అన్వేషించండి

Bigg Boss Season 7 Day 16 Updates: ‘బేబీ 2’ చూపిస్తున్న రతిక - ప్రశాంత్‌తో గిల్లికజ్జాలు, ప్రిన్స్‌కు వెన్నుపోటు

బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్, రతిక మధ్య ఉన్న సంబంధం ఏంటి అని ప్రేక్షకులు ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారు. వారు అప్పటికప్పుడు గొడవపడుతున్నారు, అప్పటికప్పుడే మళ్లీ కలిసిపోతున్నారు.

బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Teluau Season 7)లో మూడో వారం మొదలయ్యింది. దీంతో మూడో పవర్ అస్త్రాను కంటెస్టెంట్‌లో ఒకరు గెలుచుకోవడానికి పోటీ మొదలయ్యింది. మూడో పవర్ అస్త్రా ఎవరికి వస్తుంది, అసలు గేమ్ ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. కానీ ఈసారి పవర్ అస్త్రా కోసం ఎవరు పోటీ పడతారు అనే విషయాన్ని అనూహ్యంగా బిగ్ బాసే డిసైడ్ చేశారు. ఒకవైపు పవర్ అస్త్రా కోసం పోటీ జరుగుతుంటే.. మరోవైపు రతిక, పల్లవి ప్రశాంత్.. ఎప్పటిలాగానే గిల్లికజ్జాలతో, గొడవలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. కొన్నిరోజుల పాటు రతిక, ప్రశాంత్ మధ్య మాటల్లేవు. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ కొన్ని గొడవలు, కొన్ని గిల్లికజ్జాలతో కలిసిపోయారు. కానీ మధ్యలో ప్రిన్స్ యావర్ నలిగిపోయాడు.

మళ్లీ గొడవ..
కంటెస్టెంట్స్ అంతా తనను టార్గెట్ చేసినట్టుగా ఉందంటూ, ఇలా పలు కారణాలు తనకు నచ్చడం లేదంటూ శివాజీతో చెప్పుకొని బాధపడింది రతిక. ఏడ్చింది కూడా. దీంతో పల్లవి ప్రశాంత్.. తనను ఓదార్చడానికి వచ్చాడు. కళ్లలో నుంచి పాదరసం వస్తుంది అంటూ తనను నవ్వించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అక్కడికి ప్రిన్స్ యావర్ వచ్చాడు. రతిక.. యావర్‌ను మామూలుగా చూడగా.. అసలు యావర్ ఎవరు మన మధ్యలో అంటూ రతితో అన్నాడు. దీంతో తను ఏడుపు ఆపేసి నవ్వింది. ఇదంతా చూసిన ప్రేక్షకులు.. వీరిద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయాయి అని అనుకునేలోపే.. మళ్లీ గొడవపడడం మొదలుపెట్టాడు.

నువ్వు పో..
ఒకవైపు మూడో పవర్ అస్త్రా కోసం పోటీ జరుగుతోంది. ఇంతలోనే శివాజీకి చెందిన పవర్ అస్త్రాను అమర్‌దీప్ దొంగిలించాడు. అదే సమయంలో అసలు ఆ పవర్ అస్త్రాను ఎవరు కొట్టేశారని చర్చ మొదలయ్యింది. అందరూ కలిసి చర్చించుకుంటున్న సమయంలో రతిక.. పల్లవి ప్రశాంత్ పేరు చెప్పింది. దీని వల్ల వారి మధ్య గొడవ మొదలయ్యింది. పల్లవి ప్రశాంత్ అన్న మాటలకు ఓవరాక్షన్ చేయకు అంటూ అరిచింది రతిక. దీనికి సహనం కోల్పోయిన ప్రశాంత్.. ‘‘అటు పో’’ అంటూ చులకనగా చూశాడు. ఒకరికి ఒకరు బాగా ఎక్కువ చేస్తున్నావు, తగ్గించు అంటూ వాగ్వాదాలు చేసుకున్నారు. అసలు వీరిద్దరు అంతలా ఎందుకు కొట్టుకుంటున్నారు అని ఇతర కంటెస్టెంట్స్‌కు అర్థం కాలేదు. శుభశ్రీ.. రతికతో ఎవరో ఒకరు గొడవపెట్టుకోవాలి అనే టాస్క్ ఇచ్చిందని, తాను చేయలేదని తేజ బయటపెట్టాడు. 

చేయి వేయకు..
నేడు (సెప్టెంబర్ 19న) ప్రసారం అయిన ఎపిసోడ్‌లో రతిక, ప్రశాంత్‌ల మధ్య ఒక్కసారి కాదు.. పదేపదే గొడవ జరిగింది. పల్లవి ప్రశాంత్ లివింగ్ రూమ్‌లోని సోఫాలో కూర్చొని ఉండగా.. రతిక.. అక్కడికే వచ్చి నిలబడింది. ఇక్కడికి ఎందుకు వచ్చి నిలబడ్డావు అని ప్రశాంత్ అడగడంతో.. వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ మొదలయ్యింది. ‘‘నేను ఎక్కడైనా నిలబడతా.. నా ఇష్టం’’ అని రతిక అరవడం మొదలుపెట్టింది. మళ్లీ కాసేపు నువ్వు పో అంటే నువ్వు పో అంటూ వాదించుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్లిపో అంటూ రతికపై చేయి వేసి మరీ చెప్పాడు ప్రశాంత్. అది నచ్చని రతిక.. నువ్వు చేయి వేసి మాట్లాడకు అంటూ బెదిరించడం మొదలుపెట్టింది. వాగ్వాదం చాలు అనుకున్న ప్రశాంత్.. అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు. వీరిద్దరూ కెమెరాల్లో పడడానికే ఇలా కావాలని గొడవపడుతున్నారని కంటెస్టెంట్స్ అనుకోవడం మొదలుపెట్టారు. ప్రశాంత్‌తో గొడవపడుతూ యావర్‌కు దగ్గరయిన రతిక.. అతడు పవర్ అస్త్రాకు అర్హుడు కాదు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో యావర్.. రతిక దగ్గర నుంచి ఇది ఊహించలేదు అంటూ బాధపడ్డాడు. దీనికి ప్రేక్షకులు వెన్నుపోటు అని ముద్రవేశారు.

Also Read: తను నన్ను చిన్నపిల్లాడిలా చూసుకుంటుంది: భార్య, పిల్లల గురించి విజయ్ ఆంటోనీ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Cold Weather Safety Tips : పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
Embed widget