Bigg Boss 9 Telugu : నామినేషన్లలో లత్కోర్ పంచాయతీ... ఫ్లవర్ ఎవరో ఫైర్ ఎవరో తేలిపోయింది... కామనర్స్ ను కార్నర్ చేసిన ఓనర్స్
Bigg Boss 9 Telugu Today Episode - Day 15 Review : మూడవ వారం నామినేషన్ల ప్రక్రియ స్ట్రాంగ్ గానే జరిగింది. ఈ క్రమంలో రీతూ, హరిత హరీష్ ల పంచాయతీ హైలెట్ గా నిలిచాయి. ఈ వారం నామినేషన్లలో ఎవరెవరు ఉన్నారు?

బిగ్ బాస్ ఆడియన్స్ కు శనివారం, ఆదివారం ఎపిసోడ్ వచ్చిందంటే పండగే. అలాగే సోమవారం ఎపిసోడ్స్ కోసం కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తారు. ఎందుకంటే సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్ల రచ్చ షురూ అవుతుంది. అప్పటిదాకా కూల్ గా ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కసారిగా నామినేషన్లలో తమకు నచ్చని వారిని టార్గెట్ చేస్తూ, హౌజ్ లో నుంచి బయటకు పంపించడానికి రీజన్ చెప్తారు. ఈ రోజు కూడా హౌజ్ లో అదే జరిగింది.
సోల్ మెట్ కు నో బెడ్ షేరింగ్
మోస్ట్ బోరింగ్ పర్సన్ గా ఫ్లోరా షైనీ జైలుకి వెళ్ళిన సంగతి తెలిసిందే. దీంతో ఇమ్మానుయేల్ - భరణి... తనూజ దగ్గరకు వెళ్లి రీతూతో బెడ్ షేర్ చేసుకోమని అడిగారు. అయితే అప్పటిదాకా రీతూ తన సోల్మెట్ అని చెప్పిన తనూజ, ఇప్పుడు మాత్రం డైరెక్ట్ గా నో చెప్పింది. దీంతో వాష్రూమ్లో "ఎవ్వరూ నాతో మాట్లాడట్లేదు" అని రీతూ కన్నీళ్లు పెట్టుకోగా... పవన్, భరణి ఓదార్చారు. తర్వాత తనూజ వచ్చి రీతూని "ఆడియన్స్ కి బ్యాడ్ అవ్వొద్దు" అంటూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. ఫేవరిజం అంటూ కూర్చుంటే కుదరదని చెప్పింది. 'రంగు పడుద్ది' టాస్క్ గురించి మాట్లాడుతూ హర్ట్ అయ్యాను అని చెప్పింది తనూజ. లవ్ బర్డ్స్ రీతూ - డెమాన్ మధ్య చిన్న చిలిపి గొడవ జరిగింది. జైళ్లో ఉన్న ఫ్లోరాకు సంజన, ఇమ్మాన్యుయేల్ సీక్రెట్ గా ఫుడ్ ఇచ్చారు.
మూడవ వారంలో నామినేషన్లలో ట్విస్ట్
టెనెంట్స్ యాక్టివిటీ రూమ్ లో, ఓనర్స్ సోఫాలో ఉండగా... టెనెంట్స్ అందరూ ఏకాభిప్రాయంతో ఐదుగురు ఓనర్లను నామినేట్ చేయాలని, అందులో ఒకరు టెనెంట్ అయ్యి ఉండాలని చెప్పారు. అందరూ ఏకాభిప్రాయంతో కెప్టెన్ కాగానే ఈవిల్నెస్ చూపించిందని, అలాగే వీకెండ్ ఎపిసోడ్లో హరీష్ ఆడవాళ్ళను డి గ్రేడ్ చేసినట్టు పోర్ట్రైట్ చేసిందని, గతవారం టాస్క్ లో సుమన్ శెట్టిని గాజులు వేసుకుని కూర్చున్నారు అంటూ తక్కువ చేసి మాట్లాడిందని, పర్సనల్ అయ్యి క్యారెక్టర్ ను డిగ్రెడ్ చేస్తుందని సంజనను నామినేట్ చేశారు. వర్డ్స్ లూజ్ అవుతోంది, ఆమెకు ఒక స్టాండ్ లేదు, రాము బొమ్మలు తీసుకోవడం సెల్ఫిష్, అలుగుతుంది అంటూ రీతూని, డౌన్ అవుతున్నాడు, ఓన్ స్టాండ్ తీసుకోడు అంటూ సుమన్ శెట్టిని, ఫ్లోరాను, చివరగా అందరూ కలిసి హరిత హరీష్ ను నామినేట్ చేశారు.
లత్కోర్ పంచాయతీ...
నామినేషన్ల క్రమంలో రీతూ, పవన్ ల రిలేషన్ గురించి హరీష్ ఫైర్ అయ్యారు. ఆయన లత్కోర్ అనే పదం వాడడం కరెక్ట్ కాదని పవన్, శ్రీజ, ప్రియా చెప్పడంతో మళ్ళీ ఫైట్ మొదలైంది. అసలు ఆ పదం తప్పే కాదని వాదించుకున్నారు హరీష్.
ఈ వారం నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్స్
"టెనెంట్స్ చేసిన నామినేషన్ ప్రాసెస్ ని ఓనర్స్ చూశారు. ఇప్పుడు దాన్ని మార్చే పవర్ ఇస్తున్నాను" అంటూ బిగ్ బాస్ బిగ్ బాంబు పేల్చారు. "ఆల్రెడీ ఉన్న నామినేషన్లకి రెండు కొత్త నామినేషన్లను జోడించండి, టెనెంట్స్ చేసిన నామినేషన్లలో రెండు నామినేషన్లని స్వైప్ చేసే అధికారాన్ని మీకు ఇస్తున్నాను" అని బిగ్ బాస్ వెల్లడించారు. నామినేషన్ లిస్టులో ముగ్గురు టెనెంట్స్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. దీంతో సంజన, సుమన్ శెట్టి ప్లేస్ లో కళ్యాణ్, ప్రియాను స్వైప్ చేశారు. "గివ్ అప్ చేశావు" అంటూ రాముని నామినేట్ చేశారు. అలాగే సంచాలక్ గా తప్పు అంటూ రీతూని కూడా నామినేట్ చేశారు. చివరకు అందరూ కలిసి కళ్యాణ్, ప్రియ, ఫ్లోరా, రీతు, హరీష్, శ్రీజ, రాముని నామినేట్ చేశారు. స్పెషల్ పవర్ ను ఉపయోగించి నామినేట్ అయిన వారిలో శ్రీజను సేవ్ చేశాడు డెమాన్ పవన్. తర్వాత ఇమ్మాన్యుయేల్ శ్రీజను కూల్ చేసే ప్రయత్నం చేశాడు. రీతూ సైతం డెమాన్ తనను సేవ్ చేయలేదని ఎమోషనల్ అయ్యింది.






















