Bigg Boss Telugu 9 Day 9 Promo : కామనర్స్‌లో చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. మూడోవారం నామినేషన్స్‌లో ట్విస్ట్ మామూలుగా లేదుగా
Bigg Boss Telugu 9 Third Week Nominations : ఈ వారం నామినేషన్స్‌ని మరింత స్పైస్ అప్ చేశాడు బిగ్‌బాస్. కామనర్స్‌ని లోపలికి పంపించి నామినేషన్స్ వేయమని.. అలాగే ఓ ట్విస్ట్ కూడా పెట్టాడు.

Bigg Boss Telugu 9 Latest Promo : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 మూడోవారం చేరుకుంది. మొదటివారంలో శ్రష్టి వర్మ ఎలిమినేట్ అవ్వగా రెండో వారానికి గానూ మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే మూడోవారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో.. వారిని నామినేట్ చేయాలంటూ బిగ్‌బాస్ వచ్చేశాడు. ఇప్పటివరకు ఓనర్స్‌గా ఉన్న కామనర్స్‌ని నాగార్జున టెనెన్ట్స్గా మార్చేశాడు. అయితే వారిలో మరిన్ని గొడవలు పెట్టేందుకు బిగ్‌బాస్ గట్టిగానే ప్లాన్ చేశాడు.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమోలో ఏముందంటే..
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో(Bigg Boss Telugu 9 Third Week Nominations)ను విడుదల చేశారు. సోమవారం అంటేనే నామినేషన్స్ మొదలవుతాయని ఆడియన్స్ చాలా ఎదురు చూస్తారు. అయితే రావడం రావడమే గట్టి ట్విస్ట్‌తో నామినేషన్స్ మొదలు పెట్టాడు బిగ్‌బాస్. కామనర్స్ అందరినీ లోపలికి పంపించి.. వారిని నామినేషన్స్ వేయాలని సూచించాడు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ కూడా పెట్టాడు. అదేంటంటే వారిలో ఒకరు కచ్చితంగా కామనర్ కూడా ఉండాలంటూ చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు.
నామినేషన్స్‌లో ఎవరున్నారంటే..
లోపలికి వెళ్లినకామనర్స్ మాట్లాడుకుంటుండగా.. హరీశ్ నేను సంజనను నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఆమె కెప్టెన్ అయిన తర్వాత చాలా రూడ్‌గా బిహేవ్ చేసిందంటూ చెప్పాడు. అతని మాటను ఓ ఇద్దరూ సమర్థిస్తూ సంజనను నామినేట్ చేశారు. ప్రియా కూడ సంజనలో అహం కనిపించిందంటూ చెప్పుకొచ్చింది. ఉమెన్ను డీగ్రేడ్ చేశారంటూ శ్రీజ ఒకరిని నామినేట్ చేసింది. మొత్తానికి వీరంతా కలిసి సంజన, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీని నామినేట్ చేశారు.
కామనర్స్‌లో ఎవరు నామినేట్ అయ్యారంటే..
కామనర్స్‌లో నామినేషన్స్ చేసేందుకు చాలా గొడవలు జరిగాయి. ముఖ్యంగా శ్రీజకు, హరీశ్‌కు గట్టి ఫైటే జరిగింది. ఈ గొడవలో కూడా హరీశ్ రెస్పెక్ట్ ఇవ్వమంటూ అరిచేశాడు. కానీ ప్రోమో ముగిసే సరికి బోర్డులో అతని ఫోటో కూడా కనిపించింది. కాబట్టి ఈసారి నామినేషన్స్‌లో హరిశ్ కూడా ఉండనున్నారు. మరి ఓనర్స్ అదేనండి సెలబ్రెటీలు వచ్చి ఎవరిని నామినేట్ చేస్తారో.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరు ఉంటారో వేచి చూడాల్సిందే.
అయితే ఇదేవారం కొందరు సెలబ్రెటీలు హౌజ్‌లోకి రానున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. అంతేకాకుండా సీక్రేట్ రూమ్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే చిట్టిపికిల్స్ ఫేమ్ రమ్య హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తుందని చెప్తున్నారు. అలాగే స్టార్‌మాలో ఎక్కువగా కనిపించే సెలబ్రెటీలు లోపలికి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రసవత్తరంగా మారిన ఈ సీజన్ వారి ఎంట్రీతో మరింత ఎంటర్టైనింగ్గా మారనుందని స్టార్ మా భావిస్తుంది.





















