అన్వేషించండి
Advertisement
Bigg Boss Telugu 5 Promo : హౌస్ మేట్స్ కి నిద్ర లేకుండా చేసిన లోబో.. అప్పుడే దొంగతనం మొదలెట్టిన సిరి
బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం నాడు అంగరంగ వైభవంగా మొదలైన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ సీజన్ 5(Bigg Boss Telugu 5) ఆదివారం నాడు అంగరంగ వైభవంగా మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని తెలిసిన ముఖాలు ఉన్నాయి. ఇక తెలియని వాళ్లు ఎలాగో రెండు, మూడు వారాల్లో పాపులర్ అయిపోతారనుకోండి. అయితే ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ రంగంలోకి దిగిపోయాడు. నిన్ననే హౌస్ లోకి పంపిన కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెడుతూ తొలివారం ఎలిమినేషన్స్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు.
దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కాసేపటి క్రితం మరో ప్రోమోను విడుదల చేశారు. ఇది చాలా ఫన్నీగా ఉంది. కంటెస్టెంట్ లోబో పెట్టిన గురకకు హౌస్ మేట్స్ అంతా లేచి కూర్చున్నారు. ''ముక్కులో ఏదైనా దూది పెట్టండి'' అంటూ రవి(Anchor Ravi) ఫన్నీగా అనగానే హౌస్ మేట్స్ అంతా నవ్వేశారు. రవి స్వయంగా వెళ్లి నేలపై పడుకొని ఉన్న లోబోపై దిండు, దుప్పటి కప్పేశాడు. అయినా గురక సౌండ్ మాత్రం ఆగదు.
ఇక మరో కంటెస్టెంట్ సిరి.. జెస్సీతో కలిసి అర్ధరాత్రి దొంగతనానికి బయలుదేరింది. మరో కంటెస్టెంట్ హమీదకి సంబంధించిన లెన్స్, ఇయర్ రింగ్స్ దాచేసి పూలకుండీలో పెట్టింది. ఈ పనికి 'జైల్లో మాత్రం పెట్టకండి బిగ్ బాస్' అంటూ రిక్వెస్ట్ చేశాడు జెస్సీ. తెల్లవారుజామున తన లెన్స్ కోసం వెతుక్కోవడం మొదలెట్టిన హమీదను చూసి ఏమీ తెలియదన్నట్లుగా ప్రవర్తించింది సిరి. ఈ ప్రోమోను విడుదల చేస్తూ.. 'ఇంటి దొంగలని ఎవరైనా కనిపెడతారో లేదో చూడాలి' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Also Read : Bigg Boss 5 Telugu Memes: ‘బిగ్ బాస్ 5’ ట్రోలింగ్ మొదలు.. ఎవరు సార్ వీరంతా? సెలబ్రిటీలు ఎక్కడా?
Also Read: బిగ్ బాస్ 5లో నామినేషన్ల రచ్చ.. షణ్ముఖ్‌ను టార్గెట్ చేసిన సన్నీ, రవితో నటరాజ్ మాస్టర్ ఫైట్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion