అన్వేషించండి

Heal Your Heels : ఈ సింపుల్ చిట్కాలతో మీ పగిలిన పాదాలకు చెక్ పెట్టండి

Cracked Heels Treatment : మీ పాదాలు పగిలి చూసేందుకు అసహ్యంగా కనిపిస్తున్నాయా? ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. 

Heal Your Heels : చలికాలంలో మనల్ని బాధించే సమస్యల్లో కాళ్లు పగుళ్లు (Cracked Heals) ఒకటి. ఇది ఓ సాధారణ సమస్యే అయినా.. శీతాకాలంలో దీని ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. చేతులు, పెదాలు కూడా పొడిబారిపోతాయి. ముఖ్యంగా పాదాల వద్ద చర్మం మందంగా ఉండి.. మొద్దుబారిపోయి.. పగిలిపోతూ ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం చలి అయితే.. నీరు తక్కువగా తీసుకోవడం మరో కారణం. చలిగా ఉంది కదా అని.. ఊరికే వాష్​రూమ్​కి వెళ్లాల్సి వస్తుంది కదా అని చాలామంది నీటిని తక్కువగా తీసుకుంటారు. ఇది మీ చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది.  

కాళ్లు పగలడానికి అవి కూడా కారణమే..

కేవలం చలి వల్లనే కాదు. ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల, మీ పాదలపై ఒత్తిడి పెరగడం వల్ల, హైహీల్స్ ఉపయోగించడం వల్ల కూడా పాదాలు పగులుతాయి. మధుమేహం, ఊబకాయం, విటమిన్స్ లోపం, పాదాల్లో నరాలు దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలు వల్ల కూడా పాదాల్లో పగుళ్లు ఏర్పడతాయి. అయితే ఇదేదో అంటు వ్యాధో లేక మీకు మాత్రమే ఉంది అనుకోకండి. దాదాపు చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాళ్లు పగిలేందుకు చాలా కారణాలే ఉండొచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. కచ్చితంగా ఈ సమస్యకు మీరు చెక్​ పెట్టవచ్చు. అయితే అసలు మీకు దేనివల్ల కాళ్లు పగులుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడే మీకు ఏ చికిత్స్ సెట్​ అవుతుందో తెలుస్తుంది.

పరిస్థితి తీవ్రంగా ఉంటే..

కాళ్లు పగలడం అనేది ప్రమాదకరమైన సమస్య కాదు. కానీ పగుళ్లు మరీ లోతుగా ఉంటే మాత్రం వైద్యుని సంప్రదించండి. ఎందుకంటే పగుళ్లు డీప్​గా ఉంటే.. నడుస్తున్నప్పుడు రక్తస్రావమైన నొప్పి కలుగుతుంది. పరిస్థితి తీవ్రం కాకముందే మీరు డెర్మాటాలజిస్ట్​ని కలిస్తే వారు మీకు సరైన చికిత్స చేస్తారు. ఇది త్వరగా మీ పాదాలను హీల్​ చేయడంలో సహాయం చేస్తుంది. పగుళ్లు తక్కువగా ఉంటే.. మీరు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కొన్ని చిట్కాలు పాటించి వాటిని దూరం చేసుకోవచ్చు. 

తక్కువగా ఉంటే..

హీల్స్ వల్ల లేదా బూట్లు వల్ల మీకు ఈ సమస్య వస్తే కొన్నిరోజులు వాటికి దూరంగా ఉండండి. లేదంటే పాదలు మరింత దెబ్బతినే అవకాశముంది. మెత్తగా, స్మూత్​గా ఉండే చెప్పులను ఉపయోగించండి. ఇవి మీ మడమలపై ఒత్తిడి పడకుండా చేసి.. సమస్యను దూరం చేసుకోవడంలో హెల్ప్ చేస్తాయి. చర్మం పొడిబారడం వల్ల పగుళ్లు ఏర్పడితే.. మీరు శరీరానికి నీటిని ఎక్కువగా అందించండి. మీరు హైడ్రేటెడ్​గా ఉంటే ఈ సమస్య తగ్గుతుంది. 

ఆ క్రీమ్స్ ఉపయోగించవచ్చు..

పొడిబారిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్​ లేదా లోషన్స్ ఉపయోగించండి. ఇవి సమస్య రాకముందు నుంచి ఉపయోగిస్తే చాలా మంచిది. ఒకవేళ కాళ్లు పగిలిన తర్వాత అయినా.. పగుళ్లను నయం చేసే క్రీమ్​లు మార్కెట్లలో దొరుకుతాయి. ప్రతి రోజు పడుకునే సమయంలో దానిని మీ పాదాలకు అప్లై చేయండి. ఇవి కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. 

Also Read : తలస్నానం చేసేప్పుడు ఆ తప్పులు చేస్తే మీ జుట్టు హాంఫట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake In Hyderabad List: పదేళ్లలో హైదరాబాద్ పరిధిలో ఏర్పడ్డ అతి పెద్ద భూకంపం ఇదే - ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల లిస్ట్
50 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే. ఇంతకు ముందు వచ్చింది ఎక్కడంటే..
Janasena warning Pushpa 2: పుష్ప 2 అడ్డుకుంటాం.. అల్లు అర్జున్ కి జనసేన నేత వార్నింగ్!
పుష్ప 2 అడ్డుకుంటాం.. అల్లు అర్జున్ కి జనసేన నేత వార్నింగ్!
Chandra Babu Land : అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake In Hyderabad List: పదేళ్లలో హైదరాబాద్ పరిధిలో ఏర్పడ్డ అతి పెద్ద భూకంపం ఇదే - ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల లిస్ట్
50 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే. ఇంతకు ముందు వచ్చింది ఎక్కడంటే..
Janasena warning Pushpa 2: పుష్ప 2 అడ్డుకుంటాం.. అల్లు అర్జున్ కి జనసేన నేత వార్నింగ్!
పుష్ప 2 అడ్డుకుంటాం.. అల్లు అర్జున్ కి జనసేన నేత వార్నింగ్!
Chandra Babu Land : అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
Hyderabad to Kashmir Low Budget Trip : కేవలం రూ.1700లతో హైదరాబాద్​ టూ కాశ్మీర్.. లో బడ్జెట్​తో మైండ్ బ్లోయింగ్ ప్రయాణం, డిటైల్స్ ఇవే
కేవలం రూ.1700లతో హైదరాబాద్​ టూ కాశ్మీర్.. లో బడ్జెట్​తో మైండ్ బ్లోయింగ్ ప్రయాణం, డిటైల్స్ ఇవే
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Embed widget