Bigg Boss Telugu Day 82 Promo : బిగ్‌బాస్‌లో లాస్ట్ కెప్టెన్ ఎవరు? రీతూపై మరోసారి నోరుజారిన సంజన, ఇమ్మూని తీసేసిన పవన్
Bigg Boss 9 Telugu Today Task : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు లాస్ట్ వీక్ కెప్టెన్ ఎవరు అనే దానిపై టాస్క్‌లు జరుగుతున్నాయి. దీనిని ఫుల్ గొడవలతో వెళ్లేలా ప్లాన్ చేశారు బిగ్‌బాస్.

Bigg Boss 9 Telugu Captiancy Task Promo : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు డే 82.. చివరి కెప్టెన్ ఎవరు? అనేది తేలాల్సి ఉంది. దీనిలో భాగంగానే యోధుల పేరుతో ఓల్డ్ కంటెస్టెంట్లను ఇంట్లోకి తీసుకువచ్చి.. గేమ్స్ ఆడించాడు. గెలిచిన వాళ్లు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. అయితే వీరిలో ఎవరు కెప్టెన్ అవ్వాలనేది తేలాల్సి ఉంది. అయితే ఈ సమయంలో టాస్క్ పెడితే గొడవలు రావు అనుకున్నాడేమో బిగ్‌బాస్. అందుకే నామినేషన్ తరహాలో టాస్క్ ఇచ్చాడు. మరి దీనిలో ఎవరు గెలిచారు.. చివరి కెప్టెన్ ఎవరు అయ్యారో.. ప్రోమో హైలెట్స్ ఏంటో చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్..
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. బిగ్‌బాస్ హోజ్లో.. చివరి కెప్టెన్సీ కోసం జరిగిన సంగ్రామంలో నేను పంపించిన యోధులతో మీరు అలుపెరుగని పోరాటం చేశారు. అయితే ఇప్పుడు కెప్టెన్ ఎవరు అవ్వాలనేది డిసైడ్ కాబోతుంది. కెప్టెన్సీ కంటెండర్స్ కానీవాళ్లు.. కెప్టెన్సీ కంటెండర్ల కోసం గేమ్ ఆడాల్సి ఉందని చెప్పాడు బిగ్‌బాస్. మరి ఎవరు ఉన్నారో.. ఈ టాస్క్‌లో గెలిచారో.. ఎవరు ఎవరిని సపోర్ట్ చేశారో చూసేద్దాం.
రీతూ vs సంజన
సుమన్ శెట్టి, తనూజ, భరణి.. వీళ్ల ముగ్గురు టేబుల్‌పై ఉన్న డాగర్ తీసి.. అక్కడ తాము సపోర్ట్ చేయాలనుకున్నవారికి దానిని ఇచ్చి.. మిగిలినవారిలో ఒకరిని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించవచ్చు. అలా ముందుగా గెలిచిన సుమన్ శెట్టి.. డాగర్ని రీతూకి ఇస్తాడు. రీతూ సంజనని ఈ టాస్క్ నుంచి తప్పిస్తుంది. గేమ్ అంటే గేమర్స్ గురించే మాట్లాడాలి. మీరు బిలో ది బెల్ట్ మాట్లాడారు. నాకు అది నచ్చలేదు. దీంతో ట్రిగర్ అయినా సంజన.. నీ గేమ్ ఏముంది రీతూ.. పొద్దున్నే లేస్తావు.. అటు వెళ్తావు.. ఇతను ఇటు వెళ్తాడు. తర్వాత ఇద్దరూ ప్యాచ్ అప్ అవుతారు అంటూ మళ్లీ అదే టాపిక్ తీసుకువచ్చింది. మీకోసం నేను జుట్టు కట్ చేసుకున్నందుకు నేను రిగ్రేట్ ఫీల్ అవుతున్నాను అంటూ చెప్పింది రీతూ.
పవన్ వర్సెస్ ఇమ్మాన్యుయేల్..
తర్వాత సంజన, తనూజ, భరణి గేమ్ ఆడారు. వారిలో భరణి గెలిచి.. డాగర్ డిమోన్ పవన్‌కి ఇచ్చాడు. నామినేషన్లో చెప్పిన రీజన్స్ చెప్పి.. ఇమ్మాన్యుయేల్‌ని రేసు నుంచి తప్పించాడు. దీంతో వారి మధ్య కూడా గట్టిగానే గొడవ అయింది. అయితే మొత్తం ప్రక్రియ ముగిసి.. చివరి కెప్టెన్‌గా డిమోన్ పవనే నిలిచాడు. పూర్తి వివరాల కోసం ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.






















