Praneeth Hanumanthu: బతికే ఉన్నారా, వస్తున్నా... అరెస్టైన ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చిన ప్రణీత్ హనుమంతు
ప్రణీత్ హనుమంతు గుర్తున్నారా? సరిగ్గా ఏడాది క్రితం ఆయన చేసిన కామెంట్స్, అరెస్ట్ ఓ సంచలనం. అప్పట్నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆయన ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చారు.

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు (Praneeth Hanumanthu) గుర్తు ఉన్నారా? ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులోనూ సంచలనం సృష్టించింది. డార్క్ హ్యూమర్ పేరుతో తండ్రీ కుమార్తెలపై హేయమైన వ్యాఖ్యలు చేసిన అతని మీద సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సరిగ్గా ఏడాది క్రితం... జూలై 10న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఆ కేసులో శిక్ష ఎన్ని రోజులు పడింది? ఏమయ్యారు? అనేది ఎవరూ పట్టించుకోలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆయన మళ్ళీ వెలుగులోకి వచ్చారు.
బతికే ఉన్నారా... వస్తున్నా!
ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యి ఏడాది కావడంతో అతని పేరు నెట్టింట వైరల్ అయ్యింది. అసలు ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు? అంటూ నెటిజన్స్ ఆరా తీశారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్... సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ చేశారు. ప్రణీత్ హనుమంతు వరకు ఆ కామెంట్స్ వెళ్లాయి. దాంతో ఆయన రియాక్ట్ అయ్యారు.
ఫనుమంతు (ఫన్ + హనుమంతు)... తన యూట్యూబ్ ఛానల్‌లో ప్రణీత్ హనుమంతు ఒక రీల్ షేర్ చేశారు. తన గురించి సోషల్ మీడియాలో పబ్లిక్ చేసిన కామెంట్స్ అన్నీ స్క్రీన్ మీద చూపించారు. ఆ తర్వాత 'బతికే ఉన్నారా... వస్తున్నా' అని చెప్పారు. మళ్ళీ మునుపటిలా యూట్యూబ్ వీడియోలు చేస్తారా? లేదంటే నటుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తారా? అనేది చూడాలి.
Also Read: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?
ప్రణీత్ అన్నయ్య చాలా పాపులర్!
ప్రణీత్ హనుమంతు అన్నయ్య తెలుసుగా... 'హే జూడ్' పేరుతో ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. అది చాలా పాపులర్. ఇంకా ప్రణీత్ హనుమంతు ఫ్యామిలీకి మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆయన నేపథ్యం తెలుసుకోండి.





















