Bigg Boss 6 Telugu Episode 46: బిగ్‌బాస్ ఇంట్లో దొంగలు, ఫుడ్ కోసం చుక్కలు చూపించిన బిగ్‌బాస్, ఇంటి సభ్యుల ఆకలి కేకలు
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు టాస్క్ లు ఆడి గెలిస్తేనే ఫుడ్ పెట్టాడు. ఇది ఇంటి సభ్యులు కూడా ఊహించలేదు.
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు 47వ రోజుకు చేరుకుంది. ఇక 46వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే... ముందురోజు కెప్టెన్సీ కంటెండర్ల టాస్కును బిగ్ బాస్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొంతమంది మాత్రమే ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నించారని, కొంతమంది ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో బిగ్ బాస్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు అంత నిర్లక్ష్యం అయితే ఇంటి నుంచి వెళ్లిపొమ్మని కూడా చెప్పారు బిగ్‌బాస్. దీంతో రాత్రి ఆ టాస్కు గురించి అందరూ బాధపడుతూ కూర్చున్నారు అంతా. ఇనయా చాలా ఫీలవుతూ కనిపించింది. ఇక గీతక్క ఆదిరెడ్డితో మాట్లాడుతూ ‘నువ్వు ఏమీ ఎంటర్టైన్ చేయలేదు, నువ్వెళ్లిపోతావేమో అని నాకు బెంగగా ఉంది. ఏదో ఒకటి చేయాలని కదా’ అంటూ ఆదిరెడ్డి విమర్శిస్తూ కనిపించింది. ఇక అక్కడికి వచ్చిన బాలాదిత్యతో మళ్లీ కఠినంగా మాట్లాడింది గీతూ. అయినా బాలాదిత్య ఆమెను మాట్లాడించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వీళ్లంతా ఆట మీద కన్నా పక్క వాళ్ల మీదే ఫోకస్ పెట్టారు. అందుకే ఎవరి ఆట కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించడం లేదు. ఈ వారం అందరితో పోల్చుకుంటే శ్రీహాన్ చాలా బెటర్ అనిపించాడు.
ఇంట్లో దొంగలు...
మరుసటి రోజు ఇంటి సభ్యులంతా మంచి ఆకలి మీద ఉన్నప్పుడు వారిని బెడ్ రూమ్లో బంధించారు. తరువాత ఇంట్లోకి దొంగలు వచ్చి దాచిన ఆహారాన్ని సైతం పట్టుకెళ్లిపోయారు. స్టవ్,ఓవెన్ ఏదీ పనిచేయకుండా చేశారు. దీంతో ఆకలితో ఇంటి సభ్యులు కూర్చున్నారు. బిగ్ బాస్ ఇకపై ఫుడ్ కావాలంటే పోరాడి గెలుచుకుని తినాలని చెప్పారు. ఇందుకోసం టాస్కులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడదీశారు. బహుమతిగా అన్నం - పప్పు పెట్టారు. ముందుగా కబడ్డీ పోటీ పెట్టారు. అది కూడా మూడు లెవెల్స్ తో దీన్ని ఆడించారు. గెలిచిన టీమ్ సభ్యులు వాటిని తిన్నారు. గీతూ సంచాలకులుగా ఉంది. గీతూ కూడా గెలిచిన టీమ్ లోనే ఉండడంతో ఆమె కూడా పప్పు అన్నం తింది. తరువాత మరో టాస్క్ ఇచ్చారు. దీనికి ఫైమా సంచాలకురాలు. దీనిలో ఆదిరెడ్డి ఉన్న టీమ్ సభ్యులు గెలిచారు. వారు చపాతీ - బంగాళాదుంప కర్రీ తిన్నారు.
గీతూ, ఆదికి శిక్ష
చపాతీలు, బంగాళాదుంప కర్రీని ఆదిరెడ్డి గీతూతో పంచుకున్నాడు. దీంతో బిగ్ బాస్‌కి కోపం వచ్చింది. వారిద్దరికీ అంట్లు తోమే శిక్ష వేశారు. ఇద్దరూ పనులు చేయడంలో బద్ధకస్తులు. వీరద్దిరికీ గిన్నెలు తోమే శిక్ష వేయడం ఫన్నీగా అనిపించింది. తోమేశాక ఆదిరెడ్డి ‘మొదటిసారి గిన్నెలు తోమాను, చాలా టార్చర్ గా ఉంది’అంటూ కనిపించాడు. ఇక గీతూ ‘మా ఇంట్లో చేయి కడుక్కోవడానికి కూడా గిన్నె తీసుకుని వస్తారు నాకు’ అంటూ ఓవర్ యాక్షన్ చేసింది.
వీరిపై ఇంటిసభ్యులు మాత్రం జోకులు, పేరడీ పాటలు బాగా పాడారు. ముఖ్యంగా గీతూ మీద చాలా పాటలు పాడారు. వాటిని చూసి నవ్వలేకచచ్చిపోతారు ప్రేక్షకులు. ఈ ఎంటర్టైన్మెంట్ ఏదో ముందు రోజు చేసుంటే పరిస్థితులు ఇలా మారేవి కావేమో. ఇక శ్రీహాన్ పుట్టినరోజు కావడంతో అందరూ కలిసి శ్రీహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
Also read: ఆ తప్పుకు శిక్షగా గీతూ, ఆదిరెడ్డితో అంట్లు తోమించిన బిగ్‌బాస్