Salaar 2: వాళ్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.. ‘సలార్ 2’ రూమర్స్‌పై అదిరిపోయే పంచ్
Salaar 2: సోషల్ మీడియా వచ్చాక రూమర్స్ కి కొదవ లేదు. గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్త 'సలార్ - 2' గురించి. ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది సినిమా టీమ్. ఒక్క ఫొటోతో ఆన్సర్ ఇచ్చింది.
Salaar 2 Team puts a checkmark on rumours About Movie Stopped: కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వార్త ప్రభాస్ 'సలార్ - 2' ఇక లేనట్లే అని. ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని, అందుకే సినిమా ఆగిపోయిందని ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వినిపించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. 'సలార్ - 2' కోసం వెయిట్ చేస్తున్నవాళ్లంతా అయ్యో! అనుకున్నారు. అయితే, దానిపై క్లారిటీ ఇచ్చింది సినిమా టీమ్. ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏం అనిందంటే?
ఫొటోతో చెక్..
ప్రభాస్.. 'సలార్-2' ని పక్కన పెట్టేసి, 'రాజా సాబ్' షూటింగ్ ని ప్రారంభిస్తున్నారట. ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో తాను చేయబోయే తర్వాతి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారట. అందుకే, 'సలార్' పార్ట్ 2 ఆగిపోయిందట అని వస్తున్న రూమర్స్ కి ఒక్క ఫొటోతో చెక్ పెట్టింది సినిమా టీమ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ ఇద్దరు పక్క పక్కన నిలబడి నవ్వుకుంటున్న ఫొటోను పోస్ట్ చేసింది. వాళ్లు నవ్వును ఆపుకోలేరు అంటూ ట్వీట్ చేసింది. దీంతో వాళ్లిద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని తేలిపోయింది.
They can't stop laughing 😁
— Salaar (@SalaarTheSaga) May 26, 2024
#Prabhas #PrashanthNeel#Salaar pic.twitter.com/FW6RR2Y6Vx
ఈ నెలలోనే షూటింగ్..
ఇక 'సలార్ - 2' షూటింగ్ ఈ నెల చివర్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లే షెడ్యూల్ ప్రకారం.. సినిమా షూటింగ్ మొదలు అవ్వనుంది. ప్రభాస్ నటించిన 'కల్కీ 2898 ఏడీ' పూర్తైన నేపథ్యంలో డార్లింగ్ 'సలార్', 'రాజాసాబ్' తదితర సినిమాలతో బిజీ అవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' సినిమా కూడా లైన్ లో ఉంది. ప్రభాస్ సినిమా అయిన తర్వాతే 'యానిమల్ పార్క్' మొదలవుతుందని సందీప్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. దీంతో ఆ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
'సలార్' సూపర్ హిట్..
వరుస పరాజయాలతో ఉన్న ప్రభాస్ కి 'సలార్' సూపర్ హిట్ ని అందించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బంపర్ వసూళ్లు సాధించిన విజయం తెలిసిందే. ఇక ఓటీటీలో కూడా సినిమా హవా అంతా ఇంతా కాదు. కాగా.. ఫస్ట్ పార్ట్ తీసినప్పుడే రెండో పార్ట్ కూడా ఉండబోతుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. సౌర్యంగ పర్వగా 'సలార్ - 2'ని తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించారు. ఇక 'సలార్' పార్ట్ - 1లో ప్రభాస్, శృతి హాసన్ తో పాటు చాలామంది సీనియర్ నటులు నటించారు. ఇక పార్ట్ - 2లో కూడా వాళ్లందరితో పాటు కొత్త నటులు, ప్రముఖ నటులు యాడ్ అవుతారని టాక్ వినిపిస్తోంది. పార్ట్ 1 కంటే 2 ఇంకా చాలా చాలా బాగుంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇంక అంతకంటే ముందు 'కల్కి' గా జూన్ 27న ప్రేక్షకులను అలరించనున్నారు ప్రభాస్.
Also Read: అలాంటివి ఇండస్ట్రీలో నార్మల్ అయిపోయాయి, ఇకపై అవే చేస్తా - కాజల్ అగర్వాల్