Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సీజన్ 6 - లాంచింగ్ డేట్ ఎప్పుడంటే?
బిగ్ బాస్ సీజన్ 6 కోసం సన్నాహాలు చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టు నెలలో ఈ షో మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది.
Bigg Boss Telugu Season 6: బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం సన్నాహాలు చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టు నెలలో ఈ షో మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4 నుంచి మొదలవుతుందట. సెప్టెంబర్ 4 నుంచి వంద రోజుల పాటు ఈ షో సాగనుంది. షోకి వచ్చే క్రేజ్ ని బట్టి మరో వారం రోజులు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. 17 లేదా 18 మంది కంటెస్టెంట్స్ ఈ షోలో కనిపించనున్నారు.
గతంలో కామన్ మ్యాన్ కి ఈ షోలో అవకాశం దక్కింది. కొన్నాళ్లకు ఆ కాన్సెప్ట్ ను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ షో కామన్ మ్యాన్ కనిపించబోతున్నారు. అలానే బుల్లితెరపై అలరిస్తోన్న కొందరు సెలబ్రిటీలను ఈ షో కోసం తీసుకురాబోతున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న లిస్ట్ ప్రకారం.. యాంకర్ వర్షిణి, నటి నవ్యా స్వామి, యాంకర్ దీపిక పిల్లి, యాంకర్ ధన్షు, చిత్రారాయ్, ఆదిలను షో నిర్వాహకులు సంప్రదించినట్లు తెలుస్తోంది.
దాదాపు వీరిని ఫైనల్ చేసినట్లు సమాచారం. అలానే బిగ్ బాస్ నాన్ స్టాప్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిద్దరు బిగ్ బాస్ సీజన్ 6లో కనిపించనున్నారు. యాంకర్ శివ, మిత్రాశర్మ, అనిల్ రాథోడ్ లాంటి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 6లో కనిపించే ఛాన్స్ ఉంది. కింగ్ నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారు.
Also Read : తలలు కోసి చేతికిస్తా నాయాలా - మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాస్ మామూలుగా లేదుగా
Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు
View this post on Instagram