అన్వేషించండి

Bigg Boss Season 8 Sonia : ఆడపులికి కాబోయే వాడు ఇన్ని లక్షణాలు ఉండాలట, అలాంటి వాడు అసలు భూమ్మీద ఉన్నాడా?

Bigg Boss Season 8: బిగ్ బాస్ సీజన్ 8లో పక్కా తెలంగాణ పోరి సోనియా ఆకుల తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి అనే విషయాన్ని ప్రస్తావించింది. కుర్రకారుని కట్టిపడేసే ఈ బ్యూటీ అసలు తన వరుడు ఎలా ఉండాలందంటే..

Bigg Boss Season 8 Sonia Akula: బిగ్ బాస్ సీజన్ 8 లో తనను తానే ఆడ పులిగా ప్రకటించుకున్న సోనియా ఆకుల తాజాగా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి అనే విషయాన్ని ప్రస్తావించింది. అంతేకాదు అతనికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఓ పెద్ద లిస్ట్ నే బయట పెట్టింది. ఆ లిస్ట్ వింటే అసలు అలాంటివాడు భూమి మీద ఉన్నాడా అనే అనుమానం రాకమానదు. మరి ఇంతకీ సోనియాకు కాబోయే వాడిలో ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసుకుందాం పదండి. 

Read Also: ఒక్కొక్కరుగా మాస్క్ తీస్తున్న కంటెస్టెంట్స్- సోనియాపై హౌస్‌మేట్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆ అబ్బాయి అసలు భూమ్మీద ఉన్నాడా? 
ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్ లో సోనియా కూడా ఒకరు. పక్కా తెలంగాణ స్లాంగ్ లో ఎవరైనా తన జోలికి వస్తే ఇచ్చి పడేస్తున్న ఈ బ్యూటీ ఆర్జీవి స్కూల్ నుంచి వచ్చింది. ఇక ఆర్జివీ అంటే వాదోపవాదాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే సోనియా కూడా ఎక్కడా తగ్గకుండా స్ట్రాంగ్ గా సమాధానం చెబుతుంది. అందుకే ఆమెను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు హౌజ్ మేట్స్. పైగా ఆమె నిఖిల్ కి బాగా క్లోజ్ అవుతుందంటూ, నిఖిల్ ఆమె ఎలా చెప్తే అలా వింటున్నాడంటూ హౌస్ మేట్స్ కంప్లైంట్ చేస్తున్నారు. తాజాగా ఎలిమినేట్ అయిన బేబక్క కూడా ఇదే విషయాన్ని చెప్పింది. ఇదిలా ఉండగా తాజాగా వచ్చిన ఎపిసోడ్లో సోనియా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా లక్షణాలతో సహా బయటపెట్టింది. నైనిక, సీత, పృథ్వీ, సోనియా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉండగా, సోనియా పృథ్వీ చేతిని పట్టుకొని ఓ పెద్ద లిస్ట్ బయట పెట్టింది. పృథ్వీ కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూనే సిగ్గుపడుతూ అండర్స్టాండింగ్ ఉండాలి, బ్రాడ్ మైండెడ్, ప్రోగ్రెసివ్, నెక్స్ట్ ఏంటి అనేలా ఉండాలి గానీ రిలాక్స్డ్ మోడ్లో ఉండొద్దు. కైండ్ హార్టెడ్, రెస్పెక్ట్ ఫుల్, డిగ్నిఫైడ్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రకమై ఉండాలి, బేసిగ్గా నా థాట్స్ ని డిస్టర్బ్ చేయనివాడు అయ్యి ఉండాలి అంటూ ఈ లిస్ట్ ను పృథ్వీ ముందు పెట్టింది. నేను ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు సపోర్టివ్ గా ఉండాలి, నాతో ఈక్వల్ గా లేదా డంబ్ అయ్యి ఉండొద్దు, పిచ్చి లేకపోయినా పర్లేదు బుద్ధి ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇదంతా చూసిన నెటిజెన్లు అసలు ఇన్ని లక్షణాలు ఉన్న మగవాడు ఈ భూమి మీద ఉన్నాడా? అని కామెంట్స్ చేస్తున్నారు. 

Read Also: వాళ్లిద్దరూ తేనెపూసిన కత్తులు... హౌస్ నుంచి బయటకు వచ్చాక బేబక్క షాకింగ్ కామెంట్స్

సోనియా, నిఖిల్ మధ్య ఏం నడుస్తోంది? 
ఇక ఫస్ట్ వీకెండ్ బయటకి వెళ్ళిన బేబక్క హౌస్ లో ఉన్న సోనియా, నిఖిల్ ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. వాళ్ళిద్దరూ తేనె పూసిన కత్తులు అంటూనే చాలా క్లోజ్ అయ్యారు అనే విషయాన్ని బయట పెట్టింది. ఇక తాజాగా స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ ను చూస్తుంటే ఇద్దరి మధ్య లవ్ స్టోరీ మొదలైందని తెలుస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడిప్పుడే ప్రేమ కథలు మొదలవుతున్నాయి. కానీ టాస్క్ లు ఇచ్చినప్పుడు కూడా ఈ జంట ఇలాగే ఉంటుందా ? లేదంటే తమ టాస్క్ లకే ప్రాధాన్యతను ఇస్తారా ? అనేది చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
Revanth Reddy : కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
దీపావళి ముగిసింది - తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందా?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
Revanth Reddy : కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
YSRCP News: ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
ధర్మానతో విజయసాయిరెడ్డి సమావేశం- జగన్ మైండ్‌సెట్ మారాలని సూచించిన మాజీ మంత్రి !
Telangana: ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Embed widget