News
News
X

Bigg Boss 6 Telugu: ఆ చిన్న నల్ల చేప రేవంత్ కొంపముంచిందిగా, మరోసారి వారిద్దరినీ టార్గెట్ చేసిన గీతూ

Bigg Boss 6 Telugu: ఈ సీజన్ ఇప్పటి వరకు ఫ్లాప్ అనుకున్నారంతా. కానీ ఇప్పుడు హిట్టయ్యేలా కనిపిస్తోంది.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: ప్రతి సీజన్లో ఇద్దరు కంటెస్టెంట్లు బాగా హైలైట్ అవుతారు. దాదాపు వారి చుట్టే ఆట తిరుగుతుంది. గత సీజన్లలో చూస్తే అభిజిత్ - అఖిల్, బిందు మాధవి - అఖిల్, సన్నీ - షన్ను... ఇలా. కానీ ఈ సీజన్లో మొన్నటి వరకు అలా ఏ ఇద్దరూ తీవ్ర స్థాయిలో శత్రుత్వాన్ని పెంచుకున్నది లేదు. కానీ గత వారం రోజులుగా మాత్రం ఎందుకో రేవంత్ - గీతూ ఈ సీజన్ టాప్ ఫైటర్లుగా మారేట్టు కనిపిస్తుంది. వీరిద్దరికీ నిమిషం కూడా పడడం లేదు. ప్రతి చోటా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా గీతూ రేవంత్ చుట్టే తన కన్నింగ్ గేమ్‌ను తిప్పుతోంది. అలాగే ఆమెకు ఇనయా అన్నా పడదు. అసలే చేపల టాస్కులో రేవంత్ - ఇనయా జంటగా ఆడుతుంటే వారిని పూర్తిగా టార్గెట్ చేసింది గీతూ. కానీ ఆమె ఒక విషయాన్ని ఆలోచించలేకపోతోంది, ఒకరిమీద విషం చిమ్ముతూ, కన్నింగ్ గేమ్ తో చివరి వరకు ఉండొచ్చేమో కానీ విన్నర్ అవ్వడం కష్టం. కొన్నయినా మంచి గుణాలు ఉన్న వ్యక్తే విన్నర్ అవుతాడు. ఏ విషయంలో కూడా గీతూకి కాస్త కూడా మంచి లక్షణాలు ఉన్నట్టే కనిపించడం లేదు. 

ఇక ప్రోమోలో ఏముందంటే... చేపల టాస్కులో భాగంగా షీల్డ్ వార్ అనే రెండో గేమ్‌ను ఇచ్చారు బిగ్ బాస్. దీనికి రేవంత్ సంచాలక్‌గా ఉన్నారు. ఈ గేమ్‌లో నాలుగు జంటలు పోటీ పడ్డాయి. ఇందులో సూర్య టీమ్ గెలిచినట్టు చెప్పాడు రేవంత్. తరువాత అందరూ  తమ తమ టీమ్‌ల తో కూర్చుని మిగతా ఇంటి సభ్యుల గురించి మాట్లాడుకోవడం కనిపించింది. 

నల్ల చేప ఎంత పనిచేశావ్...
బిగ్ బాస్ ఒక నల్లచేప ఈరోజు చేపల్లో వచ్చిందని, అది ఎవరి దగ్గర ఉందో వారికి స్పెషల్ పవర్ ఉంటుందని చెప్పారు. అది గీతూ - ఆదిరెడ్డి టీమ్ దగ్గర ఉంది. దీంతో గీతూ తన కక్షను తీర్చుకుంది. రేవంత్-ఇనయా దగ్గర ఉన్న చేపలను, శ్రీహాన్ - శ్రీసత్య దగ్గర ఉన్న చేపలతో స్వాప్ చేస్తున్నటు చెప్పింది. నిజానికి రేవంత్ టీమ్ దగ్గరే అధికంగా ఉన్నాయి. స్వాప్ చేయడం వల్ల ఇనయా - రేవంత్ కెప్టెన్సీ కంటెండర్లు కాలేరు. దీంతో ఇనయా చాలా కోప్పడింది. రేవంత్ ‘ఆడటం చేతకాని వారే ఇలాంటి ఆటలు ఆడతారు’ అని అన్నాడు. 
ఇక ఇనయా ‘గేమ్ కంటిన్యూ అవ్వాలి అప్పుడు చెప్తా, ఇంకా గేమ్ కంటిన్యూ చేయండి బిగ్ బాస్’ అని అడిగింది. దానికి గీతూ రెచ్చగొట్టేలా మాట్లాడసాగింది. ఇంతవరకు నేను కామ్‌గా ఉన్నాను, నేను బరిలోకి దిగితే ఎలా ఉంటుందో చూస్తారు అంటూ అరిచింది ఇనయా. దానికి కూడా గీతూ సెటైర్లు వేస్తూ కనిపించింది. చివరికి రేవంత్ ‘నీలాంటి వాళ్లతో మాట్లాడకూడదు’ అన్నాడు గీతూతో. దానికి గీతూ ‘అందుకే మాట్లాడద్దు’ అంది. ఆమె యాటిట్యూడ్ చూస్తే ప్రేక్షకులకే చిరాకు వస్తోంది. ఇక ఇంటి సభ్యులు ఎలా భరిస్తున్నారో.  

News Reels

Also read: బిగ్‌బాస్ చరిత్రలో సంచాలక్ ఆట ఆడడం ఎప్పుడైనా చూశారా? ఇందుకే గీతూని అందరూ తిట్టేది

Published at : 26 Oct 2022 07:13 PM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Inaya sulthana Geethu fight with Revanth

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ‘టికెట్ టు ఫినాలే’ కోసం కిందా మీద పడి కొట్టుకున్న అమ్మాయిలు

Bigg Boss 6 Telugu: ‘టికెట్ టు ఫినాలే’ కోసం కిందా మీద పడి కొట్టుకున్న అమ్మాయిలు

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?