అన్వేషించండి

Bigg Boss 7 Telugu: రంగులు మారుస్తున్న శివాజీ, అమర్‌ ఎమోషన్స్‌తో ఆటలు - ఇప్పుడు ఆ కంటెస్టెంటే నెంబర్ వన్

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో జరిగిన చివరి కెప్టెన్సీ టాస్క్ ద్వారా శివాజీ, అర్జున్ రంగులు బయటపడ్డాయి. దీంతో అమర్‌దీప్ పూర్తిగా నష్టపోయాడు.

Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో చివరి కెప్టెన్సీ టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగింది. కంటెస్టెంట్స్ సపోర్ట్‌తోనే కెప్టెన్ అవ్వగలరు అని తెలిసిన తర్వాత అమర్‌దీప్ వెళ్లి ప్రతీ కంటెస్టెంట్‌ను ప్రత్యేకంగా తనకు సపోర్ట్ చేయమని అడిగాడు. సీజన్ మొదటినుంచి ఎంత కష్టపడినా.. ఎన్నోసార్లు చివరి వరకు వెళ్లి కెప్టెన్ అవ్వకుండా ఓడిపోయాడు అమర్. దీంతో కంటెస్టెంట్స్ అంతా తనకు సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతోనే ఉన్నారు. సపోర్ట్ చేస్తానని మాటిచ్చారు కూడా. కానీ అంతలోనే శివాజీ, అర్జున్‌తో కలిసి మాట మార్చాడు. ఆటలో అవసరం లేని ఫ్యామిలీ విషయాలను మధ్యలోకి తీసుకొచ్చి సింపతీ సంపాదించాలని అనుకున్నాడు అర్జున్. శివాజీ కూడా అర్జున్‌కు సపోర్ట్ చేయడంతో కెప్టెన్సీ అమర్ నుంచి చేజారిపోయింది.

మాట మార్చాడు..
గతవారం ప్రియాంక, అమర్‌దీప్‌లు కెప్టెన్సీ కోసం తలపడ్డారు. ఇద్దరు కెప్టెన్స్ అవ్వడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. కానీ అప్పుడు ప్రియాంకకు ఎక్కువ సపోర్ట్ లభించడంతో తను కెప్టెన్ అయ్యింది. అప్పుడు అమర్ ఏడుపు చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంక కెప్టెన్ అవ్వలేనేమో అని భయమేస్తుందని, కెప్టెన్ అయినట్టు కల వచ్చిందని చాలాసేపు బాధపడ్డాడు. దీంతో అమర్ ఏడుపు చూసి వచ్చేవారం అయినా కెప్టెన్సీ టాస్క్‌లో తనకు సపోర్ట్ చేయాలని చాలామంది నిర్ణయించుకున్నారు. కెప్టెన్సీ టాస్క్ మొదలయిన చాలాసేపటి వరకు కూడా తమ సపోర్ట్ అమర్‌దీప్‌కే అని నమ్మించిన శివాజీ.. ఒక్కసారిగా మాట మార్చాడు. దీంతో శివాజీపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ మొదలయ్యింది.

మాట కోసం చచ్చిపోతా..
తానేం చేసినా ఎప్పుడూ కరెక్ట్‌గానే ఉంటుంది అనుకునే శివాజీ.. చివరి కెప్టెన్సీ విషయంలో అమర్‌దీప్‌కు అన్యాయం చేశాడని చాలామంది ఫీలవుతున్నారు. కెప్టెన్సీ టాస్క్ మొదలయిన తర్వాత అమర్‌దీప్ వచ్చి ‘‘నన్ను కాల్చకండి. గత మూడు వారాల నుంచి ఎంత కష్టపడుతున్నానో చూస్తున్నారు కదా’’ అని శివాజీ, యావర్, ప్రశాంత్‌లను అడిగాడు. ‘‘అందరు కెప్టెన్స్ అయ్యారు. నేనొక్కడినే అవ్వలేదు. ఇదే నాకు చివరి అవకాశం. రిక్వెస్ట్ చేసుకుంటున్నాను’’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అమర్ అక్కడి నుంచి వెళ్లగానే ‘‘లాస్ట్ టైమ్ కూడా వాడు నాకు సపోర్ట్ చేశాడు’’ అని శివాజీ గుర్తుచేసుకున్నాడు. అమర్‌ను పిలిచి ‘‘మాటిచ్చాను కదా. మాట కోసం చచ్చిపోతా’’ అని అన్నాడు. దీంతో శోభా.. శివాజీ గురించి అడిగినప్పుడు కూడా అన్న నాకు మాటిచ్చాడు అని ధైర్యంగా చెప్పాడు అమర్‌దీప్. కానీ టాస్క్ దగ్గరకు వచ్చేసరికి శివాజీ పూర్తిగా మాట మార్చేశాడు. అర్జున్ భార్య వచ్చి తనను అడిగిందని.. అర్జున్‌కే తన సపోర్ట్ అని అన్నాడు. శివాజీలాగానే గౌతమ్, యావర్‌లు కూడా అర్జున్‌కే సపోర్ట్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amardeep G (@amardeep_chowdary)

అసలు రంగు బయటపడింది..
తన భార్య ప్రెగ్నెంట్ కాబట్టి రెండోసారి తనను కెప్టెన్ అవ్వమని అడిగిందని ఇది తన భార్య కోరిక అని అందరితో చెప్పడం మొదలుపెట్టాడు అర్జున్. దీంతో అర్జున్ సింపతీ గేమ్‌కు అందరు లాక్ అయిపోయారు. అర్జున్ భార్య తనకు కూతురులాంటిదని, తనకోసం అర్జున్‌ను కెప్టెన్ చేయాలని అనుకుంటున్నానని శివాజీ చెప్పగానే.. అమర్ వచ్చి తేజూను కూడా కూతురులాంటిదే అని అన్నారు కదా అని గుర్తుచేశాడు. నా భార్య కూడా నన్ను అడిగింది అని బాధపడ్డాడు. అర్జున్ దగ్గరకు వెళ్లి కూడా చాలాసేపు ప్రాధేయపడ్డాడు అమర్‌దీప్. కానీ తన బాధను చూసి కూడా శివాజీ, అర్జున్‌లో కొంచెం కూడా జాలికలగలేదు. కానీ ప్రేక్షకుల్లో మాత్రం అమర్‌దీప్‌పై జాలి ఏర్పడింది. ఇప్పటికే అర్జున్.. ఒకసారి కెప్టెన్ అయ్యాడు కాబట్టి అమర్‌కు ఛాన్స్ ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు. ఇప్పటికే అర్జున్.. డేంజర్ జోన్‌లో ఉన్నాడని టాక్ వినిపిస్తుండగా.. కెప్టెన్సీ టాస్క్‌లో తన ప్రవర్తనతో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పెరిగిపోయాయి. ఇక సీజన్ మొదటి నుంచి ఓటింగ్ విషయంలో టాప్ స్థానంలో ఉన్న శివాజీ.. తన అసలు రంగును బయటపెట్టడంతో ఓటింగ్‌ను కోల్పోతున్నాడు. దీంతో ఓటింగ్‌లో అమర్ టాప్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే పల్లవి ప్రసాద్‌కు కూడా పాజిటివ్ ఓట్లు వస్తున్నాయి. మున్ముందు కూడా శివాజీ ఇలాగే ఉంటే గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉంది.

Also Read: ‘బిగ్ బాస్’ హిందీలో తెలుగు - మన భాషలో ఛాలెంజ్ చేసుకున్న కంటెస్టెంట్స్, వీడియో వైరల్

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
Gautam Adani: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం, అసలేం జరిగింది - ఎవరి వర్షన్ ఎలా ఉందంటే!
తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం, అసలేం జరిగింది - ఎవరి వర్షన్ ఎలా ఉందంటే!
Pushpa 2: టార్గెట్ రాజమౌళి, ప్రశాంత్ నీల్... యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగదీసిన సుకుమార్ - జాతరకు పూనకాలే
టార్గెట్ రాజమౌళి, ప్రశాంత్ నీల్... యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగదీసిన సుకుమార్ - జాతరకు పూనకాలే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్అర్జున్ టెండూల్కర్‌ని కొనుక్కున్న ముంబయి ఇండియన్స్13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
Gautam Adani: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం, అసలేం జరిగింది - ఎవరి వర్షన్ ఎలా ఉందంటే!
తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం, అసలేం జరిగింది - ఎవరి వర్షన్ ఎలా ఉందంటే!
Pushpa 2: టార్గెట్ రాజమౌళి, ప్రశాంత్ నీల్... యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగదీసిన సుకుమార్ - జాతరకు పూనకాలే
టార్గెట్ రాజమౌళి, ప్రశాంత్ నీల్... యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగదీసిన సుకుమార్ - జాతరకు పూనకాలే
AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
Aadhaar Card Update: ఆధార్‌ను 'ఫ్రీ'గా అప్‌డేట్‌ చేసేందుకు మరింత సమయం - ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్‌ చేయాలి?
ఆధార్‌ను 'ఫ్రీ'గా అప్‌డేట్‌ చేసేందుకు మరింత సమయం - ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్‌ చేయాలి?
Best Scooters Under Rs 80000: రూ.80 వేలలోపు బెస్ట్ స్కూటీలు ఇవే - హోండా, హీరో, టీవీఎస్, ఎలక్ట్రిక్ కూడా!
రూ.80 వేలలోపు బెస్ట్ స్కూటీలు ఇవే - హోండా, హీరో, టీవీఎస్, ఎలక్ట్రిక్ కూడా!
Food Poisoning: తెలంగాణలో మరో స్కూల్లో ఫుడ్ పాయిజన్, 21 మంది విద్యార్థులకు అస్వస్థత
తెలంగాణలో మరో స్కూల్లో ఫుడ్ పాయిజన్, 21 మంది విద్యార్థులకు అస్వస్థత
Embed widget