News
News
X

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ చరిత్రలో సంచాలక్ ఆట ఆడడం ఎప్పుడైనా చూశారా? ఇందుకే గీతూని అందరూ తిట్టేది

Bigg Boss 6 Telugu: ఎంత మంది తిట్టినా, ఏం చెప్పినా తానే కరెక్టు, ఇలాగే ఉంటా అనే పద్ధతి గీతూది.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: ‘బిగ్‌బాస్ సీజన్ పూర్తయ్యే లోపు గీతూలాంటి పిల్ల అందరింట్లో ఉంటే బాగుంటుంది అనిపించేలా చేస్తా’ అంది గీతూ. దానికి ప్రేక్షకులు ‘వామ్మో వద్దు తల్లోయ్’ అని దండం పెట్టేశారు. నిజమే కనీసం ఎథిక్స్ లేని అమ్మాయి తమ ఇంట్లో ఉండాలని ఎవరు మాత్రం కోరుకుంటారు. ఒక్కోసారి గీతూ చేసే పనులు, చెప్పే మాటలు ప్రేక్షకులకు చాలా చిరాకును తెప్పించేస్తున్నాయి. కావాలనే గొడవలు పెట్టుకోవడం, గొడవలు జరిగేలా చూడడం, నోటికొచ్చిన మాటలు మాట్లాడడం, పెద్దా చిన్న మర్యాద ఇవ్వకపోవడం, విపరీతమైన యాటిట్యూడ్ ఇవన్నీ షోలో చూడడం చాలా చికాకుగానే ఉన్నాయి. ఈరోజు ప్రోమో చూస్తే ఆ చికాకు ఇంకా పీక్ స్టేజ్‌లోకి చేరుతుంది. 

ఇక ఈ ప్రోమోలో ఏం జరిగిందంటే... ముందు ఎపిసోడ్లో ఆదిరెడ్డి - గీతూ ఓడిపోయారు. దీంతో కెప్టెన్సీ కంటెండర్లుగా వారిద్దరూ తొలగిపోయారు. దీంతో వారిద్దరినీ ఈ ఎపిసోడ్లో సంచాలక్ గా మార్చారు. పావలాకి రూపాయి యాక్షన్ చేసే గీతూ, ఇక సంచాలక్‌గా మారాక మరింత రెచ్చిపోయింది. కొత్త రూల్స్‌ను పెట్టింది. ఎవరూ కూడా చేపల బుట్టలపై పడుకుని కాపాడుకోరాదని, చేతులతోనే అడ్డుకోవాలని చెప్పింది గీతూ. దానికి ఆదిరెడ్డి అలా అడ్డుకోకపోతే ఆటే లేదంటూ అన్నాడు. అయినా గీతూ పట్టించుకోలేదు. అలాగే పైనుంచి పడుతున్న చేపలను తాను కూడా ఏరి నచ్చిన వాళ్లకి ఇవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు కూడా ఆదిరెడ్డి అడ్డుకున్నాడు. ‘ఇది నా గేమ్ సామి నేను ఇలాగే ఆడుతా’ అని అంది. ఇక బుట్టలోంచి కంటెస్టెంట్లు చేపలు లాక్కుంటుంటే తాను వెళ్లి లాక్కోవడం మొదలుపెట్టింది. అందరికీ ఆమె పద్దతి ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడు కూడా ఆది గట్టిగానే చెప్పాడు.‘బిగ్ బాస్‌లో ఏ సంచాలక్ అయినా ఆట ఆడడం చూశారా?’ అన్నాడు. దానికి గీతూ ‘నేను ఆట ఆడడం లేదు ఆడిస్తున్నా’ అని సమాధానం ఇచ్చింది. 

అంపైర్ గేమ్ ఆడేస్తుంటే...
ఇక బాలాదిత్య కరెక్టుగా గీతూకి తగిలేలా సెటైర్ వేశాడు. బ్యాట్స్‌మెన్ షార్ట్ కొట్టాక, అంపైర్ బంతి పట్టేసి అవుట్ చేసినట్టు ఉంది అన్నాడు. ఆదిరెడ్డి కూడా ఇది కరెక్టు కాదు అంటూ ఫీలయ్యాడు. గీతూ మాత్రం తాను చేసేదే కరెక్టు అనే ధీమాలో ఉంది. ఈమెకు బిగ్ బాస్ చురకలు వేస్తాడో, నాగార్జున వీకెండ్‌లో క్లాసు తీసుకుంటారో చూడాలి మరి. సంచాలక్‌లు ఇలా ఆడడం మొదలుపెడితే ఇక టాస్కులు పెట్టడం వేస్టు.     

News Reels

మెరీనాతో గొడవ...
ప్రోమో మొదలవ్వగానే గీతూ రాత్రి పూట నిద్రపోతున్న రేవంత్ దగ్గరికి వెళ్లి ఏదో వెతికింది. వెంటనే మెరీనా వచ్చి ఆ విషయం రేవంత్‌కి చెప్పింది. ఉదయం లేచాక గీతూ మెరీనాతో గొడవ పడింది. ‘నువ్వు ఆడవు, వేరే వాళ్లని ఆడనివ్వవు, నేను ఏం చేస్తే నీకెందుకు’ అంది. దానికి మెరీనా గట్టిగానే ఇచ్చింది. ‘గెలవలేకపోతున్నావు కాబట్టి ఆ ఫ్రస్టేషన్ ఇలా తీర్చుకుంటున్నావ్’ అంది మెరీనా. దానికి గీతూ ‘గెలిచున్నా నేను ఇలాగే మాట్లాడేదాన్ని’ అంది. 

Also read: కన్నింగ్ ఆటతో గెలుద్దామని ప్లానేసి ఓడిపోయిన గీతూ,వెక్కి వెక్కి ఏడుపు- చేపల టాస్కు అదిరిపోయింది

Published at : 26 Oct 2022 12:00 PM (IST) Tags: Revanth Bigg Boss 6 Telugu Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Geethu Game

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ‘టికెట్ టు ఫినాలే’ కోసం కిందా మీద పడి కొట్టుకున్న అమ్మాయిలు

Bigg Boss 6 Telugu: ‘టికెట్ టు ఫినాలే’ కోసం కిందా మీద పడి కొట్టుకున్న అమ్మాయిలు

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ షురూ - రేవంత్, శ్రీహాన్‌తో వాదనకి దిగిన ఆదిరెడ్డి

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

ఫైమా సంచాలక్‌గా నువ్వలా చేయొచ్చా? - ప్రశ్నించిన నాగార్జున, తలదించుకున్న ఫైమా

టాప్ స్టోరీస్

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Kavitha Satires: తాము వదిలిన బాణం, తామరపువ్వుల తానా తందానా! ఎమ్మెల్సీ కవిత సెటైర్లు

Indian Army's Kite: గద్దలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ, శత్రు డ్రోన్‌లు పసిగట్టేందుకు కొత్త ప్లాన్

Indian Army's Kite: గద్దలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ, శత్రు డ్రోన్‌లు పసిగట్టేందుకు కొత్త ప్లాన్

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?

UP Man Dies: డ్యాన్స్ వేస్తుండగా హార్ట్ ఎటాక్! వైరల్ వీడియో

UP Man Dies: డ్యాన్స్ వేస్తుండగా హార్ట్ ఎటాక్! వైరల్ వీడియో