Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 56 రివ్యూ... ఎలిమినేషన్ తరువాత రాజాకి రోజా - భరణి, దివ్యాలకు ముళ్ళు గుచ్చిన దువ్వాడ మాధురి... తనూజా గోల్డెన్ బజర్ ఎందుకు వాడలేదంటే?
Bigg Boss 9 Telugu Today Episode - Day 56 Review : ఈ వారం ఊహించని విధంగా షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. గోల్డెన్ బజర్ ఉన్నా కూడా తనూజా మాధురి కోసం ఎందుకు వాడలేదో ఇప్పుడు తెలుసుకుందాం.

సండే ఎపిసోడ్ లో గ్రాండ్ ఎంట్రీ తర్వాత నాగార్జున "రీతూతో ఈ వీక్ మొత్తం మాట్లాడొద్దు" అంటూ డెమోన్ కు పనిష్మెంట్ ఇచ్చారు. "అసలు బ్యాలెన్స్డ్ గా ఉన్నావా? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తో పాటు రోజుకు 2 టీ టైమ్స్... మొత్తం 35.... నువ్వు మొత్తం 35 సార్లు గొడవ పడ్డావు" అంటూ నిన్నటి ఫైర్ ను కంటిన్యూ చేశారు నాగార్జున. "నాతో పాటు అందరిలోనూ మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ. నాకు అసలు కిచెన్ టీమ్ వద్దు అని మాజీ కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ కు చెప్పాను. అయినా ఇచ్చారు" అని కంప్లయింట్ చేసింది తనూజా. ఇమ్మాన్యుయేల్ ను అదే అడగ్గా... మాధురి "తనూజా వద్దు అనలేదు" అని సాక్ష్యం చెప్పింది. "హెల్త్ బాలేదన్న మంచి ఇంటెన్షన్ తోనే చేశారు. ఒక రోల్ ఒప్పుకున్నాక పేషెన్స్, మాట్లాడే విధానం, సెల్ఫ్ అసెస్మెంట్ అనే 3 క్వాలిటీస్ ఉండాలి. తనూజా గురించి రాయమంటే అందరూ రాసింది ఈజీగా చిరాకు పడుతుంది అని" అంటూ మళ్ళీ కంప్లైంట్ చేయొద్దని హింట్ ఇచ్చారు నాగ్.
హౌస్ లోకి 'గర్ల్ ఫ్రెండ్' ఎంట్రీ
నవంబర్ 7న రిలీజ్ కానున్న 'గర్ల్ ఫ్రెండ్' మూవీ ప్రమోషన్లలో భాగంగా రష్మిక మందన్న, ఈ సినిమా హీరో దీక్షిత్ బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. ట్రైలర్ చూశాక, వాళ్ళ సమక్షంలోనే హౌస్ మేట్స్ తో గేమ్ ఆడించారు. ఇమ్మాన్యుయేల్, డెమోన్ పవన్, రీతూ, సుమన్, భరణి, మాధురి, నిఖిల్ ఒక టీమ్, మిగిలిన వాళ్ళు ఒక టీమ్. పోకిరి, యమదొంగ, డీజే టిల్లు, అదుర్స్, చంద్రముఖి సినిమాల కామెడీ సీన్స్ ను రెండు టీమ్ లతో రీక్రియేట్ చేయించారు. ఇందులో 37 పాయింట్స్ తో దివ్య టీం విన్ అయ్యింది. ఇమ్మాన్యుయేల్ పై "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అంటూ ప్రశంసలు కురిపించారు.
హౌస్ మేట్స్ కు పాయిజన్ ఇంజెక్షన్
"ఎవరు పాయిజన్ ? హౌస్ లో మీ ఆటకు అడ్డు ఎవరో చెప్పి ఇంజెక్షన్ లో ఉన్న లిక్విడ్ ను తగ్గించాలి" అనేది ఈ టాస్క్. సుమన్ శెట్టి, ముందు రాముకి ఇచ్చి, "స్ట్రాంగ్ ప్లేయర్ అతనుంటే నేను ముందుకెళ్లలేను" అంటూ గౌరవ్ కి ఇచ్చాడు. కళ్యాణ్ "కెప్టెన్సీ కంటెండర్ లో ఆయనకెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారు. దానివల్ల నాలా ఇండివిడ్యువల్ గా ఆడేవాళ్ళకు దెబ్బ పడుతుంది " అని భరణికి ఇచ్చాడు. "ఎమోషనల్ అవుతాను" అంటూ దివ్య భరణికి, సేమ్ రీజన్ తో దివ్యకు భరణి ఇంజెక్షన్ ఇచ్చాడు. "ప్రతీసారి దివ్య ఇంటర్ఫియర్ అవుతుంది అనిపిస్తుందా?" అని నాగార్జున అడగ్గా... "అవును" అని సమాధానం చెప్పారు భరణి. సాయి ఇంజెక్షన్ ను సంజనాకు, గౌరవ్ ఫేక్ ఫ్రెండ్షిప్ పేరుతో రాముకి, రామూ డెమోన్ కి, మాధురి భరణికి, ఇమ్మాన్యుయేల్ డెమోన్ కి, నిఖిల్ డెమోన్ కి, మెంటల్ స్ట్రెస్ ఇచ్చారు అంటూ రీతూ మధురికి, డెమోన్ మాధురికి, తనూజా ఇమ్మాన్యుయేల్ కి, సంజన తనూజాకి ఇంజెక్షన్ ఇచ్చాడు.
తనూజా సేవింగ్ పవర్ ఎందుకు వాడలేదు?
ఈ వారం నామినేషన్ లలో రీతూ, తనూజా, కళ్యాణ్, డెమోన్, సంజన, రామూ, గౌరవ్, మాధురి ఉండగా, చివరకు దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యింది. రామూ కోసం మాధురిని సేవ్ చేయను అని చెప్పింది తనూజా. ఇక స్టేజ్ మీద తన జర్నీని చూసుకున్న మాధురి, "ఎల్లుండి నా హస్బెండ్ బర్త్ డే. అందుకే ఎలిమినేట్ కావాలని కోరుకున్నా" అంటూ క్లారిటీ ఇచ్చింది. అలాగే వెళ్తూ వెళ్తూ తనూజా, కళ్యాణ్, డెమోన్ కు రోజెస్, 100% ఫేక్ అంటూ భరణి, దివ్యాలకు ముళ్ళు ఇచ్చింది మాధురి.





















