచు విష్ణు స్పందన..

హేమ.. ‘మా’ అసోసియేషన్‌లో సభ్యురాలు కావడంతో మా అధ్యక్షుడు అయిన మంచు విష్ణు కూడా ఈ విషయంపై ట్విటర్ ద్వారా స్పందించాడు. ‘‘బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన డ్రగ్ కేసులో కొన్ని మీడియా సంస్థలు, కొంత మంది వ్యక్తులు నటి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఓ నిర్ధారణకు వచ్చే ముందు, నిజనిర్ధారణ చేయనటువంటి సమాచారం వ్యాప్తి చేసే ముందు కాస్త సంయమనం పాటించమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హేమ దోషి అని తేలేవరకు ఆమెను నిర్దోషిగా పరిగణించాలి. ఆవిడ ఒక అమ్మాయికి తల్లి, ఒకరి భార్య. పుకార్లను ఆధారం చేసుకుని ఆవిడ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడం, ఆమెను దూషించడం తగదు'' అంటూ హేమకు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడాడు విష్ణు.

Also Read: అలాంటివి ఇండస్ట్రీలో నార్మల్ అయిపోయాయి, ఇకపై అవే చేస్తా - కాజల్ అగర్వాల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget