BIGG BOSS Season 9 Contestants: న్యూ రూల్స్... న్యూ కంటెస్టెంట్స్ - బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ నాగార్జున కీ డెసిషన్
BIGG BOSS 9 Season: బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ విషయంలో కింగ్ నాగార్జున ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ట్రోలింగ్స్, విమర్శలు రాకుండా ప్లాన్ చేస్తున్నారు.

Nagarjuna New Rules For BIGG BOSS Season 9 Contestants: ఫేమస్ టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్ సీజన్ 9' అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ అందరిలోనూ హైప్ క్రియేట్ అవుతోంది. ప్రతీ సీజన్‌లోనూ సెలబ్రిటీలు మాత్రమే పార్టిసిపేట్ చేస్తుండగా... ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి సామాన్యులు సైతం ఎంట్రీ ఇచ్చేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు.
న్యూ రూల్స్
కింగ్ నాగార్జున తన కెరీర్‌లో ఆరోసారి 'బిగ్ బాస్' హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసారి రణరంగమే అంటూ మొదటి నుంచి ఆయన హైప్ క్రియేట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ ఎంపికపై ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలుస్తోంది. గత సీజన్లలో వచ్చిన విమర్శలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని... వాటికి చెక్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఫేమస్ సెలబ్రిటీలకు 8వ సీజన్‌లో ఛాన్స్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. చాలామంది చిన్న యాక్టర్స్, యూట్యూబర్స్ ఈ షోలో పార్టిసిపేట్ చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారట. అయితే, సెలబ్రిటీలను మాత్రమే ఎక్కువగా హౌస్‌లోకి తీసుకువచ్చేలా దృష్టి పెట్టాలని నాగార్జున మేకర్స్‌కు సూచించారట. ఈసారి లిస్ట్ ఫైనల్ చేసేటప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఓసారి చెక్ చేస్తారని తెలుస్తోంది. గతంలో వచ్చిన ట్రోలింగ్స్ మళ్లీ రాకుండా పక్కాగా వ్యవహరిస్తున్నారని సమాచారం. సెప్టెంబర్ 7న షో ప్రారంభం కానుంది.
Also Read: 'SSMB29'పై బిగ్ అప్డేట్ - రెడీ ఫర్ నెక్స్ట్ షెడ్యూల్... లొకేషన్ మార్చిన రాజమౌళి
కంటెస్టెంట్స్ వీళ్లేనా?
ఈ సీజన్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్త సీజన్‌లో పార్టిసిపెంట్స్ వీళ్లే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేం రమ్య పేరు బాగా వినిపిస్తోంది. అలాగే రీతూ చౌదరి, సుమంత్ అశ్విన్, జ్యోతి రాయ్, కల్పికా గణేష్, తేజస్విని గౌడ, ఆరే రాజ్, శ్రావణి వర్మ, దీపికా, సాయికిరణ్, దెబ్జానీ ఇంకొందరు ప్రముఖులు పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టిసిపెంట్స్ లిస్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
న్యూ గేమ్స్
గతంలో కంటే ఈసారి డిఫరెంట్‌గా షోను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌ను కేటాయించగా సీక్రెట్ రూమ్, రీఎంట్రీ వంటి కాన్సెప్ట్స్ పూర్తిగా తప్పించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. శారీరక శ్రమ కంటే మానసిక స్థైర్యం, వ్యక్తిత్వ వికాసం పొందేలా గేమ్స్ ప్లాన్ చేస్తున్నారట. మైండ్ గేమ్స్, ఇంటెన్స్ డ్రామా వంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
సామాన్యులకు ఛాన్స్ ఇలా...
సామాన్యులు ఈ షోలో పార్టిసిపేట్ చేయాలంటే 'bb9.jiohotstar.com' సైట్‌లో రిజిస్టర్ కావాలి. నేమ్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ తర్వాత 'బిగ్ బాస్ 9'లో ఎందుకు పాల్గొనాలనుకుంటున్నారో? రీజన్ చెబుతూ వీడియో అప్లోడ్ చేయాలి. స్క్రూటినీ తర్వాత కండీషన్స్ మేరకు హౌస్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. త్వరలోనే పార్టిసిపెంట్స్, ఇతర వివరాలు వెల్లడయే అవకాశం ఉంది.





















