అన్వేషించండి

Telugu in Bigg Boss Hindi 17: ‘బిగ్ బాస్’ హిందీలో తెలుగు - మన భాషలో ఛాలెంజ్ చేసుకున్న కంటెస్టెంట్స్, వీడియో వైరల్

Bigg Boss 17: బిగ్ బాస్ హిందీ సీజన్ 17లో తాజాగా తెలుగు మాటలు వినిపించాయి. ఇద్దరు కంటెస్టెంట్స్ తెలుగులో ఛాలెంజ్ చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Telugu in Bigg Boss 17 Hindi Show : ఇతర భాషల్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో తెలుగు భాష వింటే ఆ కిక్కే వేరు. ఇటీవల హిందీ బిగ్ బాస్‌లో కూడా అదే జరిగింది. అక్కడ కంటెస్టెంట్స్ తెలుగులో మాట్లాడిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ సీజన్ 17 ప్రసారమవుతోంది. ఇప్పటికే అందులో జరిగిన కాంట్రవర్సీల వల్ల సీజన్ 17 ఫేమస్ అయిపోయింది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 17 హిందీలో కంటెస్టెంట్స్ అయిన మన్నారా చోప్రా, అరుణ్ శ్రీకాంత్ మాషెట్టి.. టాస్క్‌లో భాగంగా తెలుగులో ఛాలెంజ్ చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చేద్దాం.. అన్నీ చేద్దాం..
ఇటీవల బిగ్ బాస్ సీజన్ 17లో జరిగిన నామినేషన్స్‌లో అరుణ్ శ్రీకాంత్‌ను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పింది మన్నారా. అయితే మన్నారా చెప్పిన కారణాలు విన్న తర్వాత ‘‘చేద్దాం చేద్దాం అన్నీ చేద్దాం’’ అంటూ తెలుగులో రిప్లై ఇచ్చాడు అరుణ్ శ్రీకాంత్. అది విన్న మన్నారా నాకు కూడా తెలుగు వచ్చు అన్నట్టుగా ‘‘నాకు నువ్వు ఛాలెంజ్ చేసి’’ అని సమాధానమిచ్చింది. ఇది విన్న బిగ్ బాస్.. ‘‘బిగ్ బాస తెలుగు షోకు మీకు స్వాగతం’’ అని హిందీలో కౌంటర్ ఇచ్చాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. హిందీ బిగ్ బాస్‌లో తెలుగులో మాట్లాడిన వీరిద్దరు ఎవరు అని ప్రేక్షకులు సెర్చింగ్ మొదలుపెట్టారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mannara❤️ (@memannara)

బిగ్ బాస్ హిందీలో హైదరాబాద్ అబ్బాయి..
అరుణ్ శ్రీకాంత్ ఒక హైదారబాద్‌లోని ఛార్మినార్‌ ఏరియాకు చెందినవాడని బయటపడింది. అందుకే హిందీ బిగ్ బాస్‌లో తన హైదరబాదీ టచ్‌తో అందరినీ అలరిస్తున్నాడని ఆడియన్స్ చెప్తున్నారు. తనకంటూ ఉన్న ఒక ప్రత్యేకమైన స్టైల్‌తో చాలామంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు అరుణ్ శ్రీకాంత్. ఒక హైదరాబాద్ అబ్బాయి.. హిందీ బిగ్ బాస్ షోలో ఉన్నాడు కాబట్టి త్వరలో ఇలాంటి మరెన్నో తెలుగు డైలాగులు ఆ హౌజ్‌లో వినిపించే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మన తెలుగబ్బాయి అనే అభిమానంతో హిందీ బిగ్ బాస్‌ను ఫాలో అవుతున్న తెలుగు ప్రేక్షకులు సైతం అరుణ్ శ్రీకాంత్‌ను సపోర్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు.

అన్ని సినిమాలు ఫ్లాప్..
మన్నారా చోప్రా విషయానికొస్తే.. ఇప్పటికే తను హీరోయిన్‌గా పలు తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ నుండి తను కూడా నటిగా సెటిల్ అవ్వాలని కలలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మన్నారా. హిందీతో పాటు తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది. ‘తిక్క’, ‘రోగ్’, ‘జక్కన్న’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. కానీ తను తెలుగులో నటించిన ఒక్క సినిమా కూడా కనీసం హిట్ కాదు కదా.. యావరేజ్‌గా కూడా నిలవలేదు. దీంతో తనకు ఇక్కడ ఆఫర్లు తగ్గిపోయాయి. అయితే, ఇటీవల ఓ తెలుగు సినిమా ప్రమోషన్‌లో దర్శకుడు ముద్దుతో బాగా పాపులారిటీ సంపాదించింది. అదే సమయంలో హిందీ బిగ్ బాస్‌లో వచ్చిన ఆఫర్‌ను యాక్సెప్ట్ చేసి మరోసారి బాలీవుడ్‌లో బిజీగా అవ్వాలని ప్లాన్ చేసుకుంది. బిగ్ బాస్ హౌజ్‌లో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, ముద్దు ముద్దు మాటలతో యూత్‌ను ఫిదా చేస్తోంది. టాస్కుల్లో యాక్టివ్‌గా ఉంటూ ఎక్కువరోజులు హౌజ్‌లో ఉండే ప్రయత్నం చేస్తోంది.

Also Read: బిగ్ బాస్ 7లో చివరి కెప్టెన్సీ టాస్క్‌లో ఊహించని ట్విస్ట్! అమర్‌దీప్ కెప్టెన్ అయినట్టేనా?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Embed widget