అన్వేషించండి

Nikhil Maliyakkal: 'ఊర్వశివో రాక్షసివో' సీరియల్‌ వదిలేసి బిగ్‌బాస్‌కు - నిఖిల్‌ రెమ్యునరేషన్‌ ఎంత? కృష్ణ, ముకుందలకు..

Bigg Boss 8 Telugu Contestants Remuneration: టీవీ సీరియల్స్‌ మంచి గుర్తింపు పొందిన నటుడు నిఖిల్‌, ప్రేరణ కంబం, యాష్మీ గౌడ్‌ బిగ్‌బాస్‌ రెమ్యునరేషన్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. 

రికొత్త థీమ్‌, సరికొత్త కంటెస్టెంట్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ 8 తెలుగు. ఈ సారి జంటలుగా కంటెస్టెంట్స్‌ని హౌజ్‌లోకి పంపారు. అలా ఏడు మంది అబ్బాయి, ఏడుమంది అమ్మాయిలను తీసుకువచ్చారు. అయితే ఈసారి ప్రేక్షకులకు పద్దగా పరిచయం లేని కంటెస్టెంట్సే ఎక్కువగా ఉన్నారు. ఈ 14 మందిలో జానాలకు ఎక్కువ పరిచయం ఉన్న కంటెస్టెంట్‌ ఒక్కరంటే ఒక్కరే ఉన్నారు. అదే యాంకర్‌ విష్ణు ప్రియ. ఆ తర్వాత సీరియల్‌ నటీనటులు ఉన్నారు.

ఇక మిగతా వారి మొఖాలు పెద్దగా ఎవరికి తెలియదు. దీంతో ఈ విషయంలో ఆడియన్స్‌ కాస్తా డిసప్పాయింట్‌మెంట్‌తో ఉన్నారు. కంటెస్టెంట్స్‌ పేర్లు, వివరాలు కూడా ఎవరికి తెలియకపోవడం అంతా వారి గురించి ఆరా తీసే పనిలో పడ్డారు. విష్ణు ప్రియ తర్వాత ఆడియన్స్‌ అంత ఆదరణ ఉంది టీవీ నటుడు నిఖిల్‌, ఆ తర్వాత 'కృష్ణ ముకుంద మురారి' హీరోయిన్లు ప్రేరణ కంబం, యాష్మీ గౌడలు ఉన్నారు. వీరికి బుల్లితెరపై ఫుల్‌ క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. సీరియల్స్‌ నటించిన మంచి గుర్తింపు పొందిన వీరు బిగ్‌బాస్‌లోకి రావడంతో వారి ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారు. సీరియల్స్‌ వదిలేసి బిగ్‌బాస్‌ వచ్చిన వారి రెమ్యునరేషన్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌ అవుతుంది.

నిఖిల్‌ రెమ్యునరేషన్‌

'గోరింటాకు' సీరియల్‌ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్‌. కన్నడ నటుడైన నిఖిల్‌ ఫస్ట్‌ సీరియల్‌తోనే మంచి గుర్తింపు పొందాడు. తనదైన నటనతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. ఈ గోరింటాకు సీరియల్‌ పూర్తయిన వెంటనే మరో సీరియల్‌ 'ఊర్వశివో రాక్షసివో' హీరోగా చాన్స్‌ కొట్టేశాడు. ప్రస్తుతం ఈ సీరియల్‌ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్న ఈ సీరియల్‌కి మధ్యలో బైబై చెప్పి బిగ్‌బాస్‌కి వచ్చాడు. సీరియల్‌ కూడా వదిలేసి బిగ్‌బాస్‌లోకి రావడంతో నిఖిల్‌ రెమ్యునరేషన్‌ ఎంతనేది అంత ఆరా తీస్తున్నారు. దీంతో అతడి రెమ్యునరేషన్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

కాగా స్టార్‌ మా సీరియల్స్‌తోనే హీరోగా మారిన నిఖిల్‌కి బుల్లితెరపై ఫుల్‌ క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా అతడికి లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కవ ఉందనడంలో సందేహం లేదు. అంతగా ఆడియన్స్‌ అదరణ పొందిన అతడు బిగ్‌బాస్‌లోకి ఎలా రాణిస్తాడనేది ఆసక్తి నెలకొంది. ఇక ఊర్వశివో రాక్షసివో సీరియల్‌కి మధ్యలోనే గుడ్‌బై చెప్పిన నిఖిల్‌ బిగ్‌బాస్‌కి వచ్చేందుకు భారీ రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడట. బిగ్‌బాస్‌తో జరిగిన ఢీల్‌ ప్రకారం అతడు వారానికి రూ. 3 లక్షలు పారితోషకం అందుకుంటున్నాడని సమాచారం. 

'కృష్ణ ముకుంద మురారి' భామలకు ఎంతంటే!

స్టార్‌ మా మంచి ఆదరణ పొందిన సీరియల్లో 'కృష్ణ ముకుంద మురారి'. ఇటీవలె ఈ సీరియల్‌కు శుభం కార్డు కూడా పడింది. దీంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ సీరియల్‌ ఇద్దరు హీరోయిన్లు కృష్ణ అలియాస్‌ ప్రేరణ, ముకుంద అలియాస్‌ యాష్మీ గౌడలు బిగ్‌బాస్‌తో అలరించేందుకు వచ్చారు. సీరియల్లో శత్రువులుగా నటించిన వీరిద్దరు హౌజ్‌లోకి రావడంతో మరింత ఆసక్తిని సంతరించుకుంది. ఇద్దరు నటన పరంగా, గ్లామర్‌ పరంగా బుల్లితెరపై ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్నారు.

ముఖ్యంగా కృష్ణ తెలివైన అమ్మాయిగా, తన భర్తను కోరుకుంటున్న ముకుందకు బుద్ది చెప్పే భార్యగా తన నటనతో ఆకట్టుకుంది. ముకుంద కూడా సీరియస్‌ రోల్లో, పెళ్లయినా.. ప్రియుడి కోసం తపించే ప్రియురాలిగా తన పాత్రలో లీనమైంది. ఇలా వీరిద్దరు ఒకరు పాజిటివ్‌ రోల్లో, మరోకరు నెగిటివ్‌ షేడ్‌లో కనిపించి బాగా పాపులర్‌ అయ్యారు. దీంతో బిగ్‌బాస్‌ టీం వీరిద్దరికి కూడా సమానంగా పారితోషికం ఇచ్చి హౌజ్‌లోకి దించింది. వీరిద్దరు వారానికి రూ. 2.5 లక్షల రెమ్యునరేషన్‌ అందుకుంటున్నారట. 

Also Read: బిగ్‌బాస్‌ నాకు సెకండ్‌ ఇన్నింగ్‌, లిమిట్‌లెస్‌ ఛాలెంజెస్ కావాలంటున్న అదిత్య ఓం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
GTA 6: జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Embed widget