అన్వేషించండి

Bigg Boss Season 7 Day 21 Updates: బిగ్ బాస్‌లో నామినేషన్స్ గోల - యావర్‌కు ఫైనల్‌గా సూపర్ ట్విస్ట్!

బిగ్ బాస్ హౌజ్‌లో జరిగే నామినేషన్స్ విషయంలో బిగ్ బాస్ పెద్దగా జోక్యం చేసుకోరు కానీ బిగ్ బాస్ సీజన్ 7లో మాత్రం ఆయన జోక్యం బాగానే ఉంటోంది.

బిగ్ బాస్ ఉల్టా పుల్టా సీజన్‌లో నామినేషన్స్ సైతం చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ ప్రక్రియతో నామినేషన్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు బిగ్ బాస్. పైగా ఒక్కొక్క వారం ఒక్కొక్క కంటెస్టెంట్‌కు పవర్ అస్త్రా దక్కుతుండడంతో వారు నామినేషన్స్ నుండి సేవ్ అవ్వడం మాత్రమే కాకుండా వారికి పలు సూపర్ పవర్స్ కూడా లభిస్తున్నాయి. దాని ద్వారా వారు కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేసే అవకాశంతో పాటు సేవ్ చేసే అవకాశం కూడా లభిస్తోంది. తాజాగా జరిగిన నామినేషన్స్‌లో కూడా అదే జరిగింది. ఇప్పటివరకు పవర్ అస్త్రా గెలుచుకున్న కంటెస్టెంట్స జడ్జిలుగా వ్యవహరిస్తూ.. ఏయే కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉండాలని డిసైడ్ చేశారు.

బిగ్ బాస్ సీజన్ 7లో ఇప్పటివరకు ముగ్గురు కంటెస్టెంట్స్‌కు పవర్ అస్త్రాను గెలుచుకున్నారు. వారే సందీప్, శివాజీ, శోభా శెట్టి. ఈసారి నామినేషన్స్‌లో ఈ ముగ్గురే జడ్జిలుగా వ్యవహరించారు. కంటెస్టెంట్స్ అంతా.. వారు నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరినీ బోణులలో నిలబెట్టి.. దానికి తగిన కారణాలు చెప్పాలి. అప్పుడు జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ ముగ్గురు.. వారు నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు కంటెస్టెంట్స్‌లో ఎవరిని నామినేట్ చేయాలి అని నిర్ణయిస్తారు. అయితే నామినేషన్స్‌లో ఎక్కువ వాగ్వాదాలు జరగడంతో.. నేడు (సెప్టెంబర్ 26న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో కేవలం ముగ్గురి నామినేషన్స్ మాత్రమే పూర్తయ్యాయి. 

ప్రియాంకను యావర్..
ముందుగా తనకు నచ్చని కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయడానికి ప్రిన్స్ యావర్‌ను పిలిచారు జడ్జిలు. అయితే ప్రిన్స్ యావర్.. ప్రియాంకను, టేస్టీ తేజను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. పవర్ అస్త్రా కోసం పోటీపడాల్సి వచ్చినప్పుడు, ప్రియాంక చేతిలో నిర్ణయం ఉన్నప్పుడు తనను అన్యాయంగా ఎలిమినేట్ చేసిందని యావర్ కారణంగా చెప్పాడు. ప్రియాంక అసలు సరైన కారణంతో తనను పవర్ అస్త్రా రేసు నుండి తప్పించలేదని అన్నాడు. దానికి ప్రియాంక వాదించే ప్రయత్నం చేసినా యావర్ తన మాట వినడానికి సిద్ధంగా లేడు. దీంతో కారణం చెప్పడంకంటే మౌనంగా ఉండిపోవడం మేలు అనుకుంది. ఇక టేస్టీ తేజ.. ఏ ఫిజికల్ టాస్కులలో పాల్గొనడం లేదనే కారణంతో తనను నామినేట్ చేశాడు యావర్. దానికి టేస్టీ తేజ ఫన్నీ వివరణ ఇచ్చాడు. అది చూసి కంటెస్టెంట్స్ నవ్వుకున్నారు. ఫైనల్‌గా జడ్జిలు.. ఈ ఇద్దరిలో ప్రియాంకను నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు.

రతికను శుభశ్రీ..
యావర్ తర్వాత నామినేట్ చేయడానికి వచ్చిన శుభశ్రీ.. రతికను పర్సనల్‌గా టార్గెట్ చేసింది. రతిక.. తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ గురించి స్టేట్‌మెంట్స్ పాస్ చేసిందని, అతడు బయట ఒక సెలబ్రిటీ కావడంతో అలా చేయడం బిగ్ బాస్ రూల్స్‌ను అతిక్రమించడం అంటూ తనను నామినేట్ చేసింది శుభశ్రీ. దీనికి రతిక ఒప్పుకోకుండా వాదనకు దిగింది. పర్సనల్ విషయాలు మాట్లాడకూడదని శుభశ్రీకి చెప్తున్నా కూడా వినకుండా అలాగే మాట్లాడింది. దీనివల్ల శుభశ్రీకి, రతికకు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇంకా పూర్తిగా ఆట ఆడడం లేదని చెప్పి అమర్‌దీప్‌ను నామినేట్ చేసింది శుభ. పవర్ అస్త్రా కోసం కంటెండర్‌షిప్‌లో అమర్ ఫైట్ చేయలేదని కారణంగా చెప్పింది. దానికి అమర్‌దీప్ ఒప్పుకోలేదు. నువ్వు పనిచేయడం లేదంటే.. నువ్వు పనిచేయడం లేదంటూ కాసేపు వాదించుకున్నారు. వీరిద్దరి విషయంలో రతికకు చెప్పిన కారణం స్ట్రాంగ్ అనుకున్న జడ్జిలు.. తనను నామినేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. శివాజీ మాత్రం దీనికి ఏకీభవించడం లేదని ఓపెన్‌గా చెప్పేశాడు.

యావర్‌ను గౌతమ్.. 
గౌతమ్ కృష్ణ వచ్చి ప్రిన్స్ యావర్‌ను, టేస్టీ తేజను బోణులో నిలబెట్టాడు. ఒకప్పుడు తమకు జరిగిన వాగ్వాదాన్ని గుర్తుచేసుకొని నువ్వు ఎవరు అని అమర్యాదగా మాట్లాడాడు అని కారణం చెప్పి యావర్‌ను నామినేట్ చేశాడు గౌతమ్. దానికి యావర్.. మళ్లీ అరుపులు మొదలుపెట్టాడు. యావర్ అరుపులకు గౌతమ్ వెటకారంగా రియాక్ట్ అవుతూ.. తనను ఇమిటేట్ చేశాడు. దానికి కోపమొచ్చిన యావర్.. బోణులో నుండి దిగి గౌతమ్ మీదకు వచ్చాడు యావర్. ఆపాలనుకున్న జడ్జిల మీదకు కూడా వెళ్లాడు. దీంతో ఆ కారణం చెప్పి యావర్‌ను నామినేట్ చేశారు జడ్జిలు. కానీ బిగ్ బాస్ మాత్రం జడ్జిలు చెప్పిన కారణం కరెక్ట్ కాదని యావర్‌ను నామినేషన్ నుండి తీసేయమన్నాడు. దీంతో యావర్ హ్యాపీ అంటూ సంతోషపడ్డాడు.

Also Read: ఆయన కెప్టెన్ అయితే బాగుంటుంది: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి ముత్తయ్య మురళీధరన్ కామెంట్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Embed widget