అన్వేషించండి

Vijay Antony: తను నన్ను చిన్నపిల్లాడిలా చూసుకుంటుంది: భార్య, పిల్లల గురించి విజయ్ ఆంటోనీ

విజయ్ ఆంటోనీ ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకునే వ్యక్తి కాదు. ‘బిచ్చగాడు 2’ ప్రమోషన్స్ సమయంలో మాత్రం తన కుటుంబం గురించి పలు విషయాలు బయటపెట్టాడు.

సినీ పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ అని గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా తక్కువమంది ఉంటారు. సినిమాలోని ప్రతీ క్రాఫ్ట్‌లో ఆరితేరినవారి సంఖ్య చాలా తక్కువే ఉంటుంది. అందులో విజయ్ ఆంటోనీ ఒకరు. యాక్టర్‌గా, డైరెక్టర్‌గా, సింగర్‌గా, లిరిసిస్ట్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా.. ఇలా సినిమాలోని చాలావరకు క్రాఫ్ట్స్‌లో విజయ్ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి విజయ్ ఆంటోనీ పర్సనల్ లైఫ్‌లో ఒక విషాదం చోటుచేసుకుంది. తన 17 ఏళ్ల కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం కేవలం విజయ్ ఆంటోనీ కుటుంబాన్ని మాత్రమే కాదు.. పూర్తిగా సినీ పరిశ్రమను, ప్రేక్షకులను కూడా కలచివేసింది. దీంతో ఒక సినిమా ప్రమోషన్స్ సమయంలో తన కుటుంబం గురించి విజయ్ ఆంటోనీ చేసిన వ్యాఖ్యలు బయటికొచ్చాయి.

నిర్మాతగా మారిన విజయ్ ఆంటోనీ భార్య..
సినిమాల్లో ఎంత యాక్టివ్‌గా ఉన్నా.. కొందరు నటీనటులు మాత్రం తమ పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులతో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. అలాంటి వారిలో విజయ్ ఆంటోనీ కూడా ఒకరు. తన భార్య ఫాతిమా విజయ్ ఆంటోనీ కూడా సినిమాల్లో యాక్టివ్ అయిన తర్వాత ఆమె గురించి ప్రేక్షకులకు తెలిసింది. హీరోగా, దర్శకుడిగా విజయ్ ఆంటోనీ సినిమాలను తెరకెక్కిస్తున్న క్రమంలో.. ఫాతిమా.. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి.. తన భర్త నటించిన సినిమాలను స్వయంగా నిర్మించడం మొదలుపెట్టింది. దీంతో ఆమె కూడా సినీ ప్రేక్షకులకు తెలియడం మొదలయ్యింది. కానీ విజయ్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నా.. వారి గురించి మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. 

భార్య సపోర్ట్ ఉంటుంది..
విజయ్ ఆంటోనీ సన్నిహితులు ఎవరైనా.. తను ఈ స్టేజ్‌లో ఉండడానికి తన భార్య ఫాతిమానే కారణమని అంటుంటారు. పలు సందర్భాల్లో విజయ్ కూడా అదే మాట అన్నాడు. ‘బిచ్చగాడు 2’ మూవీ ప్రమోషన్స్ సమయంలో విజయ్ ఆంటోనీ.. తన భార్య గురించి చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అయ్యాయి. ‘‘ప్రొడక్షన్ విషయంలో నా భార్య నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. నన్ను చిన్నపిల్లాడిలాగా చూస్తుంది’’ అంటూ తన భార్య గురించి చెప్పుకొచ్చాడు విజయ్ ఆంటోనీ. తన భార్య మాత్రమే కాదు.. తన పిల్లలు, తన చుట్టూ ఉండేవారు, తనతో పనిచేసే వారు కూడా తన మాట వింటారని, అందుకే తన పనులన్నీ సులువుగా అయిపోతాయని అన్నాడు విజయ్ ఆంటోనీ.

మా నాన్న ఏంజెల్..
తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్న విషయాన్ని కూడా విజయ్ ఆంటోనీ బయటపెట్టాడు. తనతో పాటు ‘బిచ్చగాడు 2’లో నటించిన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఆ సినిమా షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోనీ చిన్న కూతురిని కలిశానని, మా నాన్న ఏంజెల్ అని ఆ అమ్మాయి సంబరపడింది అన్న విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. భార్య, పిల్లలతో సంతోషంగా ఉన్న విజయ్ ఆంటోనీ జీవితం ఒక్కసారిగా ఊహించని టర్న్ తీసుకుంది. పర్సనల్ లైఫ్‌లో సంతోషంగా ఉండడంతో పూర్తిగా ప్రొఫెషనల్ లైఫ్‌పై ఫోకస్ చేస్తున్న విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం బాధాకరమని సినీ ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు.

Also Read: నాగార్జున నన్ను దత్తత తీసుకుంటా అన్నారు, ఇప్పుడు గుర్తుపట్టలేదు: నటి యానీ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలుమేం చీమూ, నెత్తురు ఉన్న నాకొడుకులమే! బూతులతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డిManmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Embed widget