అన్వేషించండి

Bigg Boss Season 7 Day 70 Promo 1 : రామ్ చరణ్ సినిమాలో అర్జున్​ కీలకపాత్ర.. భోళే అన్న అట-శోభ ఆంటీ అట, ఫన్నీగా సాగిన ప్రోమో

Bigg Boss Season 7 Diwali Promo : బిగ్​బాస్ సీజన్ 7 దివాళీ ప్రోమో వచ్చేసింది. సెలబ్రేషన్స్​తో పాటు ప్రోమో చాలా ఫన్నీగా సాగింది.

Bigg Boss Season 7 Diwali Promo 1 : బిగ్​బాస్ సీజన్ 7 దీపావళి స్పెషల్​ ప్రోమో వచ్చేసింది. మంచి కలర్​ఫుల్​గా ఈ ఎపిసోడ్​ ఉండేలా ప్లాన్ చేసింది బిగ్​బాస్​ టీమ్. సెలబ్రెటీల ఆట, పాటలతో పాటు.. కంటెస్టెంట్​ల ఫ్రెండ్స్, ఫ్యామిలీని బిగ్​బాస్ వేదికపైకి తీసుకువచ్చింది. దీపావళి సెలబ్రేషన్​ అంతా.. బిగ్​బాస్​ స్టేజ్​ మీదే ఉందా అనేంతగా ఈ ప్రోమోను డిజైన్ చేశారు. ప్రతివారంలా కాకుండా ఈ వారం రాత్రి 7 గంటలకే ఎపిసోడ్​ స్టార్ట్​ కాబోతుంది. సెలబ్రేటీల ఆటలు, ఫ్రెండ్స్​ రాకలు, కాజల్ అగర్వాల్​ ఎంట్రీలను ఫ్లాష్​తో ప్రోమో స్టార్ట్ అయింది. తర్వాత నాగార్జున ఎంట్రీ ఇచ్చారు.

హౌజ్​మేట్స్​కి నాగార్జున (King Nagarjuna) హ్యాపీ దివాళీ చెప్పారు. హౌజ్​మేట్స్​కూడా బ్యూటీఫుల్ ఔట్​ఫిట్స్​లో కనిపించారు. నాగార్జునకు విష్ చేశారు. ఇవాళ దీపావళి కదా.. నేను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని వేదికమీదకి పిలుస్తాను అంటూ హౌజ్​మేట్స్​కి తెలిపారు. అమర్ బావా అని పిలువగా.. స్టేజ్​పై ఇమ్మాన్యేల్, అతని ఫ్రెండ్ స్టేజ్​ మీదకి వచ్చారు. యావర్​ (Yawar)ని ఉద్దేశిస్తూ.. తనకి తెలుగు నేర్పించలేదని నాగ్​ ఇమ్మూని అడుగగా.. సార్ అతనికి తెలుగు రాదు. నాకు ఇంగ్లీష్, హిందీ రాదు. అని చెప్పగా.. మరి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎలా అని అడిగితే.. మేము ఫేస్​ టైమ్​లో సైగలు ద్వారా మాట్లాడుకుంటామని ఫన్ చేశాడు.

అమర్(Amar) వాళ్ల మదర్​ స్టేజ్​ మీదకి రాగా.. నాన్న ఎలా ఉన్నారంటూ అమర్​ తల్లిని అడిగాడు. నాన్న బాగానే ఉన్నారు. నువ్వు కప్​ కొట్టుకుని వచ్చేవరకు రానంటున్నాడు హైదరాబాద్​కి అని అమర్ మదర్ తెలిపారు. తర్వాత గౌతమ్ తరపున వచ్చిన వారు.. గౌతమ్​ (Doctor Gowtham)అంటే అన్​ఫిల్టర్​బుల్​గా గేమ్​ ఆడాలి అశ్వద్ధామలాగా అని తెలిపారు. యావర్ ఫ్రెండ్.. నీవల్ల నేను నాగార్జునగారి కలిసే అవకాశం వచ్చింది. తర్వాత వచ్చిన ఉప్పెన డైరక్టర్ బుచ్చిబాబు.. అర్జున్​కు రామ్​ చరణ్ సినిమాలో నువ్వో సూపర్ క్యారెక్టర్ చేస్తున్నావంటూ భారీ ఆఫర్ ఇచ్చాడు. ఈ ఆఫర్​తో అర్జున్ ఆనందంతో సతమతమైపోయాడు. 

అనంతరం వచ్చిన సోహేల్(Biggboss Sohel).. నాగార్జునతో తనకున్న బిగ్​బాస్​ అనుభవాలు షేర్ చేసుకున్నాడు. సీజన్​ 4 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా వస్తున్నాను. బిగ్​బాస్​ నుంచి నేను ఇంకా ఎలిమేనేట్​ కాలేదంటూ తెలిపాడు. తర్వాత వచ్చిన మానస్​ అన్నయ్య అని అర్జున్​ని పిలవగానే.. అర్జున్ అడ్వాన్స్ మ్యారేజ్ లైఫ్ అని తెలిపాడు. ఇదేంటి అడ్వాన్స్ బర్త్​డే విన్నాను కానీ మ్యారేజ్ లైఫ్ అని నాగ్​ అడుగగా.. పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండరుగా సార్ అని అర్జున్ రిప్లై ఇచ్చాడు. దీంతో నాగార్జున ఫన్నీగా అర్జున్ వైఫ్ పేరుతో అమ్మా.. సురేఖ అంటూ నవ్వులు పూయించాడు. మీ ఆయన ఏమి చెప్పాడో విన్నావా? మ్యారేజ్ తర్వాత హ్యాపీగా ఉండరట.. గుర్తుపెట్టుకో అని నాగ్ ఇమిటేట్ చేశారు. 

శోభ ఆంటీ..

శివాజీ (Shivaji Family ) చిన్నకొడుకు, భార్య స్టేజ్ మీదకి వచ్చారు.  అస్సలు ఫోన్​లో కూడా కాంటాక్ట్​లో లేకుండా ఎప్పుడూ లేము అంటూ శివాజీ భార్య ఎమోషనల్ అయ్యారు. శివాజీ కొడుకు భోళేని అన్న అని పిలుస్తుంటే.. అన్న కాదురా బాబాయ్ అని శివాజీ తెలిపాడు. కాదు నాన్న.. భోళే హీరో అంటూ తెలిపాడు. తర్వాత శోభను ఆంటీ అంటూ సంభోదించాడు. దీంతో ఆమె మెహం మాడిపోయింది. దీంతో శివాజీ భార్య కలుగజేసుకుని ఆంటీ కాదు అక్క అని చెప్పగా.. మా మమ్మీని ఆంటీని పిలుస్తుంది అంటూ కామెంట్ చేశాడు. నాగార్జున శివాజీ మీ అబ్బాయికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది కదా అని అడుగగా.. అవును సార్ మా ఇంట్లో నా మీద ఎక్కువ కామెడీ చేసేది వాడే అని చెప్పాడు. నువ్వు నన్ను చూడవా అంటూ శివాజీ భార్య.. శివాజీని అడుగగా.. సార్ నా భార్య ఇప్పటివరకు ఎవరికి తెలియదు. కానీ ఫస్ట్ టైమ్ బయటకి వచ్చింది. 

తండ్రికి సలహా ఇచ్చిన కొడుకు..

తర్వాత శివాజీ కొడుకు నాన్న నువ్వు ఎంత పెద్ద హీరో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక శివన్న ఉన్నాడు అంటూ ఎమోషనల్​గా తెలిపాడు. ఇంకోసారి నీ నోటి నుంచి వెళ్లిపోతా అనే మాట వినపడకూడదు అని తెలుపగా.. నాగార్జున.. శివాజీ ఎప్పుడైనా అనుకున్నావా మీ రిక్కీ నీకు సలహాలు ఇస్తాడని అడిగారు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది అంటూ శివాజీ తెలిపాడు. ప్రగతి వచ్చి.. ప్రియాంకను నువ్వు చేస్తున్నదానికి ఐయామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్​ యూ అని తెలిపింది.  ప్రియాంక మదర్​ కూడా చాలా ఎమోషనల్​ అయ్యారు. తర్వాత అందరూ తమ వారికి సలహాలు ఇచ్చారు. రతికా సింగ్ (Rathika Singh Dance Performance) డ్యాన్స్ పర్​ఫార్మెన్స్ చూపించారు. తర్వాత కాజోల్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ ప్రమోషన్​లో భాగంగా వచ్చినట్లు తెలుస్తుంది. బిగ్​ బాస్​ స్టేజ్​ మీదకి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో .. టాప్​ 5 గేమ్ ఆడించారు నాగార్జున. దీంతో ప్రోమో ముగిసింది.

">

Also Read : ఈ సింపుల్ చిట్కాలతో మీ పగిలిన పాదాలకు చెక్ పెట్టండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Eating Ghee on an Empty Stomach : ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Embed widget