అన్వేషించండి

Bigg Boss 8: అర్థరాత్రి నిద్ర లేపి నిఖిల్‌కు బిగ్ బాస్ వార్నింగ్, పైన హౌజ్ మేట్స్ అక్షింతలు... భారీ మూల్యం చెల్లించిన కెరటం టీం

Bigg Boss 8 Episode 12 Review: ఎపిసోడ్ 12లో హౌజ్ మేట్స్ ను అర్థరాత్రి నిద్రలేపి మరీ మొట్టికాయలు వేశారు బిగ్ బాస్. నిఖిల్ క్లాన్ కు పనిష్మెంట్ ఇచ్చారు. ఆ పనిష్మెంట్ ఏంటి? ఎందుకు అక్షింతలు పడ్డాయి? అంటే

బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 12 నిన్న రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది. ముందుగానే బిగ్ బాస్ మూడు ప్రోమోలతో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనే ఆసక్తిని పెంచేసిన విషయం తెలిసిందే. అయితే ప్రోమోలో చూపించని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా హౌస్ లో చోటు చేసుకున్నాయి. అందులో అర్ధరాత్రి నిద్ర లేపి నిఖిల్ క్లాన్ కు వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్. అలాగే హౌస్ మేట్స్ కు కూడా గట్టిగానే అక్షింతలు వేశారు. అంతే కాదు కెరటం టీం తాము చేసిన తప్పుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. అసలు నిఖిల్ క్లాన్ చేసిన తప్పేంటి? నిఖిల్ తో పాటు హౌస్ మేట్స్ కి ఎందుకు బిగ్ బాస్ నుంచి మొట్టికాయలు పడ్డాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రూల్స్ బ్రేక్ చేసిన నిఖిల్ క్లాన్ 
నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా నిఖిల్ క్లాన్ ఓడిపోవడంతో, వాళ్లకు రేషన్ కట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ హౌస్ మేట్స్ లో అందరూ ఒకరికి పెట్టకుండా తినడం ఏంటి అనే బాధతో ఎమోషనల్ అయ్యి బిగ్ బాస్ రూల్స్ ను పట్టించుకోవడం మానేశారు. అందులో భాగంగానే ఈ రోజు ఎపిసోడ్ లో నిఖిల్ క్లాన్ దోశలు వేసుకుంటుంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. మణికంఠ తనతో పాటు నిఖిల్ కు కూడా తినిపించాడు. ఇదంతా చూసిన విష్ణు ప్రియ, నబిల్ కూడా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా మణికంఠ తాను సైలెంట్ గా చీకటిగా ఉన్న బెడ్ రూమ్ లో కూర్చుని తినడమే కాకుండా, అక్కడికొచ్చిన నిఖిల్ కు కూడా తినమని చెప్పాడు. ఇంకేముంది ఇలా రూల్స్ బ్రేక్ చేసినందుకు ఫలితంగా నిఖిల్ క్లాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చింది. 

Read Also: Citadel Diana OTT Release Date: ఓటీటీలోకి ఫ్యూచరిస్టిక్ స్పై థ్రిల్లర్ 'సిటాడెల్ డయానా' - ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతోందంటే?

నిఖిల్ క్లాన్ పడ్డ కష్టమంతా వృథానే !
ఇక ఈ తతంగం అంతా జరిగేలోపు దాదాపు 3 టాస్కులు కంప్లీట్ అయ్యాయి. అందులో ఒక 50,000 టాస్క్, 70,000  టాస్క్ లలో నిఖిల్ టీం విన్ అయింది. ఇప్పుడు హౌస్ లో రూల్స్ బ్రేక్ చేసినందుకుగాను నిఖిల్ టీంకి ఇచ్చిన రెండు అవకాశాలతో పాటు రేషన్ ను కూడా క్యాన్సిల్ చేశారు బిగ్ బాస్. అంతేకాదు ఇలా ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తుంటే చూస్తూ కూర్చునే హౌస్ మేట్స్ పై కూడా కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు బిగ్ బాస్. అర్ధరాత్రి నిద్ర లేపి మరీ ఇలాంటి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో హౌస్ మేట్స్ అంతా అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత ఎవరికి వారు తమకు సంబంధించిన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవడం, జాలితో ఇతరులకు ఇవ్వకుండా ఉండడం వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకానొక టైమ్ లో నాగ మణికంఠ వచ్చి ఆకలిగా ఉంది అని అడిగినా యశ్మి గౌడ టీం అస్సలు పట్టించుకోలేదు. చేసేది లేక అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయాడు మణికంఠ. 

Also Readఆర్జీవీ 'దిశా ఎన్కౌంటర్' హీరోయిన్, కరీంనగర్ రైతు బిడ్డ... 'బిగ్ బాస్ 8' కంటెస్టెంట్ సోనియా ఆకుల బ్యాగ్రౌండ్ తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Tiger Attack Komaram Bheem Asifabad District News: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Embed widget