Bigg Boss 6 Telugu: ఫుడ్ కోసం మళ్లీ గొడవ - కన్ఫెషన్ రూమ్‌లో నామినేషన్ ప్రక్రియ
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్లీ ఫుడ్ కోసం గొడవ పెట్టుకున్నారు ఇంటి సభ్యులు.
Bigg Boss 6 Telugu: ఓ వీకెండ్లో ఫుడ్ కోసమే క్లాసు తీసుకున్నారు నాగార్జున. సరిపోవడం లేదు అనవద్దని, బిగ్ బాస్ వారానికి సరిపడా ఫుడ్ పంపిస్తారని, న్యూట్రిషన కూడా సరిగా అందేలా చూసి పంపుతారని చెప్పారు. ఇలా చెప్పి అప్పట్లో ఇనాయ నోరు మూయించేశారు. అయితే ఇనాయ ఆరోజు తప్పుబట్టింది బిగ్‌బాస్‌ను కాదు, ఇంట్లో ఫుడ్ పై అజమాయిషీ చేసే రేషన్ మేనేజర్, కెప్టెన్లనే. కానీ ఆ విషయం హోస్ట్ కి అర్థం కాలేదు. అయితే ఇప్పుడు మళ్లీ అదే ఫుడ్ గొడవ తెర మీదకు వచ్చింది. ఈ సారి రేవంత్ తో శ్రీహాన్ కూడా గొడవ పెట్టుకున్నారు. నువ్వు మంచి కెప్టెన్ అనిపించుకోవడం కోసం చేస్తున్నావంటూ కడిగిపారేశాడు.
ఫైమా ‘కూర సరిపోదన్నా’ అంటూ కనిపించింది. దానికి రేవంత్ ‘మనం సరిపోవడానికి పెట్టడం లేదు, ఇచ్చిన రేషన్ బట్టే పెడుతున్నాం’ అన్నాడు. దానికి ఫైమా ‘అయిపోతే మళ్లీ వాళ్లు పంపిస్తారు’ అంది. దానికి రేవంత్ ‘వాళ్లు పంపిస్తారు కదా అని చెప్పి మనకు నచ్చినట్టు పెట్టుకోవడానికైతే నాకు తెలిసి అవ్వదు ఫైమా’ అన్నాడు. వెంటనే శ్రీహాన్ కూడా అందుకున్నాడు. ‘వారమంతా సరిపోయి సరిపోనట్టు ఉంటే, చివర్లో ఎక్కువ ఇచ్చేస్తే ఆ సాటిస్ఫేక్షన్ ఉండదు, నీ కెప్టెన్సీ విన్ అవుతుంది తప్ప, ఆకలి తీరదు ఎవరికీ’ అన్నాడు. ఇనయా కూడా ఇదే విషయంలో విమర్శిస్తూ కనిపించింది.
నామినేషన్...
ఇక నామినేషన్లను కన్ఫెషన్ రూమ్‌లో పెట్టారు బిగ్ బాస్. దీంతో వెటకారాలు, భారీ డైలాగులు వినే అవకాశం తప్పింది ప్రేక్షకులకు. ఎవరిని నామినేట్ చేస్తారో వారిని ఫోటోను ముక్కలు చేసి కారణం చెప్పాలని అడిగారు బిగ్ బాస్. కీర్తి శ్రీసత్యను నామినేట్ చేసింది. ఒకరిని గుచ్చి గుచ్చి రెచ్చగొట్టడంలో ఒక స్టెప్ ముందే ఉంటుంది శ్రీసత్య అని చెప్పింది కీర్తి. ఇక రేవంత్ ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు. తాను చాలా హర్ట్ అయినట్టు చెప్పాడు. ఇక శ్రీసత్య రాజ్ ను నామినేట్ చేసింది. కానీ సరైన కారణం చెప్పకపోవడంతో మళ్లీ కారణం చెప్పమని అడిగారు బిగ్‌బాస్.ఆదిరెడ్డి శ్రీహాన్ -రేవంత్ కలిసి ఆడుతున్నారన్న టాపిక్ గురించి మాట్లాడాడు. శ్రీహాన్ కూడా అదే టాపిక్ గురించి మాట్లాడి ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు. చివర్లో ఇనాయ కన్నీళ్లతో కనిపించింది. ఎవరి గురించి చెప్పిందో తెలియదు కానీ ‘ఇప్పుడు కలిసి వారిద్దరినీ ఒకేసారి నామినేట్ చేసేంత దూరం పెరిగిపోయింది’ అంది. ఆమె ఆ మాటలు అంది శ్రీహాన్ - శ్రీసత్య గురించే అని ప్రేక్షకులు భావిస్తున్నారు.
Housemates step into the confession room for this week's Nomination process!
— starmaa (@StarMaa) November 21, 2022
Catch the action tonight on @StarMaa, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar #DisneyPlusHotstar #StarMaa pic.twitter.com/S4oIRrvsdR
Also read: అనుకున్నట్టుగా మెరీనా అవుట్, వాళ్లు స్వచ్ఛమైన వాళ్లు కాదు అంటూ నలుగురి పేర్లు