Bigg Boss Telugu 9 Day 1 Promo : బిగ్‌బాస్ 9 డే 1 మొదటి ప్రోమో.. హరీశ్- మనీష్ మధ్య ఆర్గ్యూమెంట్, ఇంట్లోంచి వెళ్లిపోతానన్న కంటెస్టెంట్
Bigg Boss Telugu 9 Day 1 : బిగ్‌బాస్ సీజన్ 9 మొదలైపోయింది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. మొదటిరోజు దేని గురించి గొడవపడ్డారో తెలుసా?

Bigg Boss Telugu 9 Day 1 Promo 1 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా లాంఛ్ అయింది. మునుపెన్నడు లేని విధంగా కామనర్స్, సెలబ్రెటీలను బిగ్‌బాస్ హౌజ్‌లోకి పంపారు. లోపలికి వెళ్లిన కంటెస్టెంట్లకు ఒకరికొకరు అర్థం చేసుకునే టైమ్ కూడా ఇవ్వకుండానే.. వారి మధ్య గొడవ పెట్టేశాడు బిగ్‌బాస్. ఈ సీజన్‌కి సంబంధించిన మొదటి ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. మరి మొదటి ప్రోమోలో ఇంట్రెస్టెంగ్గా దేనిని హైలెట్ చేశారో ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ ప్రేక్షకులకు శనివారం, ఆదివారం కంటే సోమవారం మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈరోజు నామినేషన్స్, హీటెడ్ ఆర్గ్యూమెంట్స్ జరుగుతాయి కాబట్టి. అయితే మరీ మొదటివారం నుంచే గొడవపడేంత మ్యాటర్ ఏమి ఉంటుందని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే తాజాగా బిగ్‌బాస్ సీజన్ 9కి సంబంధించిన మొదటి ప్రోమో విడుదల చేశారు. దానిలో నామినేషన్స్ గురించి లేదు కానీ.. ఆర్గ్యూమెంట్ ఉంది. ఇంతకీ ప్రోమో ఎలా సాగిందంటే..
చిరంజీవి సాంగ్‌తో..
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలోని లాహే లాహే లాహే సాంగ్‌తో మొదటిరోజు ప్రారంభించారు. కంటెస్టెంట్లు (కామనర్స్, సెలబ్రెటీలు) కూడా అందరూ డ్యాన్స్ చేశారు. వారిని మరింత ఎనర్జిటిక్‌గా మార్చేందుకు డ్యాన్సర్స్‌ను కూడా లోపలికి పంపించాడు బిగ్‌బాస్. అనంతరం అందరూ హాల్ కూర్చొని ఉండగా.. బిగ్‌బాస్ అందరికీ స్వాగతం చెప్తుండగా ప్రోమో మొదలైంది. ఫస్ట్ టైమ్ బిగ్‌బాస్ రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో చెమటలు పట్టాయంటూ ఇమ్మాన్యూయేల్ కామెడీ స్టార్ట్ చేసేశాడు.
ఇంటి పనులు తెచ్చిన తంటా
బిగ్‌బాస్ 9 లాంచ్‌లో భాగంగా నాగార్జున ఇచ్చిన టాస్క్‌లో భాగంగా హోజ్లో డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇంట్లో ఏ పని ఎవరు చేయాలనే దాని గురించి ఈ ప్రోమో సాగింది. దీనిలో భాగంగా కామనర్స్, సెలబ్రెటీలకు పనులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మాకేమి పనులు ఇస్తున్నారో.. తర్వాత ఇవి వారికి వచ్చినప్పుడు వారు కూడా వీటిని చేయాల్సి ఉంటుందని ఇమ్మాన్యుయేల్ తెలిపాడు.
హరీశ్ - మనీష్ ఆర్గ్యూమెంట్
కామనర్స్, సెలబ్రెటీల మధ్య జరగాల్సిన గొడవ.. కామనర్స్ మధ్యే జరిగినట్లు కనిపిస్తుంది. వీళ్లలో వీరికి కోఆర్డినేషన్ లేదనేది క్లియర్‌గా ఉంది. ఈ పనులు పంచే నేపథ్యంలోనే హరీశ్, మనీష్ మధ్య గొడవ మొదలైంది. దీనిని ఆపేందుకు భరణి ప్రయత్నించగా.. ఎవరూ తగ్గలేదు. సంజన ఖాళీగా ఉన్నారు కాబట్టి క్లీనింగ్ చేస్తే బాగుంటుందని హరీశ్ చెప్పగా దానిని మనీష్ ఒప్పుకోలేదు. మీకు బ్యాడ్జ్ రాలేదు మీరు మాట్లాడకండి అంటూ హరీశ్ గట్టిగా రిప్లై ఇచ్చాడు. ఏమైనా వస్తే నేను తీసుకుంటా.. ఇంట్లోనుంచి వెళ్లిపోవడానికి కూడా రెడీ అంటూ మొదటిరోజే స్టేట్మెంట్ ఇచ్చేశాడు హరీశ్. దీంతో ప్రోమో ముగిసింది.






















