Bigg Boss Telugu Day 89 Promo : కళ్యాణ్ జోలికి రావద్దు అంటూ టార్గెట్ చేసిన తనూజ.. ఏడ్చేసిన రీతూ, పవన్
Bigg Boss 9 Telugu Ticket to Finale Task : బిగ్‌బాస్ సీజన్ 9లో టికెట్ టూ ఫినాలే కోసం యుద్ధం జరుగుతుంది. దీనిలో కళ్యాణ్ జోలికి రావద్దంటూ తనూజ స్టాండ్ తీసుకుంది. హైలెట్ ప్రోమో వచ్చేసింది.

Bigg Boss 9 Telugu Today Thanuja Targets Rithu Promo : బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. అయితే బిగ్‌బాస్ హోజ్లో తనకెవరు సపోర్ట్ చేయట్లేదంటూ చెప్పుకొచ్చిన తనూజ.. ఫ్యామిలీ వీక్ తర్వాత తనకు సపోర్ట్ ఉందని చెప్పింది. ముఖ్యంగా కళ్యాణ్ తనకి స్టాండ్ తీసుకున్నాడంటూ చాలాసార్లు మెన్షన్ చేసింది. అయితే ఈ సారి కళ్యాణ్‌కి తనూజ సపోర్ట్ ఇచ్చింది. డైరక్ట్‌గా కళ్యాణ్ జోలికి రావద్దంటూ సినిమా డైలాగ్ రేంజ్లో చెప్పింది. దానికి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. హైలెట్స్ ఏంటో చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్..
ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం కోసం మీరు ఇప్పుడు మరో యుద్ధం చేయాల్సి ఉందని చెప్పాడు బిగ్‌బాస్. దీనిలో రీతూ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ ఆడారు. కట్టు, నిలబెట్టు అంటూ బ్రిక్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్ ఏంటంటే కంటెస్టెంట్లు.. బ్రిక్స్ తీసుకుని.. ఒక స్థంబంలా కట్టాలి. మిగిలిన ఇంటి సభ్యులు.. వారు ఎవరినైతే గెలవకూడదు అనుకుంటున్నారో.. వారికి పిల్లర్‌ని బాల్స్‌తో కొడతారు. ఆ బాల్స్ తగిలి పిల్లర్ పడిపోకుండా పోటీదారులు బ్యాట్స్‌తో ఆపాల్సి ఉంది.
కళ్యాణ్ జోలికి రావద్దు.. తనూజ ఫైట్..
టాస్క్ మొదలైనప్పటి నుంచే.. కళ్యాణ్‌ని ఎవరు టార్గెట్ చేస్తారో.. నేను వాళ్లని టార్గెట్ చేస్తాను అని చెప్పింది తనూజ. డిమోన్.. కళ్యాణ్‌ని టార్గెట్ చేయడంతో.. రీతూని టార్గెట్ చేసింది తనూజ. భరణి, సంజన, తనూజ, పవన్, సుమన్ శెట్టి వారి బ్రిక్స్ పడగొట్టేందుకు చూశారు. అయితే ఎక్కువమంది రీతూని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి మరీ టార్గెట్ చేస్తారా అంటూ తనూజ పవన్‌తో అన్నది. ఎవరిని టార్గెట్ చేయాలో కూడా మీరే చెప్తారా అంటూ పవన్ రిప్లై ఇచ్చాడు.
ఏడ్చేసిన రీతూ.. పవన్ వల్లే డ్యామేజ్ జరిగిందా?
ప్లీజ్ తనూజ అంటూ రీతూ అడగ్గా.. వాడు తెలివిగా అక్కడికి వెళ్లి కళ్యాణ్ బ్రిక్స్ కొడితే నేను ఊరుకుంటానా? అంటూ మరిన్ని బాల్స్ వేసింది. చేయి బాగా లేకపోయినా రీతూని గట్టిగా టార్గెట్ చేసింది తనూజ. ప్లీజ్ తనూజ.. ప్లీజ్, ప్లీజ్ అంటూ రీతూ అడిగినా.. వాడికి చెప్పు నాకు కాదంటూ తనూజ రిప్లై ఇచ్చింది. దీంతో రీతూ ఎమోషనల్ అయింది. ఇద్దరూ కలిసి టార్గెట్ చేస్తున్నారు పవన్ అంటూ ఏడ్చింది. నావల్ల ఇద్దరూ కనిపించట్లేదా భరణి అన్నా.. నేను ఒక్కదానినే కనిపిస్తున్నానా అంటూ ఫీల్ అయింది.
మిగతా వాళ్లు కనిపించట్లేదు మీకు.. నన్నే తీసేయాలి. మళ్లీ హెల్ప్.. తొక్క, తోటకూర అంటూ గట్టిగా అరిచింది. బాల్స్ వేసే క్రమంలో పవన్ లైన్ లోపల చేయి పెట్టాడు. దీంతో పవన్‌ని డిస్క్వాలిఫై చేయాలంటూ.. కళ్యాణ్ సంచాలక్‌ని అడుగుతాడు. దీంతో పవన్ బాల్స్ వేయడం మానేస్తాడు. ప్రోమో ప్రకారం రీతూ బ్రిక్స్ పడిపోయి ఉండొచ్చు. వెళ్లి పవన్‌ని హగ్ చేసుకుని ఏడ్చేసింది. లైవ్ ప్రకారం కళ్యాణ్ టికెట్ టూ ఫినాలే షీల్డ్ అందుకున్నాడు. పూర్తి ఎపిసోడ్ కోసం రాత్రి 9.30 వరకు వేచి చూడాల్సిందే.






















