Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక వెంటనే నీ దగ్గరకు వస్తా... కావ్య గురించి చెబుతూ నిఖిల్ కంటతడి
Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారం ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్‌తో కంటెస్టెంట్లు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదే ఫ్లో లో తమ తమ లవ్ స్టోరీలను షేర్ చేసుకున్నారు.
Nikhil Kavya Love and Breakup Story: బిగ్ బాస్ ఇంట్లో 11వ వారం కూడా గడిచిపోయింది. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్‌తో కంటెస్టెంట్లు ఫుల్ ఛార్జ్ అయ్యారు. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చి శుక్రవారం నాడు ఏం జరిగిందో చూపించాడు. అందులో కంటెస్టెంట్లు తమ తమ లవ్ స్టోరీలను చెప్పేశారు. ఈ క్రమంలో యష్మీ గౌడ, జబర్దస్త్ రోహిణి, టేస్టీ తేజలు తమ తమ ప్రేమ కథల్ని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నిఖిల్ తన లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి చెప్పాడు.
యష్మీ గౌడ తన ప్రియుడ్ని ఈ జన్మకు పెళ్లి చేసుకోలేనని, వచ్చే జన్మనంటూ ఉంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. పృథ్వీ కాలేజ్ లవ్ స్టోరీ చెప్పేశాడు. అంతా సెట్ అయిందట కానీ.. వెంటనే పెళ్లి అంటే కుదరదని, తన కెరీర్ గోల్ వేరే అని చెప్పాడట. దీంతో పరస్పర అంగీకారంతో బ్రేకప్ చెప్పుకున్నారు.
తేజ అయితే తాను అంత అందంగా లేడని చెప్పి బ్రేకప్ చెప్పేశారట. ఫ్యామిలీ మెంబర్లకు ఇష్టం లేదని చెప్పి వెళ్లిపోయిందట. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమె ఫోన్ చేసి మిస్ యూ అని చెప్పిందట. తాను ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా అమ్మలా చూసుకుంటాను అని చెప్పాడు. రోహిణి తన ప్రియుడి చేతిలో మోసపోయిందట. ఆల్రెడీ రిలేషన్ షిప్‌లో ఉండి తనను మోసం చేశాడట. అయితే ఇప్పుడు నువ్వు సింగిల్ కదా? అని రోహిణిని తేజ అడుగుతాడు. సింగిల్ రెడీ టు మింగిల్... కానీ నీతో కాదు అని తేజ మొహం మీదే రోహిణి చెప్పింది.
ఇక నిఖిల్ తన ప్రేమ కథను చెప్పి ఏడ్పించేశాడు. తనను తాను ఇంకా వదిలేయలేదని, ఆమెతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయని, ఆమె ఎప్పటికీ నా భార్యే... షో నుంచి బయటకు వెళ్లిన వెంటనే ఆమె దగ్గరకు వెళ్తా.. మళ్లీ బతిమిలాడుతాను.. కొడితే.. పడతాను.. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా కొట్టించుకున్నాను.. ఓ బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమిస్తుందో అలా నన్ను కూడా క్షమించు.. నేను చేసిన వాటికి సారీ చెబుతున్నా అంటూ నిఖిల్ ఏడ్చేశాడు. అంటే కావ్యను నిఖిల్ ఒప్పించే ప్రయత్నం ఇంకా చేస్తాడనిపిస్తోంది.
Also Read: బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే డేట్ ఫిక్స్... ఈ షో ఎండ్ చేయబోయేది ఎప్పుడో తెలుసా?
ఆ తరువాత కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్లు, గెస్టులు స్టేజ్ మీదకు వచ్చారు. టాప్ 5 కంటెస్టెంట్ల లిస్ట్‌లను పెట్టారు. ఈ వారం నో ఎలిమినేషన్ అన్నట్టుగా కనిపిస్తోంది. చివరి వరకు తేజ, అవినాష్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నారనిపిస్తోంది. కానీ నబిల్ ఎవిక్షన్ షీల్డ్ వాడినట్టుగా తెలుస్తోంది. అసలేం జరిగిందో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.