అన్వేషించండి

Bigg Boss 8 Telugu Week 1 Nominations: 'బిగ్ బాస్ 8'లో సీరియల్ ఆర్టిస్టులకు షాక్ - ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లోని నలుగురిలో ఆ ముగ్గురూ...

Bigg Boss 8 First Week Nominations: తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 8లో  ఎంటరైన సీరియల్ ఆర్టిస్టులలో ముగ్గురికి ఫస్ట్ వీక్ షాక్ తగిలేలా ఉంది. నామినేషన్స్‌లోని నలుగురిలో ముగ్గురు వాళ్లే ఉండటం గమనార్హం.

తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 8లో సర్‌ప్రైజ్‌లు చాలా ఉంటాయని షో హోస్ట్, కింగ్ అక్కినేని నాగార్జున ముందు నుంచి చెబుతున్నారు. ఆడియన్స్, ఫ్యాన్స్ ఊహకు అందని విధంగా షో ఉంటుందని, లిమిట్ లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ అని స్పష్టం చేశారు. షో చూసే జనాలకు ఏమో గానీ హౌస్‌లోకి ఎంటరైన కొంత మంది సీరియల్ ఆర్టిస్టులకు ఫస్ట్ వీక్ షాక్ తగిలింది. నామినేషన్స్‌లో వాళ్ల పేర్లు ఉన్నాయి మరి. 

'బిగ్ బాస్ 8' ఫస్ట్ వీక్ నామినేషన్స్ షురూ...
ఆ నలుగురిలో ముగ్గురు సీరియల్ ఆర్టిస్టులే!
'బిగ్ బాస్ 8' నామినేషన్స్ ప్రక్రియ ఇవాళ మొదలు కానుందని తెలిసింది. ఈ రోజు రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో నామినేషన్స్ చూస్తారు. నలుగురి మెడ మీద ఎలిమినేషన్ కత్తి ఉందని తెలిసింది. 

బిగ్ బాస్ సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ రోజు సీరియల్ ఆర్టిస్ట్ నాగ మణికంఠకు షాక్ తగిలింది. హౌస్‌లోని ఒకరిని బయటకు పంపాలని అన్నప్పుడు ఐదుగురు అతనికి ఓటు వేశారు. ఇప్పుడు నామినేషన్స్ విషయంలోనూ అతని పేరు ముందు వచ్చింది. ఈసారి కన్ఫెషన్ రూంలో ఎంటరైన మొదటి కంటెస్టెంట్ అతనే అని తెలిసింది. 

బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో రెండో పేరు 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబం. ఆవిడ పేరు ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. ఆ హౌస్‌లో ఉన్న మరొక సీరియల్ ఆర్టిస్ట్, 'కృష్ణ ముకుంద మురారి' ఫేమ్ యష్మీ గౌడ, మరొక ఆర్టిస్ట్ నిఖిల్ మలియక్కల్ ఆవిడకు స్నేహితులే. పైగా, నిఖిల్ చీఫ్ అయ్యాడు కూడా! అయితే... యష్మీతో ప్రేరణకు చిన్న గొడవ ఏదో అయ్యిందని, అందువల్ల ఆవిడ నామినేషన్స్ లిస్టులోకి వచ్చిందని టాక్. మరొక సీరియల్ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ కూడా 'బిగ్ బాస్ 8' నామినేషన్స్ లిస్టులో ఉన్నాడని తెలిసింది. 

వరంగల్ కుర్రాడిని మొదటి వారం పంపిస్తారా?
'బిగ్ బాస్' సీజన్ 7 గుర్తు ఉందా? ఎటువంటి బ్యాగ్రౌండ్ లేని రైతు బిడ్ద పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి 'వరంగల్ డైరీస్' యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయిన యువకుడు, తెలంగాణ ముస్లిం బిడ్డ నబీల్ ఆఫ్రిదిని తీసుకు రావడంతో విన్నర్ రేసులో అతడు ఉంటాడని చాలా మంది భావించారు. అయితే... అనూహ్యంగా ఫస్ట్ వీక్ నామినేషన్స్ లిస్టులో అతను కూడా వచ్చాడు. నిఖిల్, నబీల్ మధ్య మొదటి రోజు చిన్నపాటి వాగ్వాదం జరిగింది. బహుశా... నబీల్ ఆఫ్రిది పేరును నిఖిల్ నామినేట్ చేశాడేమో!?

Also Read: నాగ మణికంఠను స్టెప్ ఫాదర్ ఇంటి నుంచి గెంటేశారా? వచ్చేశాడా? అసలు నిజం చెప్పిన చెల్లెలు

నాగ మణికంఠ, ప్రేరణ కంభం, పృథ్వీరాజ్... ఈ ముగ్గురిదీ సీరియల్ బ్యాగ్రౌండ్. ఫస్ట్ వీక్ ఈ ముగ్గురి పేర్లు వస్తాయని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతానికి వీరి పేర్లు నామినేషన్స్ లిస్టులో బలంగా వినబడుతున్నాయి. వాళ్లతో పాటు నబీల్ ఆఫ్రిది పేరు కూడా! మరి, ఈ రోజు రాత్రి ఎపిసోడ్‌లో వాళ్లు ఉంటారో? లేదో? వెయిట్ అండ్ సి.

Also Read: విష్ణుప్రియతో పాటు వాళ్లిద్దరూ... 'బిగ్ బాస్ 8'కు కిరాక్ ఖిలాడీ కనెక్షన్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget