By: ABP Desam | Updated at : 06 Sep 2021 03:59 PM (IST)
Image Source: Social Media
‘బిగ్ బాస్ 5’ మొదలైంది. 19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరయ్యారు. అయితే, ఇందులో కొంతమంది మన తెలుగు ప్రేక్షకులకు కనీస పరిచయం లేదు. వాళ్లు స్టేజ్ మీదకు వస్తుంటే.. ఎవరు వీళ్లు అనేలా ప్రేక్షకులు క్వశ్చన్ మార్క్ వేసుకుని చూశారు. హమీద, శ్వేత వర్మ, జెస్సీలను చూసి ఎవరు వీరు అనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లు కూడా అడపదడపా రియాల్టీ షోల్లో అలా కనిపించి.. ఇలా మాయమయ్యేవాళ్లే. వీరిలో కొంతమంది ‘బిగ్ బాస్’ షోకు వీరు అవసరమా? సరిపోతారా అనే ప్రశ్నలు కూడా ప్రేక్షకుల మదిలో మెదిలాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ‘‘ఎవరు సార్ వీరంతా? సెలబ్రిటీలేనా’’ అని ప్రశ్నిస్తున్నారు.
‘‘ఒకప్పుడు సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చేవారు. ఇప్పుడు కంటెస్టెంట్లు సెలబ్రిటీలుగా మారేందుకు వస్తున్నారు’’ అనే మీమ్ ఇప్పుడు వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఏది ఏమైనా.. బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఎంపిక చేసే విషయంలో మరింత ప్రయత్నం చేసి ఉండే బాగుండేదేమో అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగి చూసేందుకే బిగ్ బాస్ చూస్తామని, ఇలా తెలియని వ్యక్తులను తీసుకొస్తే ఎలా అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, బిగ్ బాస్ మొదట్లో చాలామందికి ఇదే అభిప్రాయం కలుగుతుంది. క్రమేనా.. ప్రజల్లో అభిప్రాయం మారుతుంది. హౌస్‌లో ఉండే కంటెస్టెంట్ల వ్యక్తిత్వాన్ని ఇష్టపడటం మొదలుపెడతారు. వారికి నచ్చితే విజేతలను కూడా చేస్తారు.
గత సీజన్లలో పోల్చితే.. ఇందులో ఆకట్టుకొనే సెలబ్రిటీలు లేరనే చెప్పాలి. గత సీజన్లలో తనీష్, వరుణ్ సందేశ్, అభి వంటి కనుమరుగైన యువ హీరోలు కనిపించారు. అయితే, వారు క్రమేనా ప్రేక్షకులకు అలవాటైపోయారు. ఒకప్పుడు హీరోగా పరిచయమ్యారు కాబట్టి.. అభిమానులు కూడా పెరిగారు. అయితే, ‘బిగ్ బాస్-5’లో కనీసం అలాంటి హీరోలు ఎవరూ లేకపోవడం పెద్ద లోటే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఫేమస్ ఫిమేల్ యాంకర్లు కూడా ఎవరూ లేకపోవడం కూడా వెలితిగానే కనిపిస్తోంది. ఒకవేళ యాంకర్ వర్షిణీ ఈ హౌస్‌లోకి వచ్చి ఉంటే తెలిసిన వ్యక్తి ఉందనే అభిప్రాయం కలిగేది.
Also Read: బిగ్ బాస్ 5లో నామినేషన్ల రచ్చ.. షణ్ముఖ్‌ను టార్గెట్ చేసిన సన్నీ, రవితో నటరాజ్ మాస్టర్ ఫైట్
ప్రస్తుతం ఈ 19లో ప్రజలకు కాస్త తెలిసిన సెలబ్రిటీలు షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి మాత్రమే. షన్ను తన టాలెంట్‌తో యూత్‌ను ఆకట్టుకున్నాడు. గత బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునయన బాయ్ ఫ్రెండ్ కూడా కావడంతో మంచి ఫాలోయింగే ఉంది. సీరియల్ నటుడు మానస్‌కు, ప్రియా, ఉమాలకు ఎలాగో మహిళల ఫాలోయింగ్ ఉంటుంది. కొరియోగ్రాఫర్ యాని మాస్టర్ కూడా బుల్లితెర వీక్షకులకు సుపరిచితమే. కాబట్టి.. ఆమె కూడా కొన్నాళ్లు హౌస్‌లో రాణించే అవకాశం ఉంది. అయితే, ఇది బిగ్ బాస్.. ఏమైనా జరగవచ్చు. షో మధ్యలో తప్పకుండా మంచి సెలబ్రిటీని రంగంలోకి దించి సర్‌ప్రైజ్ చేయొచ్చు. అప్పటివరకు వేచి చూద్దాం. అప్పటి వరకు ఈ కింది ట్రోల్స్, మీమ్స్ చూసి ఎంజాయ్ చేయండి.
NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్
Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్
Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి
Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి
Someshwara Temple: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే
Minister KTR UK Tour : పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ యూకే టూర్, కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు