Bigg Boss Telugu 9 Day 23 : బిగ్‌బాస్‌లో నాలుగో వారం నామినేషన్స్.. టాస్క్లు పెట్టి మరీ గొడవలు పెట్టేస్తున్నాడుగా
Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్‌బాస్‌లో నాలుగోవారం నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. నిన్న ఇమ్యూనిటీ పొందినవారు నామినేషన్స్‌లో లేకుండా అవకాశం ఇచ్చారు.

Bigg Boss Telugu 9 Latest Promo on Immunity Task : బిగ్‌బాస్‌లో నాలుగోవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. లైవ్‌లో ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది కూడా. అయితే ఈరోజు ఎపిసోడ్ కోసం తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. బిగ్‌బాస్ టాస్క్లు పెట్టి కొందరికి ఇమ్యూనిటీ ఇవ్వగా.. మిగిలిన వారు నామినేషన్స్‌లోకి వెళ్లారు. అయితే ఈసారి ఒక్క మగవాడు మాత్రమే నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రోమోలో ఏమి ఉందో చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో..
బిగ్‌బాస్ నాలుగోవారం నామినేషన్స్‌లో భాగంగా కొన్ని టాస్క్లు పెట్టారు. కెప్టెన్ పవన్ నామినేషన్స్‌లో మీ పాత్ర చాలాకీలకమైనది అంటూ సంచాలకుడిని చేశాడు బిగ్‌బాస్. మీరు తీసుకునే నిర్ణయాలే నామినేషన్స్ ఏ దారిలో వెళ్తాయో తెలుస్తుందని చెప్పాడు బిగ్‌బాస్. దానిలో భాగంగా తనూజను ఓ టీమ్‌ని ఎంచుకుని వారితో పాటు ఓ గేమ్ ఆడాలని సూచించాడు.
తనూజ సుమన్ శెట్టి టీమ్‌ని ఎంచుకుంది. దీనిలో భాగంగా తనూజ టీమ్‌లోని ముగ్గురు.. సుమన్ శెట్టి టీమ్‌లోని ముగ్గురు నడుముకు తాడులు కట్టుకుంటారు. ఆయా టీమ్స్ హాల్లో ఉన్న బ్యాగ్స్ తాడులకు తగిలించుకుని.. గార్డెన్ ఏరియాలో ఉన్న మార్క్‌లో పెట్టాల్సి ఉంది. అయితే వీరి గేమ్ తర్వాత సుమన్ శెట్టి గీమ్ గెలిచింది. గెలిచిన వారు ఓడిన వారిని నామినేట్ చేసే సౌలభ్యం దొరికింది.
దీనిలో భాగంగా సుమన్ శెట్టి రీతూ చౌదరిని నామినేట్ చేశాడు. రాము సంజనను నామినేట్ చేశాడు. అయితే ఈ ఆర్గ్యూమెంట్‌లో ఎక్కడి నుంచి వచ్చావో కానీ.. ఓపిక నేర్చుకుని రా అంటూ రాముపై సీరియస్ అయింది. దీనిని రాము డిఫెండ్ చేస్తూ కించపరిచేలా మాట్లాడొద్దు అంటూ రిప్లై ఇచ్చాడు. సుమన్ శెట్టి కూడా రామును సపోర్ట్ చేశాడు. భరణి ఫ్లోరాను నామినేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వీరు కాకుండా శ్రీజ, కొత్తగా ఇంట్లోకి వచ్చిన దివ్య నిఖిత, మాస్క్ మ్యాన్ హరీశ్ కూడా ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు.




















