అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu : షణ్ముఖ్ తో పోటీ కష్టమే.. టైటిల్ రేసులో పక్కా..
తెలుగులో బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి మొదలైన ఈ షోకి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
తెలుగులో బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి మొదలైన ఈ షోకి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ లో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 19 మంది కంటెస్టెంట్ లతో షోను మొదలుపెట్టారు. అందులో కొందరు పేరున్న వాళ్లు ఉన్నారు. అప్పుడే వీరిలోనుంచి ఫైనల్స్ కు వెళ్లే అవకాశాలున్న వారి గురించి చర్చలు మొదలయ్యాయి.
'బిగ్ బాస్' ట్రోఫీ అందుకోవాలంటే సోషల్ మీడియాలో ఫాలోయింగ్, సపోర్ట్ చాలా ముఖ్యం. ఈ విషయంలో షణ్ముఖ్ జస్వంత్ అందరికంటే ముందు రేసులో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. యూట్యూబ్ లో షణ్ముఖ్ కి క్రేజ్ బాగా పెరిగింది. అతడికి మద్దతు ఇచ్చేవారు బాగానే ఉంటారు. 'సాఫ్ట్ వేర్ డెవలపర్', 'సూర్య' లాంటి సిరీస్ లతో షణ్ముఖ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
Also Read: బిగ్ బాస్ 5లో నామినేషన్ల రచ్చ.. షణ్ముఖ్ను టార్గెట్ చేసిన సన్నీ, రవితో నటరాజ్ మాస్టర్ ఫైట్
షణ్ముఖ్ నటించే సిరీస్ లకు యూట్యూబ్ లో మిళియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. అతడు ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ చేస్తుంటే.. యూత్ ఎగబడి చూశారు. షణ్ముఖ్ యూట్యూబ్ ఛానెల్ కి భారీగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వాళ్లంతా కూడా షణ్ముఖ్ అభిమానులే. వారంతా షణ్ముఖ్ ని ముద్దుగా షన్ను అని పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ యంగ్ యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వడంతో అతడి ఫాలోవర్లు కూడా ఈ షోని తప్పకుండా చూస్తారు.
షణ్ముఖ ఎప్పుడు ఎలిమినేషన్ లోకి వచ్చినా సరే అతడికి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. టైటిల్ రేసులో అతడు ఉండడం ఖాయమని సోషల్ మీడియా టాక్. షోలో అతడు ఏదైనా తప్పు చేస్తే తప్ప అతడు ఫైనల్ రేసులో ఉండే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. కాబట్టి షణ్ముఖ్ తో పోటీ అంత ఈజీ కాదనిపిస్తుంది.
Also Read : Bigg Boss 5 Telugu Memes: ‘బిగ్ బాస్ 5’ ట్రోలింగ్ మొదలు.. ఎవరు సార్ వీరంతా? సెలబ్రిటీలు ఎక్కడా?
ఇక తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే విషయంపై షణ్ముఖ్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. తనకి అందరి సపోర్ట్ కావాలని కోరాడు. తను ఈ స్థాయికి రావడానికి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదని.. అది చూసి తన మీద ట్రోల్స్ కానీ ఫేక్ న్యూస్ గానీ వేయమని కోరాడు. ఎక్కువగా జడ్జ్ చేయకుండా నార్మల్‌గా చూస్తారని అనుకుంటున్నాను అంటూ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion