అన్వేషించండి

Anchor Vishnu Priya Bhimeneni: విష్ణుప్రియతో పాటు వాళ్లిద్దరూ... 'బిగ్ బాస్ 8'కు కిరాక్ ఖిలాడీ కనెక్షన్!

Bigg Boss 8 Telugu: యాంకర్ విష్ణు ప్రియ భీమనేని, టీవీ సీరియల్ ఆర్టిస్ట్స్ ప్రేరణ కంబం, నిఖిల్ మలియక్కల్... ముగ్గురూ 'బిగ్ బాస్' సీజన్ 8లో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య ఉన్న ఓ కామన్ కనెక్షన్ ఏమిటో తెలుసా?

'బిగ్ బాస్' సీజన్ 8 ఆదివారం అట్టహాసంగా మొదలైంది. ఈసారి హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్లు అడుగు పెట్టారు. అందులో యాంకర్ విష్ణు ప్రియ భీమనేని (Vishnu Priya Bhimeneni) ఒకరు. 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబం (Prerana Kambam) సైతం 'బిగ్ బాస్ 8'లో ఉన్నారు. వీళ్లిద్దరితో పాటు మరో సీరియల్ ఆర్టిస్ట్ నిఖిల్ మలియక్కల్ (Nikhil Maliyakkal)... ఈ ముగ్గురి మధ్య ఒక కామన్ కనెక్షన్ ఏమిటో తెలుసా?

కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్ to బిగ్ బాస్!
తెలుగు టీవీ సీరియళ్లు, షోలు చూసే జనాలకు విష్ణు ప్రియ, ప్రేరణ, నిఖిల్ బాగా తెలుసు. ఇద్దరు సీరియల్స్ ద్వారా పాపులర్ అయితే... మరొకరు టీవీ షోస్ వల్ల పేరు పొందారు. అయితే... ఈ ముగ్గురూ 'బిగ్ బాస్' ఇంటిలో అడుగు పెట్టడానికి ముందు మరొక షో చేశారు. అదే 'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గాళ్స్'.

'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గాళ్స్' షో టెలికాస్ట్ అయ్యింది కూడా స్టార్ మా ఛానల్‌లోనే. ఆ షో కంప్లీట్ అయ్యిందో... లేదో... సేమ్ టైం స్లాట్, సేమ్ ఛానల్, సేమ్ టీవీలో వచ్చే మరొక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఈ ముగ్గురికీ వచ్చింది. మరి, 'కిరాక్ బాయ్స్ - ఖిలాడీ గాళ్స్'లో ఉన్న పరిచయం ఈ షోలో కంటిన్యూ అవుతుందా? లేదంటే ఎవరికి వారు కొత్త గ్రూపులు కడతారా? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

నిఖిల్ అంటే విష్ణు ప్రియ భీమనేనికి క్రష్!
సీరియల్స్ లేదా టీవీ షోస్ చేసేటప్పుడు కో స్టార్స్ మీద ఫీలింగ్స్ ఏర్పడటం చాలా కామన్. యాంకర్ కమ్ యాక్ట్రెస్ విష్ణు ప్రియ భీమనేనికి సైతం ఆ విధంగా నిఖిల్ మలియక్కల్ మీద ఫీలింగ్స్ ఏర్పడ్డాయి. 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్' షోలో ఆ విషయం చెప్పారు. విష్ణుకు మాత్రమే కాదు... ఆమె ఫ్రెండ్ రీతూ చౌదరికి కూడా నిఖిల్ అంటే ఇష్టమే. ఇద్దరూ ఆ విషయం చెప్పడంతో ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకే అబ్బాయిని ప్రేమిస్తున్నారని సోషల్ మీడియా అంతా కోడై కూసింది.

'బిగ్ బాస్ 8'లోకి రీతూ చౌదరి (Rithu Chowdary) సైతం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగు పెట్టే ఛాన్సులు ఉన్నాయని వినబడుతోంది. మరి, ఆమె కూడా వస్తే విష్ణుకు ఓ ఫ్రెండ్ దొరికినట్టే. 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్'లో విష్ణు ప్రియ, ప్రేరణ ఫ్రెండ్స్ అయ్యారు. మరి, 'బిగ్ బాస్ 8'లో స్నేహితులుగా ఉంటారో? శత్రువులు అవుతారో? వెయిట్ అండ్ సి

Also Readకృష్ణకు పోటీగా 'బిగ్ బాస్ 8'లోకి వచ్చిన ముకుంద... మిస్ మైసూర్ to షో... యష్మీ గౌడ లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని విషయాలు

ప్రేరణకు ఆల్రెడీ యష్మీ గౌడ తెలుసుగా!
'బిగ్ బాస్ 8' ఇంటిలో ఎవరెవరు ముందుగా స్నేహితులు అవుతారు? అనేది చూసే ముందు స్నేహితులు ఎవరెవరు వచ్చారు? అనేది చూస్తే... యష్మీ గౌడ, ప్రేరణ కనిపిస్తారు. వీళ్లిద్దరూ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ చేశారు. ఆ పరిచయం వల్లే ప్రేరణ 'బిగ్ బాస్' ఇంటిలోకి వెళ్లిన వెంటనే యష్మీని హగ్ చేసుకుంది. 'ఇక్కడ కూడా వదలవా?' అని యష్మీ సరదాగా వ్యాఖ్యానించింది.

Also Read'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget